For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు చేసే 5 పొరపాట్లు..

By Super
|

తల్లిదండ్రులు విడిపోవడం అనేది పిల్లలు త్వరగా జీర్ణం చేసుకోలేని విషయం. విడాకులు తీసుకున్న తల్లి తండ్రుల పిల్లలు తాము కష్టకాలం ఎదుర్కోబోతున్నారని భావిస్తారు. తల్లిదండ్రులలో ఏ ఒక్కరు దూరమైనా పిల్లలు బాధపడతారు. అలాంటిది విడాకుల రూపం లో తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు తమ నుంచి దూరం అవడాన్ని పిల్లలు తట్టుకోలేరు. తమకు అండగా నిలిచే తల్లిదండ్రులు ఈ రూపం లో దూరం గా వెళ్ళిపోవడం పిల్లలకి కొంచెం ఇబ్బందికర విషయమే.

విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లల పై ఆ ప్రభావం పెద్దయ్యాక కూడా ఉంటుంది. ఆ గాయాలు మానవు. అయితే, విడిపోయిన భార్యా భర్తలు తమ బిడ్డలపై ఎటువంటి ప్రతీకుల ఫలితాలు లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Top 5 Mistakes Divorced Parents Make

విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు చేసే అయిదు పొరపాట్లు
1. మీ పిల్లలని రాయబారానికి ఉపయోగించకండి - చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలని విడిపోయిన భార్య లేదా భర్త తో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించుకుంటారు. పెద్దవాళ్ళే హేండిల్ చెయ్యలేని స్ట్రెస్ ని పిల్లలకు అందించడం మంచిది కాదు. ఆ కమ్యూనికేషన్ లో భాగం గా పిల్లలపై అనవసరపు మానసిక ఒత్తిడి పడుతుంది. దీని ద్వారా ఇదివరకు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న విషయం జీర్నిన్చుకోకుండానే మళ్ళీ కొత్త గాయం ఏర్పరచినవారవుతారు. అంతే కాకుండా, మీరు పంపించే మెసేజ్ లో రికార్డు అయితే అవి కోర్ట్ వారు స్వీకరించదగ్గవి. కాబట్టి ఆ విధం గా చూసినా పిల్లలతో రాయబారం మంచిది కాదు.

2. మీ పిల్లలని తెరపిస్ట్ ని చెయ్యకండి

టీనేజ్ పిల్లల మానసిక స్థితి వారి హార్మోన్ల ప్రభావం వల్ల అదుపులో ఉండదు. వాళ్లతో మీ డివోర్స్ విషయాలు పంచుకోవడం మంచిది కాదు. తల్లిదండ్రులుగా టీనేజ్ వయసు పిల్లలపై పడే ఒత్తిడి ని కంట్రోల్ చెయ్యవలసిన బాధ్యత మీదే. ఇలా పెద్దవాళ్ళ విషయాలు పిల్లలతో పంచుకోవడం వల్ల వారు మరింత అసహనానికి గురి అవుతారు. ఒక వేళ మీకు సహాయం కావాలంటే బయట మీ స్నేహితులనో లేదా బంధువులనో అడగండి. ఇంకా అవసరం అయితే థెరపీ చేయించుకోండి. అంతే కానీ, ఇటువంటి విషయాలు మీ పిల్లలతో పంచుకోవడం సమంజసం కాదు.

3. మీ పిల్లలను పొందడానికి ప్రయత్నించండి - తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తరువాత పిల్లల మనస్సులు కలత చెంది ఉంటాయి. వారిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి మాటలు వినండి. ఎలా ఆలోచించాలో వారికి చెప్పకండి. ఎప్పుడూ వారి ముందు మీ మాజీ భర్త ని లేదా భార్య ని విమర్శించకండి. ఎందుకంటే, వారిని విమర్శిస్తే మీ బిడ్డను మీరు విమర్శించినట్టు. మీ బిడ్డ కి వారు కూడా తల్లి లేదా తండ్రే కదా. మీ పిల్లలు మీకేం చెప్పాలనుకుంటున్నారో అర్ధం చేసుకుని దానికి తగినట్టుగా స్పందించండి. తల్లిదండ్రులుగా మీరు ఆ సమస్యని తీర్చకపోయినా వినడం కనీస ధర్మం. ప్రేమ తో ఎటువంటి బాధనైనా నయం చేయవచ్చు.

4. థర్డ్ డిగ్రీల ని అవాయిడ్ చెయ్యండి - పిల్లలతో ఏ విషయం చెప్పకపోవడం కూడా వారిని మానసికం గా హింసించడమే. పిల్లలపి దుష్ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. అందువల్ల మీ పిల్లలతో మాట్లాడి వారికున్న సాధారణ ప్రశ్నలు తెలుసుకుని వారు సంతృప్తి పడే విధం గా సమాధానాలు చెప్పండి.

5. మీరు చేసిన గాయాన్ని తగ్గించండి
విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు తెలిసో తెలియకో పైన పెర్కొన్నటువంటి గాయాలు ఎక్కువశాతం చేస్తారు. కాబట్టి, వారి మనస్సులను అర్ధం చేసుకుని వారి గాయాన్ని తగ్గించే విధం గా కృషి చెయ్యండి. వారికీ అర్ధం చేసుకునేజ సామర్ధ్యం వచ్చే వరకు కోపం లాంటి గుణాలు కనపడతాయి. తల్లిదండ్రులుగా వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది. అవసరమైతే క్షమాపణలు చెప్పడానికి కూడా వెనుకాడకండి. ఒక వేళ మీరు తప్పు చేస్తే అందుకు తోడ్పడిన కారణాల గురించి వివరించండి.

మీ పిల్లలకి అర్ధమయ్యేటట్టుగా సంకేతాన్ని అందించండి. మీరు మీ మాజీలని విమర్శించే సమయం లో మీ పిల్లలను వారించమానని. మీరు మీ మాజీల గురించి ఆలోచించాల్సిన సమయం ఇది కాదని గుర్తు చెయ్యమనండి.

ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలపై దుష్ప్రభావం ఉండదు.

English summary

Top 5 Mistakes Divorced Parents Make | విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు చేసే 5 పొరపాట్లు..

Breaking up is hard to do, and it may be especially hard for kids. Kids of divorce can feel they've been hit the hardest by the end of their parents' relationship. Some are asked to broker peace between warring exes, even as they are grieving the loss of a parent who has abruptly moved out. Others must deal with parents who suddenly can't cope with everyday tasks, like making dinner or helping with homework.
Desktop Bottom Promotion