Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పరీక్షల తరువాత పిల్లలలో ఎదురయ్యే భంగపాటుని ఎదుర్కోవడం ఎలా
మీకు ఆఫీసులో లక్ష్యాలున్నట్లే పిల్లలు స్కూలు కెళ్ళి పరీక్షలు రాసి పాసవ్వాల్సి ఉంటుంది. మీరు మీ లక్ష్యాలు చేరుకోవాలని ఆశించినట్లే పిల్లలు కూడా పరీక్షలలో ఉత్తీర్ణులవ్వాలనుకుంటారు. ఇవన్నీ జీవితం లో భాగం. జయాపజయాలు కూడా అంతే. కానీ విజయం సాధించినప్పుడు మనందరికీ సంతోషం వస్తే అపజయం పాలయినప్పుడు నిరాశా, నిస్పృహలు చుట్టుముడతాయి.
చిన్నపుడు పరీక్షలలో తప్పితే భంగపాటుకి గురవ్వడం సహజం.మీ పిల్లలు ప్రతీ పరీక్షలోనూ మంచి మార్కులే తెచ్చుకోవాలన్న ఒత్తిడి కి లోనవ్వుతుంటే భంగపడక తప్పదు.నిరాశ లో ఉన్న పిల్లవాడిని ముందు ఊరడిల్లచేసి అపజయమొచ్చినప్పుడు ఎలా దానిని ఎదుర్కోవాలో వివరించాలి.భంగపాటుని ఎలా ఎదుర్కోవాలో కింద మరింత వివరంగా ఇచ్చాము చదవండి.

పిల్లలకి పరీక్షలలో అపజయమెదురయినప్పుడు భంగపడితే ఎలా సంభాళించాలి??
1.అంగీకరించడం నేర్పండి
పిల్లలలో అయినా పెద్దవారిలో అయినా వాస్తవాన్ని అంగీకరించి నిజాలని ధైర్యం గా ఎదుర్కోగలిగితే భంగపాటుని కొంతవరకూ నివరించగలము.మీ పిల్ల లేదా పిల్లవాడికి పరీక్షలలో తక్కువ మార్కులొస్తే వాస్తవాన్ని అంగీకరించమని చెప్పండి.
సగటు మార్కులు ముఖ్యమనీ, సబ్జెక్టుల వారీగా విడి విడి మార్కులు తక్కువొస్తే అంతా అయిపోయిందనుకోవడం సరైన పద్ధతి కాదనీ విడమరచి చెప్పండి.మీ పిల్లలు చదువుకోవడాన్ని ఆస్వాదించగలగాలి.చదువు ద్వారా వచ్చే మార్కుల కంటే ఙానాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం.

2 సహనం
సహనం ద్వారా భంగపాటుని చాలా వరకూ ఎదుర్కోవచ్చు.సహనం ఎంత ముఖ్యమో, దాని ప్రాముఖ్యత ఏమిటో వారికి అర్ధమయ్యేలా విడమరచి చెప్పండి.

3. భవిష్యత్తులో పరిస్థితి బాగుపడుతుందన్న భరోసా
పరీక్షలలో ఒక్కసారి తక్కువ మార్కులొచ్చినంత మాత్రాన ఏమీ అయిపోదు. మరలా అవకాశం వస్తుందనీ అప్పుడు జరిగిన తప్పు సరిదిద్దుకోవచ్చనీ చెప్పండి.తక్కువ మార్కులొచ్చినప్పుడు భంగపడి నిరాశ లో కూరుకుపోవడం కంటే వాస్తవాన్ని అంగీకరించి రాబోయే పరీక్షకి సన్నద్ధమవ్వమని చెప్పాలి.
ఇవండీ పరీక్షల తరువాత పిల్లలలో ఎదురయ్యే భంగపాటుని ఎదుర్కోవడానికి కొన్ని సలహాలు. మీకు ఇంకేమైనా తెలిస్తే కనుక మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications