Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పిల్లల విజయాలు తల్లితండ్రుల సహకారం పైనే!

తాజాగా స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చేయబడిన ఒక రీసెర్చి మేరకు తల్లితండ్రులు, టీచర్లు సున్నితమైన పిల్లల్ని పెంచటం కష్టమని వారిలో తెలివితేటలు అధికంకావాలంటే ఎంతో కష్టపడాలని భావిస్తారని, అయితే సున్నితమైన పిల్లలు ప్రత్యేకమైన తెలివితేటలు కలిగి సరైన వాతావరణంలో ఎంతో అభివృధ్ధి చెందుతారని మొదటినుండి తెలివైన వారుగా భావించే పిల్లల కంటే కూడా వీరు భవిష్యత్తులో ఎంతో బాగుంటారని తేలింది.
రీసెర్చర్లు తమ పరిశోధనలో 338 కిండర్ గార్టెన్ పిల్లలను పరిశీలించారు. వారి టీచర్లతోను, కుటుంబ సభ్యులతోను విచారించారు. కుటుంబ పరిస్ధితుల ప్రభావం వారిపై ఎలా వుంటుందనేది గమనించారు. కుటుంబ ప్రభావాలు వారి కెరీర్ అభివృధ్ధికి ఏరకంగా దోహదం చేస్తాయనేది రీసెర్చి చేశారు. వారి పరిశోధనలో, కుటుంబంలో జరిగే చెడు, మంచి రెండు రకాల సంఘటనలు వారిపై ప్రభావాన్ని చూపి ఒత్తిడి కలిగిస్తున్నాయని, ఈ రకంగా కలిగే ఒత్తిడి వారి భవిష్యత్ అభివృద్ధికి దోహదపడుతోందని వెల్లడించారు.
పిల్లలు ఎంత అమాయకంగా వున్నప్పటికి సరైన రీతిలో పెంపకాలు చేస్తే అది వారి భవిష్యత్తుకు బాగా ఉపయోగపడగలదని తెలిపారు. కనుక పిల్లలకు ఒత్తిడి ఇవ్వకపోవటమనేది సరికాదని, ఒత్తిడి ఇవ్వటం మంచిదేనని అపుడే వారి బుద్ధి బాగా వికసిస్తుందని రీసెర్చర్లు వెల్లడించారు.



Click it and Unblock the Notifications
