Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పిల్లలతో ఎప్పటికి అనకూడని విషయాలు!

1. నీ వయసులో వున్నపుడు నేను ఎంతో భాధ్యతగా వుండేవాడిని - ఈ మాట అంటే చాలు పిల్లలు కోపం తెచ్చుకుంటారు.
2. నీవు ఎల్లపుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకుంటావు - ప్రతివారూ తప్పులు చేస్తారు. అలానే మీ బిడ్డ. ఇంకా నేర్చుకునే దశలోనే వుంది. కనుక మీరు ఆమె లేదా అతనిని నిందించాల్సిన అవసరం లేదు. ఒక తల్లి లేదా తండ్రిగా మీరు వారికి మార్గదర్శకులుగా వుండాలి.
3. నీ సోదరుడు లేదా సోదరిలా నువ్వు ఎందుకు వుండలేవు? ఇది కూడా అసమంజసమైన పోలికే. అంతేకాదు వారిపట్ల ద్వేషం పెంచుతుంది. పోటీ తత్వం పెరుగుతుంది. వ్యతిరేక భావనలు ఏర్పరచుకుంటారు. కనుక పిల్లలకు ఇటువంటివి చెప్పకండి.
4. నన్ను ఒంటరిగా వుండనివ్వు! - మనకు ఎన్నో పనులుండేమాట వాస్తవమే. కాని పిల్లలు వాటి ప్రాధాన్యతలను గ్రహించలేరు. అసహనంగా మీరు ఈ మాట అంటే పిల్లలు తమను అశ్రద్ధ పరచినట్లు భావించి మనోవేదనకు గురవుతారు. కనుక మీరే కొంచెం సహనం చూపండి.
5. నువ్వు సిగ్గు పడాలి - ఈ మాటంటే ఏ పిల్ల లేదా పిల్లాడైనా సరే చాలా అవమానించినట్లు భావిస్తాడు. చెడుగా భావిస్తాడు. వెంటనే మరింత అల్లరిగాను కఠినంగాను తయారయ్యే ప్రమాదం వుంది. ఇలా అనే కంటే వారికి మంచి ఏదో, చెడు ఏదో విడమరచి చెప్పటం మంచిదిగా భావించాలి.



Click it and Unblock the Notifications