Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పిల్లలో కళ్ళ అలసటని తగ్గించడానికి 7 మార్గాలు:
ఈరోజుల్లో పిల్లల జీవితాలు టీవీ, కంప్యూటరు, ఐ పాడ్, వీడియో గేంస్, హోంవర్కులు ట్యూషన్ లతో నిండిపోయాయి. వీటి ఫలితమే పిల్లలకి కళ్ళు అలసిపోవడం, మెడ, తల నెప్పులు.
పిల్లల కళ్ళ అలసట నివారణ కి 7 మార్గాలివిగో

.టైం :
రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు టీవీ, కంప్యూటర్ లేదా ఇతర డిజిటల్ వస్తువుల మీద అస్సలు సమయాన్ని వెచ్చించకూడదు.రెండు సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న పిల్లలు రోజుకి రెండు గంటలకి మించి వీటి మీద సమయం గడపకుండా చూసుకోవాలి.

కళ్ళకి స్క్రీన్ కి మధ్య దూరం:
స్క్రీను కి కళ్ళకి మధ్య 35 అంగుళాల దూరం ఉంటే కళ్ళకి అలసట తగ్గుతుందని రుజువు చేయబడింది.దీనికి తగ్గట్టుగా మీ పిల్లల కంప్యూటర్ మానిటర్ ని సరి చేసి కావాల్సి వస్తే అక్షరాల సైజు ని పెంచండి.
వీడియో గేంస్ కి "హార్మోన్ డిస్టెన్స్" ని పాటించాలి.అనగా వారి మోచేయి ,మొదటి వేలి కణుపు మధ్య ఉన్న దూరం అన్నమాట.మీ పిల్లవాడు కంప్యూటర్ మీద పనిచేస్తూ మధ్య మధ్యలో పుస్తకాలని రిఫర్ చేస్తోంటే పుస్తకాలని కూడా మానిటర్ అంత దూరం లోనే ఉంచండి.అందువల్ల తరచూ కళ్ళు ఫోకస్ సరిచూసుకోవాల్సిన అవసరం తగ్గి కంటి అలసట కూడా తగ్గుతుంది.

పచ్చదనం:
పచ్చిక బయళ్ళని చూస్తూ స్వచ్చమైన గాలి ని పీల్చడం వల్ల హాయిగా ఉండటమే కాదు కళ్ళ అలసట ని కూడా తగ్గిస్తుంది. పిల్లలో హ్రస్వ ద్రుష్టి లేదా మయోపియా నివారించాలంటే ఈ ఎక్సర్ సైజ్ చేయించండి. మొదట ఆకాశం లో పైనెక్కడో ఎగురుతున్న పక్షి మీద దృష్టి నిలిపి మెల్లిగా దృష్టిని దగ్గరలో ఉన్న వస్తువుల మీదకి మరల్చి ఆఖరికి నేల మీద ఉన్న గడ్డి పరకని చూడమనండి.

కంటికి హాయి కలిగించే ప్యాక్స్:
శరీరం లోని ఇతర భాగాల వలే కళ్ళు కూడా అలసిపోతాయి.అందువల్ల మీ పిల్లలు కనీసం రోజులో అరగంటైనా హాయిగా కళ్ళు మూసుకుని విశ్రమించేటట్లు చూడండి.అలా కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళ మీద చక్రాల్లా తరిగిన కీరా దోసకాయలు, లేదా రోజ్ వాటర్ లో ముంచిన దూది లేదా వాడేసిన తరువాత ఫ్రీజర్ లో ఓ నాలుగైదు గంటలు ఉంచిన టీ బ్యాగ్ లని ఉంచండి.

కంటికి మంచి ఆహారం:
కళ్ళకి విటమిన్ ఏ చాలా మంచిది. అందువల్ల మీ పిల్లల ఆహారం లో విటమిన్ ఏ అధికం గా ఉండేటట్లు చూడటం వల్ల వారి కంటి అలసట ని తగ్గించినవారవుతారు.

లైటింగ్ ని సరిగా సర్దుబాటు చేయండి:
గదిలో సరైన వెలుతురు లేకపోవడం వల్ల కంటి కండరాలు అలసట కి గురి అవుతాయి.మీ పిల్లలు చదువుకునే గదిలో వెలుతురు ధారాళం గా ప్రసరించేటట్లు చూడంది.
కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు అలసట తగ్గాలంటే కంప్యూటర్ నుండి వెలువడే కాంతి పరావర్తనం చెంది వారి కంటిలో పడకుండా చూడండి. లేదా గ్లేర్ ఫిల్టర్ ని ఉపయోగించండి.

కంటి ఎక్సర్ సైజులు:
మనము దేనిమీదైన దౄష్టి సారించినప్పుడు తక్కువ సార్లు రెప్ప వేస్తాము.పిల్లలో కూడా ఇది జరుగుతుంది.వారు ప్రతీ 20 నిమిషాలకొకసారి కంప్యూటర్ తెర నుండి బయటకి చూసి కావాలని కళ్ళు టపటపలాడించమని చెప్పండి.ఇది కళ్ళు పొడిబారడాన్ని, కంటి అలసట ని కూడా తగ్గిస్తుంది. అలసట చెందిన కళ్ళు కాసేపు మూసుకుని కనురెప్పలని, కనుబొమ్మల పైభాగం లో సుతారం గా మసాజ్ చేస్తే కళ్ళకి విశ్రాంతి లభిస్తుంది.



Click it and Unblock the Notifications