Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
పిల్లల చెడు ప్రవర్తన ని ఎలా సరిదిద్దాలి??
మీ పిల్లలో ఉన్న కొన్ని అవలక్షణాలని ఆ తరువాత సమస్యలు తలెత్తకుండా అప్పటికప్పుడే పరిష్కరించడం ముఖ్యం. పిల్లల్ని పెంచడం అంటే వారి భావాలని పంచుకుని వారిని మంచి పౌరులిగా తీర్చిదిద్దడమే.
ఉదాహరణకి మీ పిల్లవాడి కోపాన్నే తీసుకుందాము. వారి కోపాన్ని చిన్నప్పుడే కారణం తెలుసుకుని ఎందుకు చీటికీ మాటికీ కోపం వస్తోందో కనుక్కుని ఆ సమస్య ని పరిష్కరించకపోతే వారు పెద్దయ్యాకా కూడా చీటికీ మాటికీ ఆగ్రహించే వారిలా తయారవుతారు.
అందుకే పిల్లల చెడు ప్రవర్తన ని సరి అయిన విధానం తో సరి అయిన వయసులో సరిదిద్దడం ముఖ్యం.కొన్ని లక్షణాలు వంశపారపర్యం గా వచ్చినా చాలా లక్షణాలని మాటుకు సరైన వయసులో చక్కటి మార్గదర్శకత్వం ద్వారా మార్చవచ్చు.
మీరు వారిని సరిదిద్దాలని అనుకుని మొదలుపెట్టిన వెంటనే వారు మీ మాట వినట్లేదని మధ్యలో వదిలెయ్యకండి.మెల్లిగా ప్రయనిస్తూ మెరుగైన ఫలితాలని సాధించవచ్చు.

పిల్లల చెడు ప్రవర్తన ని ఎలా సరిదిద్దాలి??
1.మాటల మధ్యలో అంతరాయం కలిగించడం
కొంత మంది పిల్లలు ఎవరైనా మాట్లాడుతోంటే మధ్యలో అంతరాయం కలిగించే అలవాటు ని కలిగి ఉంటారు. వారు బాగా ఉత్సాహం గా ఉండి, ఎదుటి వారు చెప్పేది పూర్తి చేసేలోపే వారు కూడా ఏదో చెప్పాలనుకుంటారు. అలాంటి పిల్లలకి ఎదుటివారి గురించి కూడా కాస్త ఆలోచించాలని చెప్పడం ముఖ్యం.

2.హింసాత్మక ప్రవర్తన
తోబుట్టువులనో, ఇతర పిల్లలనో గిల్లడం లాంటి చిన్న చిన్న హింసాత్మక పనులు చేస్తున్నా కూడా అలాంటి ప్రవర్తన ఎందుకు ఆమోద యోగ్యం కాదో వారికి వివరించడం ముఖ్యం.ఎదుటువారికి హాని కలిగించే ఏ లక్షణమూ మంచిది కాదు.
3.పట్టించుకోకపోవడం
కొంత మంది పిల్లలు తల్లి తండ్రులు ఏమైనా చెప్తున్నా పట్టించుకోరు.ఇదీ చెడు ప్రవర్తన కిందకే వస్తుంది.మీరు ఏదైనా వారికి చెప్తుంటే శ్రద్ధగా వినాలని చెప్పి చూస్తే పరిస్థితి మెరుగవ్వచ్చు.

4.వక్రీకరించి చెప్పడం
మీ పిల్లలు కనుక నిజాలని మార్చి, లేదా వక్రీకరించి చెప్తుంటే ఆ అలవాటు ఎంత ప్రమాదకరమో వివరించి చెప్పండి. ఇలాంటి లక్షణాలని ఉపేక్షిస్తే అది వారి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీకు ఇంకేమైనా తెలిస్తే మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications
