Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పిల్లలకు రాత్రి భయాలు ఎలా వుంటాయి?

సాధారణంగా రాత్రివేళ, నిద్ర అనేది కొన్ని దశలవారీగా వుంటుంది. ప్రతి దశ కూడా ప్రత్యేకించి బ్రెయిన్ చర్యలపై ఆధారపడివుంటుంది. ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ అనే దశలో (దీనినే రెమ్ దశ అని కూడా అంటారు) చాలా వరకు కలలు సంభవిస్తాయి. అయితే, రాత్రి భయాలనేవి లోతైన రెమ్ దశలో కాకుండా వస్తాయి. పీడకలలు రెమ్ నిద్రా దశలో వస్తాయి. కనుక రాత్రి భయం అనేది టెక్నికల్ గా పరిశీలిస్తే కల కాదు. కాని అది అకస్మాత్ గా ఒక నిద్రా దశనుండి మరో నిద్రా దశకు చేరేటపుడు సంభవించుతుంది.
పిల్లవాడు పడుకున్న రెండు లేదా మూడ్ గంటల తర్వాత వచ్చే నిద్రా దశలో ఈ రాత్రి భయాలు వస్తాయి. అంటే అపుడు అతను ఒక దశ నిద్రనుండి మరో దశనిద్రకు చేరుతున్నాడన్నమాట. ఈ మార్పు సాధారణంగా సున్నితంగానే వుంటుంది. కాని అరుదుగా ఈ సమయంలో పిల్లలు ఆందోళన చెందుతారు. అవే రాత్రి భయాలుగా వారిలో ప్రదర్శించబడతాయి.
ఈ రాత్రి భయంలో పిల్లలు లేచి కూర్చొని అరుస్తారు. భయపడతారు. వారి శ్వాస, గుండె కొట్టుకోవటం వేగంగా వుంటాయి. కొన్నిసార్లు చెమట, దిక్కులు చూడటం కూడా జరుగుతుంది. అయితే, వీరు కొన్నిసార్లు కొద్ది నిమిషాలలో మామూలు స్ధితికి చేరుకుని నిద్రిస్తారు. అయితే, పీడకల వలే కాకుండా ఇవి పిల్లలకు మరుసటి రోజుకు గుర్తుండవు. దీనికి కారణం వారిలోని నరాల వ్యవస్ధ బలపడకపోవటంగా లేదా వారి కుటుంబంలో అదివరకు ఎవరికైనా వున్నా వస్తుందని పరిశోధకులు చెపుతారు.
బాగా అలసినా, లేదా నిందించబడినా, ఒత్తిడి కలిగించినా, లేక ఇంటినుండి దూరంగా వున్నా వారిలో ఈ పరిస్ధతి ఏర్పడుతుంది. రాత్రి భయం కలిగి వారు నిద్రలో ఉలిక్కిపడుతున్నపుడు వారిని లేపకపోవటం మంచిది. ఒకవేళ నిద్ర లేపినప్పటికి వారు ఏం జరిగిందో తెలియక ఖంగారు పడుతూనే వుంటారు. మరల స్ధిమితపడటానికి, మరోమారు సవ్యంగా నిద్రించటానికి ఇబ్బంది పడతారు. ఈ రకమైన పిల్లల రాత్రి భయాలకు, నిద్రలో ఉలిక్కిపడటాలకు మందులు లేదా చికిత్స వంటిది ఏమీ లేదు. కాని వారికిగల భయాలను కాలక్రమేణా సరైన సలహాలతో వారికి వివరణలు ఇస్తూ తగ్గించవచ్చు. వారి కేంద్రీయ నరాల వ్యవస్ధ ఒకసారి బలపడిందంటే, పిల్లలలో ఈ సమస్య తొలగినట్లే భావించవచ్చు. అవసరమనుకుంటే, వైద్య సలహాలు పాటించి అతనికి తగిన ధైర్యం చేకూర్చండి.



Click it and Unblock the Notifications











