Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
మీరు కోపంలో ఉన్నప్పుడు పిల్లలను అనకూడని మాటలు
పెరెంటింగ్ అనేది కొంచెం కష్టమైనా విషయం. అలాగే సున్నితమైన అంశం కూడా. కొన్ని సందర్భాల్లో, పేరెంట్స్ పిల్లల ప్రవర్తనకు విసిగిపోయి కోపం తెచ్చుకుంటారు. అలాంటి సమయంలో కోపావేశంలో కొన్ని పదాలు దొర్లుతాయి. అనుకోకుండా దొర్లినా ఈ పదాలు పిల్లలలో ప్రతికూల భావనను కలిగిస్తాయి. పిల్లలను తీవ్రంగా బాధిస్తాయి. ఇవి పిల్లల ఆలోచనలను దెబ్బతీస్తాయి. కోపం వచ్చినా పిల్లలను ఉద్దేశిస్తూ కొన్ని పదాలపయోగించుకోకూడదు. అటువంటి పదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలతో మాట్లాడేటప్పుడు పేరెంట్స్ జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడే ప్రతి మాటా ఆచి తూచి మాట్లాడాలి. ముఖ్యంగా, కోపం వచ్చినప్పుడు మాట్లాడే భాషను కంట్రోల్ చేసుకోవాలి. కోపంలో వచ్చే పరుషపు మాటలు పిల్లలను ఇబ్బంది పెడతాయని గుర్తుంచుకోండి. పిల్లలపై కోపం వచ్చినా కొన్ని పదాలను ఉపయోగించకూడదు. వాటి గురించి తెలుసుకుందాం.

పరుషపు పదాలు
కోపంలో కొందరు తల్లిదండ్రులు తమ మాటలపై కంట్రోల్ ను పోగొట్టుకుంటారు. పరుషపు మాటలను విపరీతంగా వాడతారు. అటువంటి ప్రవర్తన పిల్లలపై దుష్పరిణామం చూపిస్తుంది. తల్లిదండ్రులపై ప్రతికూల ముద్రను ఏర్పరచుకుంటారు. అందుకే పరుషపు మాటలు వాడకుండా ఉండడం ఉత్తమం.

ఇతరులతో పోల్చకండి
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మిగతా పిల్లలతో పోలుస్తారు. పదే పదే ఇతరులతో పోలిస్తే పిల్లలు తమపై తమకున్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. ఆత్మన్యూనతను ఏర్పరచుకుంటారు. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇతరులతో పోల్చకుండా జాగ్రత్త పడాలి.

నిరుత్సాహపరచకండి
ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఇతరులతో పోల్చడం ,'నువ్వు దేనికీ పనికిరావు' అనే మాటలు వాడడం వల్ల పిల్లలకు నిరుత్సాహం కలుగుతుంది. వారిని నిరుత్సాహపరుస్తూ ఉంటే వారికి కూడా వారు దేనికీ పనికిరారన్న ఆలోచన మొదలవుతుంది. ఆత్మన్యూనతతో పిల్లలు బాధపడతారు. అందువల్ల, పిల్లలను నిరుత్సాహపరచకపోవడం మంచిది.

వారించకండి
కొంత మంది తల్లిదండ్రులు 'నువ్వు ఈ పనిచేయకూడదు', 'ఇది నీకివ్వను' అంటూ నెగటివ్ గా మాట్లాడుతూ ప్రతి దానికి పిల్లలను వారిస్తూ ఉంటారు. ఈ రకమైన ప్రవర్తన పిల్లలపై దుష్ప్రభావం చూపుతుంది. ప్రతీదీ వారిస్తూ ఉంటే తల్లిదండ్రులతో పిల్లల బంధం బలహీనపడిపోయే అవకాశాలున్నాయి. కాదని మృదువుగా చెప్పడం నేర్చుకోండి.



Click it and Unblock the Notifications