Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాలు త్రాగని పిల్లలకో ప్రత్యామ్నాయ మిల్క్ షేక్స్
సాధారణంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం ఇచ్చినా తింటారు. అదే వారు పెరిగే కొద్ది, ఆహారాల మీద వారి ఇష్టాఅయిష్టాలను చూపెడుతుంటారు. వారికి ఇష్టమైనవి మాత్రమే తినాలని కోరుకుంటారు. వారికి ఇష్టం లేని ఆహారాలను మాత్రం ఏదో ఒక విధంగా తినకుండా తప్పించుకోవడానికి ఏవో సాకులు చెబుతుంటారు.
ముఖ్యంగా పిల్లలు పెరిగే కొద్ది, వారికి పాలు, పండ్లు మరియు కూరగాయలు వారికి అందించే డైట్ లో ఇవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అయితే పాలకు ప్రత్యామ్నాయంగా మరే ఇతర ఆహారాలు ఎక్కువగా లేవు. కాబట్టి, వారి పాలు ఇష్టం లేదని ఇవ్వడం మానేస్తే పిల్లల పెరుగుదలకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను దినదినానికి కోల్పోతుంటారు. కాబట్టి, పాలకు ప్రత్యామ్నాయంగా మనమే కొన్ని తయారుచేసుకోవాలి. పిల్లలు నేరుగా పాలు తీసుకోనప్పడు మిల్క్ షేక్స్ రూపంలో అందివ్వాలి. మిల్క్ షేక్స్ పిల్లలకు హెల్తీ డ్రింక్స్. దాంతో మిల్క్ షేక్స్ వల్ల పిల్లలకు రెండు రకాలు ప్రయోజనాలు చేకూరతాయి. మిల్క్ షేక్స్ వినియోగించే పండ్లు మరియు పాలు రెండూ పిల్లల యొక్క ఆరోగ్యానికి పెరుగుదలకు చాలా అవసరం అవుతాయి. ఒక సర్వింగ్ కు రెండు ప్రయోజనాలు, అందించి వారిని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
ముఖ్యంగా పెరిగే పిల్లలు పెరిగే కొద్ది రోజురోజుకు డిఫరెంట్ ఆహారపదార్థాలను కోరుకుంటారు. అయితే వారి ఇష్టాలను ప్రతి రోజూ తీర్చడం కొంచెం కష్టమే అయినా, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కొన్ని సులభపద్దతులను, ఉపాయాలను ఉపయోగించి, పిల్లలకు ఆరోగ్యకరమైనవి అందివ్వాలి.
పిల్లలు ఆరోగ్యానికి సహాయపడే కొన్ని మిల్క్ షేక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

అరటి/ఆపిల్/మామిడి/స్ట్రాబెర్రీ
మిల్క్ షేక్స్ విషయంలో కానీ, పండ్లు విషయంలో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ లో మిల్క్ షేక్స్ ను తయారుచేసి పిల్లలకు అందివ్వడమే. అందకు సీజనల్ ఫ్రూట్స్ ను ఎంపిక చేసుకుంటే, ఎటువంటి సమస్య ఉండదు. అన్ని రకాల పండ్లును వారికి అందించినట్లు అవుతుంది. ఇక్కడ సూచిన పండ్లతో తయారుచేసే మిల్క్ షేక్స్ కు పంచదార కూడా అవసరం ఉండదు.

చాక్లెట్ మరియు బిస్కెట్ మిల్క్ షేక్స్
చిన్న పిల్లలకు చాక్లెట్స్ మరియు బిస్కెట్స్ అంటే చాలా ఇష్ట. కాబట్టి ఈ రెండింటి కాంబినేసన్ లో మిల్క్ షేక్ తయారుచేసి, పైన క్రీమ్ ను టాపింగ్ గార్నిష్ చేసి, అందివ్వవచ్చు.

స్ట్రాబెర్రీ మరియు బనానా మిల్క్ షేక్
పిల్లలకు ఆరోగ్యకరమైన డ్రింక్ ఇది, దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం. అరటిపండ్లు, స్ట్రాబెరీ, మరియు పాలు, పంచదారతో పాటు నీళ్ళ కూడా మిక్స్ చేసి గ్రైండ్ చేసి, అందులో వెనీలా ఎసెన్స్, ఐస్ క్రీమ్ మరియు స్ట్రాబెర్రీ వేసి చల్లగా అందివ్వాలి

వాటర్ మెలోన్ మిల్క్ షేక్
పిల్లలకు ఆరోగ్యకరమైన మరో మిల్క్ షేక్ రిసిపి. పిల్లల శరీరాన్ని చల్లబరుస్తుంది. అందకు వాటర్ మెలోన్ ముక్కలు, పాలు మరియు వెనీలా ఎక్స్ట్రాక్ట్ మరియు పంచదార మిక్స్ చేసి, బ్లెడ్ చేసి చిక్కటి స్మూతీని అందివ్వాలి.

మింట్ చిప్ మిల్క్ షేక్
పిల్లలకు మరో హెల్తీ న్యూట్రీషియనల్ పొటెన్షియల్ డ్రింక్. ఈ మిల్క్ షేక్ ను పిల్లలకు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు . అందుకు కావల్సిన కొద్దిగా ఆకుకూర, అరటిపండ్లు, పుదీనా, మరియు వెనీలా ఎక్సట్రాక్ట్ మరియు పాలు వేసి చిక్కగా స్మూతీని తయారుచేసి అందివ్వాలి. అందులోనే చాక్లెట్ చిప్స్ ను కూడా వేసి బ్లెండ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది.

చాక్లెట్ మరియు అవొకాడో మిల్క్ షేక్
పాలు, అరటిపండ్లు మరియు అవొకాడో అన్నింటిని మీక్సిలో వేసి బ్లెండ్ చేయాలి. దానికి కోకాపౌడర్, తేనె మరియు ఫ్లాక్స్ సీడ్స్ వేసి బ్లెండ్ చేయాలి. ఫ్లాక్స్ సీడ్స్ మరియు అవొకాడోలో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లలకు కూడా చాలా మంచిది.



Click it and Unblock the Notifications