Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ పిల్లల్లిన ఎందుకు ఎక్కువగా పొగడకూడదు ?
పిల్లల్ని పొగడడం ముఖ్యమే. అయితే, పిల్లల్ని ప్రశంసించే విషయంలో పరిమితులుంటాయన్న విషయాన్ని మరచిపోవడం మంచిది కాదు. ఆరోగ్యకరమైన ప్రశంసకు, అతిగా పొగడడానికి మధ్య ఉన్న బేధాన్ని అర్థం చేసుకోవాలి. తద్వారా, మితిమీరిన ప్రశంసల వల్ల పిల్లలపై పడే దుష్ప్రభావాన్ని ఆపగలిగిన వారవుతారు మీరు. ఆ బేధాన్ని అర్థం చేసుకుంటే పిల్లల మానసిక ఆరోగ్యానికి వారి మానసిక ఎదుగుదలకి తోడ్పడిన వారవుతారు.
ప్రశంస ద్వారా పిల్లలకు ప్రోత్సాహాన్ని అందించినట్టు అవుతుంది. పిల్లలు తమపై తాము ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు ఆరోగ్యకరమైన ప్రశంస సహాయపడుతుంది. అతిగా పిల్లలను ప్రశంసిస్తే ఆ ప్రశంస వారిపై దుష్ప్రభావం చూపే అవకాశం కూడా లేకపోలేదు.
పిల్లల ఎదుగుదలకు ప్రశంసలు సహాయపడతాయి. స్కూల్ లో వారి పెర్ఫార్మన్స్ మెరుగవుతుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రశంస, పిల్లలకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లలను అతిగా ప్రశంసించకూడదు అనే విషయానికి ముందు అసలు ఎందుకు ప్రశంసించాలి? పిల్లలపై ఆరోగ్యకరమైన ప్రశంస ఏ విధమైన పాత్ర పోషిస్తుందో ముందు అర్థం చేసుకోవాలి.
ఏదైనా పనిని సాధించడంలో పిల్లల కృషిని కచ్చితంగా ప్రశంసించి తీరాలి. వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలి. చిన్న చిన్న అంశాలకు ప్రశంసించడం మానండి. మీ ప్రశంస నిజాయితీగా ఉండాలి. సవాళ్ళను ఎదుర్కునే ధైర్యాన్ని పిల్లలకివ్వడం పిల్లలను ప్రశంసించడంలోనున్న ముఖ్య ఉద్దేశ్యం. ప్రశంసని నైపుణ్యంగా పిల్లలపై ప్రయోగిస్తే జీవితాంతం వారికి మీ సపోర్ట్ అందినట్టే.
పిల్లలను అతిగా పొగడడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అవేంటో తెలుసుకుని వాటిని పరిష్కరించుకోవాలి.

ప్రభావితం చేస్తుంది
మీ ఆలోచనలకు అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దుకునేందుకు ప్రశంస ఓ సాధనంలా ఉపయోగపడుతుంది. అయితే ఇది షార్ట్ టర్మ్ మాత్రమే. అంటే పిల్లలు ఎప్పుడైతే పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తారో అప్పటివరకు మాత్రమే ఈ పద్దతి పనిచేస్తుంది. కాని, అతిగా పొగడడం వల్ల పిల్లలు ప్రతిసారి తల్లిదండ్రులపై ఆధారపడుతూ ఉంటారు. ఈ పద్దతి వారి మానసిక ఎదుగుదలకు మంచిది కాదు.
ఆరాటపడతారు
తరచూ పిల్లల్ని ప్రశంసిస్తూ ఉంటే ప్రతి దానికి వారు మీ నుంచి ప్రశంసలని ఆశిస్తూనే ఉంటారు. ప్రతి చిన్న విషయంపై మీ మీద ఆధారపడి మీ అంగీకారం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. తమదైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను వారికీ వారే పోగొట్టుకుంటారు. ఆత్మ విశ్వాస లోపంతో మీ మీద ఆధారపడేలా తయారవుతారు. కాబట్టి ప్రశంసించే ముందు ఆలోచించండి.
వారి ఆనందాన్ని హరించొద్దు
పిల్లల పనులకు చిన్న చిన్న బహుమతులివ్వాలే కాని వారిని వారు చేసే పనులని ఆధారంగా తీసుకుని జడ్జ్ చేయకండి. తల్లిదండ్రులు తరచూ వాడే 'మంచి పని చేసావు' అనే ప్రశంసపై ఎన్నో వాదనలు జరిగాయి. 'మంచి పని' అనేది జడ్జ్ మెంట్ గా మారుతుంది కాని ప్రశంసగా మాత్రం కాదు. ఇటువంటి మాటలు పిల్లల చిన్న చిన్న ఆనందాలని హరిస్తాయి. పిల్లలను అతిగా పొగడకూడదు లేదా ప్రశంసించకూడదు అనేందుకు ఇది ఒక కారణం.
ఆసక్తి నశిస్తుంది
ఒక వ్యక్తిని తను చేసిన ఏదైనా పని గురించి పొగిడితే ఆ వ్యక్తి తన పనిపై ఆసక్తి పోగొట్టుకుంటాడని అధ్యయనాలలో తేలింది. ఇదే అంశం పిల్లలకూ వర్తిస్తుంది. పిల్లలని అతిగా ప్రశంసించే ముందు ఆ ప్రశంస పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనే దానిపై కొంచెం ఆలోచించండి.
విజయంపై ప్రభావం
తాజా అధ్యయనాల ప్రకారం పిల్లల్ని పొగడడం వల్ల వారు చేసే పనిపై వారి మీద మరింత ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా ఇష్టంగా చేయవలసిన పనిని వారు కష్టంగా భావించి పూర్తి చేస్తారు. ఈ ప్రభావం వారు చేసే పని యొక్క ఫలితాలపై పడవచ్చని నిపుణులు అంటున్నారు. పిల్లని అతిగా పొగిడడం వల్ల ఎదురయ్యే దుష్పరిణామం ఇది. అతిగా ప్రశంసలు అనుకున్న వారు రిస్క్స్ ను తీసుకోవడానికి వెనకాడతారని కూడా అధ్యయనంలో తేలింది.



Click it and Unblock the Notifications