Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
తోబుట్టువుల మధ్య ద్వేష భావనలని ఎలా సంభాళించాలి?
మీకు ఒకళ్ళ కంటే ఎక్కువ పిల్లలుంటే వాళ్ళు ఎప్పుడో అప్పుడు వాదులాడుకోవడం మామూలే.ఒక్కోసారి ఇది హద్దులుదాటి కొట్టుకునే వరకూ వస్తుంది.అలాంటప్పుడు పిల్లల మధ్య ఉండే ద్వేష భావనలని ఎలా సంభాళించాలి??
మీ పిల్ల/పిల్లవాడు కోపం గా ఉన్నప్పుడు ఏమి చేయాలి??
మీ పిల్లల మధ్య ఉండే ద్వేష భావనలని చిన్నప్పుడే సరి అయిన విధానం లో సంభాళించకపోతే అవి పెద్దయ్యే కొద్దీ శత్రుత్వం గా మారే అవకాశం ఉంది.
పిల్లల మధ్య సహృధ్భావాన్ని ఏర్పరచడం లో తల్లితండ్రులు విఫలమయితే కనుక పిల్లలు ఒకళ్ళ ఎదుగుదల చూసి ఇంకొకళ్ళు ఓర్వలేకపోవడం, అసూయ పడటం వంటివి చేస్తారు.అందుకే పిల్లల మధ్య వచ్చే చిన్న చిన్న వాదులాట, పోట్లాటలని జాగ్రత్తగా సంభాళించాలి అనడం.పిల్లలు పోట్లాడూకోవడాన్ని ఎలా ఆపాలో క్రింద పేర్కొన్నాము, చూడండి.

స్టెప్ 1:
వారి మధ్య చిన్నగా మొదలైన పోట్లాట పిల్లలు ఒకళ్ళనొకళ్ళు గాయపరచుకునే లోపే ఆపండి.పిల్లలిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుంటే కనుక మీరు వారిద్దరినీ విడదీయాలి.వారిద్దరినీ ఒకళ్ళకొకళ్ళకి దూరంగా అంటే గదిలో చెరో మూలా కూర్చోబెట్టండి.
స్టెప్ 2:
ఆ పరిస్థితిలో మీ కోపం కనుక కట్టలు తెంచుకుంటే పరిస్థితి మరింత అధ్వాన్నం అవుతుంది.పిల్లలు అలా పోట్లాడుకుంటోంటే చూస్తూ నిశ్శబ్దం గా ఉండటం కాస్త కష్టమే అయినా కూడా మీరు అలాంటి మూడ్ లో ఉన్నప్పుడు పరిస్థితి ని సంభాళించలేరని గుర్తు పెట్టుకోండి.

స్టెప్ 3:
పోట్లాడుకుంటున్న పిల్లలని విడదీసి ఎవరి పని వారిని చేసుకోమనడం ఉత్తమం.కొన్ని గంటల తరువాత మిమ్మల్ని కలిసి ఈ విషయం గురించి మాట్లాడమని చెప్పండి.ఇలా చేస్తే పరిస్థితి కాస్త చల్లబడుతుంది.

స్టెప్ 4:
మీరు మీ పిల్లలని కలిసి జరిగిన పోట్లాట గురించి మాట్లాడేటప్పుడు పోట్లాడుకోవడం ఎందుకు ఆమోదయోగ్యం కాదో, పోట్లాట వల్ల ఎదురయ్యే పరిణామాలని వివరించి చెప్పండి.వారు కనుక మీరు చెప్పిన మాట వినకపోతే వారిని శిక్షిస్తానని సున్నితం గా హెచ్చరించడం మంచిది.అలా అని వారితో కఠినంగా ఉండకండి.వారితో హింసాత్మకం గా కాకుండా ధృడం గా వ్యవహరించండి. ఇది చాలా ఉపయోగపడుతుంది.



Click it and Unblock the Notifications