Latest Updates
-
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి!
మీ బుజ్జాయికి స్ట్రోలర్ కొంటున్నారా..?మీకోసం ఉత్తమ సలహాలు
చాలా మందికి తల్లయ్యాక పాపాయిని వదిలి పెట్టి బయటకు వెళ్లడం కుదరకపోవచ్చు. కొన్ని నెలల వరకూ పసిపిల్లల ఆలనాపాలనా తప్ప మరో విషయం గుిరంచి ఆలోచించేంత తీరిక కూడా ఉండవకపోవచ్చు. ఒక వేళ తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినా పాపాయిని ఇంట్లో వదలి పెట్టి వెళ్లాలంటే మనస్సు ఒప్పుకోదు. మరి తననికూడా వెంట తీసుకెళ్దామంటే అంత సేపు ఎత్తుకొని ఉండలేరు. అలాంటి వాళ్ల కోసమే స్ట్రోలర్స్ అందుబాటులోకి వచ్చాయి. తల్లులకు ఎలాంటి కష్టం కలగకుండా పిల్లల్ని చక్కగా వాటిల్లో కూర్చోబెట్టుకుని మార్కెట్ కు, కాసేపు వాకింగ్ కు ఇలా దగ్గర్లో ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది. అయితే ఏది పడితే అది కొనేయడం కాకుండా పిల్లలకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేది ఎంపిక చేసుకోవడం మంచిది. మరి అదెలాగో తెలియాలంటే, ఈ ఆర్టికల్ చదవాల్సిందే...
స్ట్రోలర్స్ లోని రకాలు: మూడు నెలల వరకూ పాపాయి తనంతట తాను మెడ నిలబెట్టలేదు. కాబట్టి అప్పటి వరకూ స్ట్రోలర్స్ వాడకపోవడమే ఉత్తమం. ఆరు నెలలు వచ్చే సరికి పాపాయి కొంచెం పెద్దఅవుతుంది కాబట్టి, అప్పుడు స్ట్రోలర్స్ వాడడం మంచిది. పాపాయి వయస్సు, బరువు ఆధారంగా స్ట్రోలర్ ని ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమంలో విభిన్న రకాల స్ట్రోలర్స్ గురించి తెలుసుకుందామా...

1. బరువు తక్కువ: తక్కువ బరువు ఉండే స్ట్రోలర్స్ మూడు చక్రాలు ఉంటాయి. ఇందులో కూర్చున్న పాపాయితో పాటు దాన్ని తోసే వాళ్లకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. జాగింగ్, లాంగ్ వాక్ లకు వెళ్లేటప్పుడు ఇలాంటి స్ట్రోలర్స్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది.
2. ఇద్దరు లేదా ముగ్గురు: ఇద్దరు పిల్లల్ని ఒకే సారి బయటకు తీసుకెళ్లాలంటే డబుల్ లేదా ట్రిపుల్ స్ట్రోలర్స్ అయితే బెటర్. వీటి డిజైన్ లో ముందు, వెనక...ఇలా రెండు భాగాలుగా ఉంటాయి. కాబట్టి ఇద్దర్నీ ఒకేసారి కూర్చోబెట్టవచ్చు. అలాగే ఒకరిని సీట్ లో ఉంచి, మరొకరిని సీట్ ముందు నిల్చోబెట్టడానికి వీలుగా ఫ్లాట్ ఫార్మ్స్ కూడా వాటిలో ఉంటాయి. అలాగే పక్క పక్కనే సీట్లు ఉండే స్ట్రోలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
3. స్టోరేజ్ కూడా: విభిన్న డిజైన్లు, మోడళ్లలో ఒకే సీట్ కలిగిన స్ట్రోలర్స్ స్టాండర్డ్ సైజ్ స్ట్రోలర్స్. ఈ సీట్ ని రకరకాల పొజిషన్లలో మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. వీటిలో సీట్ కింద పిల్లలకు కావల్సిన ఆహారం, డైపర్స్,..వంటి చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని వెళ్లడానికి అనువైన స్థలం ఉంటుంది. ఇందులో చవకైనవి, అదనపు హంగులతో కూడిన ఖరీదైనవి...ఇలా ఏవి కావాలంటే అవి దొరుకుతాయి..
4. కాస్త పెద్దయ్యేంత వరకూ: ట్రావెలింగ్ స్ట్రోలర్స్ కూడా మామూలు స్ట్రోలర్స్ లాగానే ఉంటాయి. వీటిలో పిల్లల్లని కారులో కూర్చోబెట్టుకోవడానికి వీలుగా ‘ఇన్ ఫాట్ కార్ సీట్' సౌలభ్యం కూడా ఉంటుంది. మిగిలిన వాటి కన్నా ఇవి పెద్దగా, బరువుగా.. ధర కూడా ఉంటుంది. మిగిలినవాటి కన్నా ఇవి పెద్దగా, బరువుగా..ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇన్ ఫాంట్ కార్ సీట్ కి అదనంగా స్ట్రోలర్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. కాబట్టి పాపాయికి కాస్త పెద్ద వయసొచ్చాక కూడా ఇవి పనికొస్తాయి.
5. కారులోనూ: పిల్లల్ని స్ట్రోలర్ తో పాటే కారులోనూ తీసుకెళ్లే సదుపాయం ఉన్నవే కార్ సీట్ స్ట్రోలర్స్. వీటి ఫ్రేమ్స్ బరువు తక్కువగా ఉంటాయి. కారులో సీట్ ని తీసేసి స్ట్రోలర్ ఫ్రేమ్ ని పెట్టేస్తే సరిపోతుంది. నిద్రపోతున్న పిల్లల్ని లేపకుండా బయటకు తీయాలంటే ఇలాంటివి బెటర్.
6. మరికొన్ని గుర్తుంచుకోవల్సిన విషయాలు:
చిన్నారికి, మీకు అనువుగా ఉంటుందని షాపుకి వెళ్లి ఏదో ఒక స్ట్రోలర్ గబగబా కొనేయడం కాదు..కొనేముందు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు కొన్నున్నాయి. మరి అవేంటో మీరే చూడండి...
7. స్ట్రోలర్ కొనే ముందు దాని బరువు తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా అని కూడా చూసుకోవాలి. దాదాపు తక్కువ బరువున్నవి ఎంచుకోవడమే మంచిది. ఎందుకంటే స్ట్రోలర్ ఎంత తక్కువ బరువుంటే.. అంత సులభంగా తోసుకెళ్లచ్చు, కార్లో లేపి పెట్టవచ్చు, ఎలాంటి అసౌకర్యం లేకుండా పాపాయిని తిప్పడానికి వీలవుతుంది. కాబట్టి నాణ్యత ఎక్కువ, బరువు తక్కువగా ఉండే స్ట్రోలర్స్ ను ఎంచుకోవడం అత్యుత్తమం.
8. స్ట్రోలర్స్ ని కొనేటప్పుడు పాపాయి సౌకర్యంతో పాటు దాన్ని హ్యాండిల్ చేస మీకు కూడా అనువుగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రోలర్ తోయడానికి వీలుగా హ్యాండిల్స్ మీ ఎత్తుకి సరిపోయేలా అనుకూలంగా ుండాలి. అలాకాకుండా మరీ ఎక్కువ లేదా తక్కువ ఎత్తు ఉన్నట్లయితే మీకు నడుము, చేతులు నొప్పి పుట్టే అవకాశం ఉంటుంది.
9. ఎంత సౌకర్యంగా ఉన్నా స్ట్రోలర్ కు ఉండే చక్రాలన్నీ భూమికి తాకుతున్నాయా లేదా కూడా చూసుకోవాలి. అలాగే చక్రాల బ్రేక్స్ సరిగా పనిచేస్తున్నాయో లేదో షాపులోనే పరీక్షించండి.
10. మీరు కొత్తగా కొనబోయే స్ట్రోలర్ ఫ్రేమ్ సరిగా ఉందో, లేదో గమనించాలి. ఫ్రేమ్ లో పదునైన మొనలు ఉండకుండా చూసుకోవాలి. ఫ్రేమ్ మెటల్ భాగాల మధ్య చిన్నారులు తెలియక చేతులు పెట్టి ప్రమాధాలు కొని తెచ్చుకొనే అవకాశం ఉంది. కాబట్టి డిజైన్ ఎలా ఉందో కూడా గమనించడం ముఖ్యం.
11.స్ట్రోలర్ ఎంచుకొనేటప్పుడు దాన్ని ఎక్కడికైనా మడుచుకుని తీసుకెళ్లడానికి వీలయ్యే సౌలభ్యం ఉందా లేదా అన్న విషయం కూడా పరిగణలోకి తీసుకొని కొనాలి. అలాగే కారులో పెట్టడానికి , మళ్లీ తీయడానికి సులభంగా ఉండేవైతే బాగుంటుంది.
12. పాపాయి కూర్చున్నప్పుడ ఎండ తగలకుండా స్ట్రోలర్ కి పైన కవర్ ఉందో లేదో గమనించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పైకవర్ లేకపోతే పాపాయికి ఎండ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే స్ట్రోలర్ కి పైన కవర్ ఉండేలా చూసుకోవాలి. అది కూడా కాస్త వెడల్పు, పొడుగ్గా ఉండేదైతే మరీ మంచిది.



Click it and Unblock the Notifications











