Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ పిల్లలలో సృజనాత్మకత త్వరగా పెంచండి!

ఒక కధ చెప్పండి - ఊహా శక్తి పెరగటానికి గాను పిల్లలకు కధలు చెప్పాలి. సాధారణంగా పిల్లలకు కధను మించిన సాధనం లేదు. కధలే పిల్లలకు ప్రపంచం అంటే ఏమిటో తెలియజేస్తాయి. బొమ్మలు, విద్యాపర ఛార్టులు, ఇతర ఆటవస్తువులు, వంటివి పిల్లలకు మంచి అనుభవాలను అందిస్తాయి. రోజులో జరిగే చర్యలను కధలద్వారా వివరించండి. పిల్లల ఆసక్తిని నిర్మాణాత్మకంగా మలచాలి. ప్రతి కధా ఆసక్తికరం గా చేయవచ్చు. అవి వారికి పెయింటింగ్, కుకింగ్ మొదలైన విషయాలను తెలియజేస్తాయి.
ముగింపు - పిల్లలకు కధ అంతా చెప్పిన తరువాత కధ ముగింపు ఆలోచించి వారినే చెప్పమనాలి. అపుడు వారిలో ఊహా శక్తి పెరుగుతుంది. ముగింపులకు కూడా ప్రత్యామ్నాయాలు సూచించమనాలి. ఉదాహరణకు డినోసార్ జంతువులు మనం కూర్చున్న ధియేటర్ లోకి వస్తే ఏం చేస్తావని ప్రశ్నించాలి. పిల్లలకు వారి బొమ్మలలో రంగులవారీగా వరుసలో పెట్టమని చెప్పాలి. వారి గదిని సర్దుకోవటంలో కొంత సమయం కేటాయించి ఏది ఎక్కడ పెట్టాలో తెలుపాలి. వారి ఆట వస్తువులను పెద్దవి, మీడియం, చిన్నవి గా ఏర్పాటు చేయమనాలి. వారిలో లెక్కలు, రీజనింగ్ మైండ్ అభివృధ్ధి చెందుతుంది.
చురుకు - పిల్లలను చురుకుగా వుంచాలి. వారికి వేటిపట్ల ఆసక్తి వుందో గమనించాలి. దానికి సంబంధించిన పిల్లలతో వారికి స్నేహం ఏర్పరచాలి. ఉదాహరణకు పిల్లవాడికి మ్యూజిక్ అంటే ఆసక్తి వుంటే, అతను నేర్చుకుంటుంటే, మ్యూజిక్ బాగా తెలిసిన పిల్లలను పిలిచి ఇంటిలో ఒక ప్రొగ్రాము ఏర్పరచండి. అదే రకంగా వారిని కధలు వ్రాయమని కూడా ప్రోత్సహించండి. వారి ఆలోచనా శక్తి పెంచేందుకు ఒక పక్షి, గుర్రం, డాల్ఫిన్ వంటి వాటి గురించి వ్రాయమనండి. పజిల్స్, బోర్డ్ గేములు, బిల్డింగ్ బ్లాకులు, వారిలో ఆలోచన పెంచుతాయి. చిన్నతనం నుండి వారికి వ్రాయడం నేర్పిస్తే, ఆలోచనా పరిధి పెరుగుతుంది.
ఆసక్తి - పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి వుందో పరిశీలించండి. వారికి ఆసక్తికల రంగాలలో మీరు ప్రోత్సహించినట్లయితే, వారి ప్రతిభా పాటవాలు పెరిగి అందులో ఉన్నతులవుతారు. మిడ్డను ఆలోచించనివ్వండి. స్వేచ్ఛగా తన భావాలను ప్రకటించనివ్వండి. అతనికై అతనే వాస్తవాలను వెల్లడిచేయనివ్వండి. మీ బిడ్డ ఆలోచనలకు విలువనివ్వండి. పిల్లలు వారున్న పరిస్ధితులనుండే నేర్చుకుంటారు. గుర్తింపునిస్తే వారు లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ప్రోత్సహిస్తే తమలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు.



Click it and Unblock the Notifications