Latest Updates
-
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు!
మీ పిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నారా?
మీ పిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో ఈ అలవాటు త్వరగా వ్యసనంలా మారే ప్రమాదమే కాదు.. దాంతో దుష్ఫ్రభావాలూ కలిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ గేమ్‌లు పిల్లలకు దెబ్బలు తగలకుండా, వినోదం కలిగించే మాట నిజమే గానీ.. ఇతర ఆటల ద్వారా కలిగే సమష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవీ ఉండవని చెబుతున్నారు. ప్రస్తుతం కంప్యూటర్ గేమ్‌లకు అతుక్కుపోవటాన్ని ఒక వ్యసనంలా గుర్తించకపోయినప్పటికీ వీటికి ఆకర్షితులవుతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతుండటం పట్ల నిపుణులు, వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పిల్లలు ఏకాకులుగా మారతున్నారని.. కుటుంబ సభ్యులతో గడపటం, వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్నారని భయపడుతున్నారు.

ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు రోజులో 6 నుంచి 8 గంటలసేపు కంప్యూటర్ గేమ్‌ల్లో మునిగిపోవటం సాధరణమైపోతోంది. దీంతో కొందరిలో దుష్ఫ్రభావాలూ తలెత్తే అవకాశమూ ఉంది. వాటిల్లో కొన్ని..
* మణికట్టు వద్ద కండరాల నొప్పి
* మెడనొప్పి
* కుంగుబాటు
* భావోద్రేకాల్లో మార్పులు
* గేమ్‌లను ఆడొద్దంటే కోపంతో రెచ్చిపోవటం
* కుటుంబంలో, బయటా జరితే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం
* స్నేహితులతో చనువుగా మెలగకపోవటం
* భోజనం కూడా తమ గదిలోనే కానిచ్చేయటం
* హోంవర్క్ పూర్తి చేయకపోవటం
* తరగతుల్లో పాఠాల పట్ల శ్రద్ధ చూపకపోవటం
కంప్యూటర్ గేమ్‌ల్లో మునిగిపోయిన పిల్లలు నలుగురిలోకి రావటానికి సిగ్గుపడుతున్నా, ఆందోళనతో కనిపిస్తున్నా ముప్పు పొంచి ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఇవి వారి మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే కంప్యూటర్ గేమ్‌లకు పిల్లలు ఎక్కువగా అతుక్కుపోతున్నట్టు గమనిస్తే వాటి నుంచి దృష్టి మళ్లించటానికి వెంటనే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* ఇలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువసేపు మాట్లాడుతుండాలి.
* కంప్యూటర్ వాడకంలో ముందే పరిమితి విధించాలి.
* అందరూ తిరిగే ప్రాంతంలోనే కంప్యూటర్ను ఉంచాలి.
* అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారన్నదీ గమనిస్తుండాలి.
* కొన్నిసార్లు పిల్లలు ఆడే ఆటల్లో పాలుపంచుకోవటమూ మంచిదే.
* పిల్లలతో కలిసి తరచూ షికార్లకు వెళ్తుండాలి.



Click it and Unblock the Notifications
