Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలు సంతోషంగా నిద్రపోవడానికి సహాజ చిట్కాలు
నేటి యాంత్రికయుగంలో, ప్రతి పనినీ టైముతో ముడిపెట్టి చేసే హడావుడి రోజుల్లో పిల్లలు రాత్రిపూట నిద్రపోకపోతే పెద్దలకు ఇబ్బందిగానే ఉంటుంది. ఆ ఇబ్బంది నుండి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాల్సిందే...
1. ముందుగా పిల్లలు ఒక నిర్ణీతమైన సమయం ప్రకారం నిద్రపోయేలా సమయపాలన పాటించేలా చూడాలి. పిల్లలకు రాత్రిపూట ఫలాన సమయంలో నిద్రపోవాలనే భావనను అలవాటుగా మార్చాలి.
2. నిద్రకు సంబంధించిన వరస సంఘటనలను పిల్లల మదిలో నిక్షిప్తం చేయగలిగితే, రెండు, మూడు వారాల్లో కొత్త రొటీన్ కు అలవాటుపడతారు. ఉదాహరణకు: రాత్రిపూట ఏడింటికి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించడం, స్నానం చేసేప్పుడు నీళ్ల మీద తేలే బొమ్మలను ఆడుకోవడానికి ఇవ్వడం.
3 రంగురంగుల బొమ్మలు ప్రింట్ చేసిన నైట్ డ్రస్‌ను తొడగడం.
4. మంచి సుగంధ భరితమైన పౌడర్‌ను రాయడం, నిద్రకు ముందు మంచి కథను చెప్పడం, వీలైతే మంచి సంగీతాన్ని వినిపించడం. ఇవన్నీ పిల్లలు ఇష్టపడే అంశాలు. వీటిని రోజూ క్రమం తప్పకుండా ఆచరిస్తే కొన్ని రోజులకు పిల్లల్లో ఈ విధానం సహజనిద్రను ప్రేరేపిస్తుంది.
5. పాప నిద్రిస్తున్నప్పుడు మీరు కూడా తనతో పాటే అక్కడే ఉండాలని భావిస్తున్నట్లయితే పాప నిద్రపోయే వరకూ మీరు అక్కడే ఉండాలి.

6. నిద్రకు ఉపక్రమించిన పావుగంట తరువాత దుప్పటి సవరించడం వంటివి చేయవచ్చు. ఒకవేళ పాప ఏడిస్తే చూడనట్లు ఉండాలి తప్పితే ఎక్కువ ఆతృత కనపరచకూడదు.
7. పిల్లలు ఏడ్చినప్పుడు తల్లితండ్రులు అతిగా స్పందిస్తే, ఏడవడం ద్వారా దేనినైనా సాధించుకోవచ్చు ననే భావన పిల్లల్లో పెరిగిపోయి చీటికీమాటికీ ఏడుస్తారు.
8. తల్లితండ్రులు వారి అలవాట్లను పిల్లలకు ఆపాదించకూడదు. ఉదాహరణకు లైటు వెలుతురు వలన మీకు నిద్ర రాకపోతే పిల్లలకు కూడా రాదనుకోకూడదు.
9. నిజానికి లైట్లు ఉంటేనే చాలామంది పిల్లలు ధైర్యంగా నిద్రపోతారు. కొంతమంది పిల్లలు దుప్పటి కప్పితే సౌకర్యవంతంగా నిద్రపోతారు. మరికొంతమందికి సాఫ్ట్‌టాయ్ ను తోడుగా ఉంచుకుని నిద్రపోవడం అలవాటు. ఈ అలవాట్లను వ్యతిరేకించండి. వీటితో ఎవరికీ నష్టం ఉండదు.
10. అలాగే పై కప్పు మీద మెరిసే నక్షత్రాలను అతికించడం, గోడల మీద ఆసక్తి కలిగించే పోస్టర్లను అతికించడం వంటివి చేస్తే పిల్లలు వాటిని చూస్తూ నిద్రలోకి జారుకుంటారు.
11. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు అసలు నిద్రపోరనీ, పెరిగే వయస్సులో నిద్రపోకపోతే ఎలా అనీ వాపోతుంటారు. అయితే పిల్లలకు ఎంత నిద్ర అవసరమైతే అంతే నిద్రపోతారు. నిద్ర ఎక్కువయిందా? తగ్గిందా? అనే విషయం గురించి పెద్దగా ఆందోళనపడకూడదు.
12. పిల్లలు ఇతరత్రా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. తల్లిదండ్రులను చూసే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. మనం మరీ పొద్దుపోయే వరకూ టివి మొదలైనవి చూస్తూ ఉంటే పిల్లలకూ అదే అలవాటవ్ఞతుంది. పిల్లలను పగటిపూట, ముఖ్యంగా సాయంత్రం పూట నిద్రపోనివ్వకూడదు. రాత్రి పడుకునే ముందు పాలు పట్టండి. నిద్రలో కలవరిస్తుంటే లేపడానికి ప్రయత్నించకండి.



Click it and Unblock the Notifications