Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శరీరంలో కంపుకొట్టే భాగాలు!

1. జననాంగాలు - జననాంగాలు త్వరితంగా మురికిపట్టి వాసన వచ్చేస్తాయి. దీనికి కారణం అవి వేడిగా, చెమటతో వుండి అనేక గ్రంధులు కలిగి వుండటమే. గ్రంధులనుండి తయారైన ద్రవాలు వెంట్రుకల కుదుళ్ళనుండి వేగంగా బయటకు వచ్చే అవకాశం కూడా వుంది. ఇది యోనిలో కలిగి ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా వుంది. ఈ భాగాలు చాలావరకు బయటిగాలి తగలకుండా వుంటాయి. సింధటిక్ దుస్తులతో కప్పబడతాయి ఈ దుస్తులు చెమటను పీల్చవు. కనుక అక్కడ తేమ వుండి బాక్టీరియా చేరుతుంది.
2. చంకలు - శరీర కంపు అనగానే ప్రతి ఒక్కరికి చంకలు గుర్తు వస్తాయి. ఈ భాగంలో వెంట్రుకలు వుండి చెమట గ్రంధులు చాలా వుంటాయి.
3. పాదాలు - పాదాలు కూడా వాసన వస్తాయి. చాలామంది షూస్ వంటివి ధరించి రోజులో చాలా భగం పాదాలను మూసి వుంచడంతో అవి చెమట పట్టి వాసన వస్తాయి. బాక్టీరియా చేరి వాసనతో పాటు పాదాల వేళ్ళ మధ్య ఇన్ ఫెక్షన్ కూడా వస్తుంది.
4. నోరు - నోటిలో మనం తిన్న ఆహారం కారణంగా కొంత వాసన ఏర్పడుతుంది. కాని చిగుళ్ళలో నిలబడే బాక్టీరియా వలన, నాలిక పాచి పట్టడం వలన కూడా వాసన వస్తుంది. కడుపులో ఏర్పడే వ్యాధులు, గ్యాస్ మొదలైన వాటికారణంగా శ్వాసలో వసన వస్తుంది. శ్వాసలో చెడువాసనలు డయాబెటిస్, గ్యాస్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు కల పెద్దవారిలో అధికంగా వుంటాయి.
5. మాడు లేదా తలపై భాగం - తల వెంట్రుకలు షాంపూ వంటి వాటితో సరిగా పోషణ చేయని వారికి తలభాగం వాసన వస్తుంది. తలలో వుండే నూనె గ్రంధులు బాక్టీరియా ఎదుగుదలకు తోడ్పడి వాసన కలిగిస్తాయి. టోపీ వంటివి ధరించేవారికి తలమాడు మరింత వాసన వస్తుంది.
పైన తెలిపిన శరీర భాగాలను పిల్లలు, పెద్దలు, ప్రతిరోజూ శుభ్రపరచుకోవడం చేస్తే, చర్మానికి వచ్చే వ్యాధులను కొంతమేరకు అరికట్టవచ్చు.



Click it and Unblock the Notifications