Latest Updates
-
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.! -
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!.. -
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.? -
ఆగ్రా ఫేమస్ పేఠా స్వీట్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.. -
కారం లేకుండానే ఘాటుఘాటు రుచితో వైట్ మటన్ పులావ్.. మసాలా నషాళానికి అంటాల్సిందే.! -
గ్రహణం రోజు ఈ పూజ తప్పనిసరిగా చేయాలట.. శాస్త్రాలు చెప్పే పూర్తి నియమాలు ఇవే! -
Chanakya Niti: చాలామంది జీవితంలో ఆలస్యంగా నేర్చుకునే 8 పాఠాలు..టాలెంట్ ఉన్నా ఫెయిల్? -
జూన్ 3: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం, కెరీర్లో ఊహించని అద్భుతాలు!
మీ పిల్లలు బాహ్య కార్యకలాపాలలో పాల్గొనడానికి మంచి కారణాలు
ఇదివరకు పిల్లలు స్కూల్ నుండి రాగానే బేగ్స్ వదిలేసి గాలిపటాలు ఎగురవేయుట,కంచా ఆడుట,కబడ్డీ లేదా గిల్లీ-దండా ఆటలు ఆడేవారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే కంప్యూటర్ గేమ్స్ లో మునిగిపోతున్నారు. అయితే బాహ్య కార్యక్రమాలు పిల్లల మొత్తం అభివృద్ధి కోసం ముఖ్యమైనవి.కాబట్టి మీ పిల్లలు ఇటువంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉండేలా చూడండి.
ఇక్కడ మీ చిట్టి పిల్లల కోసం స్కూల్ అయిన తరువాత చేసే కార్యకలాపాల ప్రయోజనాలను తెలుసుకుందాము.

వాల్యుబుల్ లైఫ్ స్కిల్స్ లో శిక్షణ
పిల్లలు బయట కార్యకలాపాలు ద్వారా వివిధ ఆసక్తులను తమకుతామే వారి భవిష్యత్తు పెరుగుదలకు సహాయం చేసే అనేక విలువైన నైపుణ్యాలను తెలుసుకుంటారు. వారు పోటీల నుండి స్పోర్ట్స్ మరియు క్రీడాస్ఫూర్తి ద్వారా టీం స్పిరిట్ ను నేర్చుకుంటారు.

సోషల్ డెవలప్మెంట్
సామాజిక మరియు సంభాషణ నైపుణ్యాలకు ముఖ్యమైన సామాజిక నైపుణ్యాలను నేర్చుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పిల్లలు కొత్త స్నేహితులను పొందుతారు. అలాగే వారి నుంచి నైపుణ్యాలను నేర్చుకుంటారు.ఈ కార్యక్రమాలలో టీం వర్క్ లో చేసే పనిలో సహకారం అందించటం నేర్చుకుంటారు.వారు పబ్లిక్ లో తమను తాము ప్రదర్శన మరియు ప్రవర్తించడం లో నైపుణ్యం మారుతుంది.

సిగ్గుపడుట
మీ పిల్లవాడు తరగతిలో నిలబడి ఒక పద్యం చెప్పలేకపోతున్నారా? అవును,అప్పుడు ఆర్ట్స్,నృత్య గాన ప్రదర్శన వంటి సాంస్కృతిక కార్యక్రమాలలో అతడు/ఆమె పాల్గొనేలా చేయాలి. అప్పుడు అది వారిలో సిగ్గు పోగాట్టటానికి సహాయపడుతుంది.

ఫిజికల్ డెవలప్మెంట్
మీ పిల్లవాడు ఉదయం సమయంలో వ్యాయామం వైపు ఉత్సాహం చూపుట లేదా? మీరు మీ పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారా?దీనికి ఉత్తమ పరిష్కారం ఏ క్రీడలో అతని/ఆమె సన్నిహితంగా ఉన్నారో చూడండి. మీ పిల్లలలో ఎక్కువ వ్యాయామ సాధన ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

విద్యా ప్రదర్శనను మెరుగుపరుస్తుంది
కొంత మంది తల్లిదండ్రులు సాంస్కృతిక కార్యక్రమాల వలన వారి పిల్లలకు చదువు తగ్గిపోతుందని నమ్ముతారు. కానీ స్కూల్ అయిన తర్వాత ఆడుకున్న పిల్లలలో చురుకుదనం ఎక్కువగా కనిపించింది. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న పిల్లలలో ఎక్కువ గ్రేడ్ సంపాదించే అవకాశాలు కనిపించాయి. అంతేకాక పిల్లల లెర్నింగ్ సామర్థ్యం కూడా పెరుగుతుంది.

టైమ్ మేనేజ్మెంట్ నేర్పండి
ఇది మీ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనుట వలన వచ్చే అద్భుత లాభాలలో ఒకటి. వారి జీవితంలో టైం నిర్వహణ ప్రాధాన్యతను నేర్చుకుంటారు. ఇది గమనించి పెద్దలు వారి బాల్యంలో స్కూల్ తరువాత కార్యకలాపాలలో నిమగ్నమై విధంగా చూడాలి. సులభంగా వారి యుక్తవయసు వచ్చే సరికి నైపుణ్యం వస్తుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం
హోంవర్క్ భారం,క్లాస్ పరీక్షలు వంటివి పిల్లలలో ఒత్తిడిని కలిగిస్తాయి. వారు వారి చదువు కొరకు సరిగా దృష్టి పెట్టటానికి బాహ్య కార్యకలాపాలు అవసరం. ఇతర కార్యక్రమాలు వారి మనస్సు రిలాక్స్ మరియు రిఫ్రెష్ అవటానికి సహాయం చేస్తుంది.



Click it and Unblock the Notifications