Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పిల్లలకు విలువలు నేర్పండి!

1. అవసరం లేదని భావిస్తే మీరు బిడ్డకు ఏ వస్తువూ కొనటం లేదా బహుమతిగా ఇవ్వటం వంటివి చేయకండి. పిల్లలు కోరిన దానికి మీరు వెంటనే అంగీకరించకండి. పిల్లలు అన్నీ వారికి ఎంతో తేలికగా ఏర్పడుతున్నాయని భావిస్తే....వారికి వాటి వెనుకగల కష్టం తెలియదు.
2. కొంతమంది తల్లితండ్రులు పిల్లలను అతి జాగ్రత్తలతో పెంచుతారు. ఈ కారణంగా పిల్లలు వారి బాగోగులు తెలుసుకోలేరు. ఉదాహరణకు పిల్లవాడు లేదా పిల్ల స్కూలుకు బస్ లో వెళ్ళటం ఎంతో సురక్షితమైనప్పటికి వారికి ఒక స్కూటరో లేక మోపెడ్ వంటిది కొనిస్తే ఇక భవిష్యత్తులో వారు బస్ ప్రయాణానికి ఇష్టపడక వారి రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకోలేరు.
3. అతిగా గారాబం చేయబడిన పిల్లల ప్రవర్తన వేరుగా వుంటుంది. వారు ఇతరులను అవమానపరచే స్ధాయికి కూడా ఎదుగుతారు. చివరకు తల్లితండ్రులకే సమస్య అయ్యే ప్రమాదం వుంది. కనుక వారికి ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రేమను లేదా వస్తువులను అందించండి.
4. గారాబంతో చెడిపోయిన పిల్లలు, ఎంతసేపూ తమ ఆధిక్యత నిరూపణకై పోరాడతారు. కోపం తెచ్చుకుని ప్రవర్తన చెడగొట్టుకుంటారు. చెప్పిన మాటలు వినరు. కనుక తల్లితండ్రులు పిల్లలతో చక్కని సమయం గడుపుతూ వారికి అన్నీ వివరించాలి కాని, వారు కోరినదల్లా ఇచ్చి గారాబం చేయరాదు.
5. ఉద్యోగస్తులైన మహిళలు తగిన సమయాన్ని పిల్లలకు అందించలేక, వారికి బహుమతులిస్తారు. బదులుగా వారు వారితో కలసి షికారుకి వెళ్ళడం, వారి అవసరాలు, కష్టాలు తెలుసుకోవడం, తగిన పరిష్కారాన్ని సూచించడం వంటివి చేయాలి. అపుడే వారు ప్రపంచాన్ని అర్ధం చేసుకోగల అవకాశం కలిగి వుంటారు.



Click it and Unblock the Notifications
