Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
తండ్రిగా బాధ్యత నిర్వర్తించేటప్పుడు వదులుకోవాల్సిన 10 దురలవాట్లు
ఎవ్వరికైనా పేరెంటింగ్ అంత సులభం కాదు.పేరెంటింగ్ ఎలా చెయ్యాలి అని నియమావళి కానీ పేరెంటింగ్ లో ఏమి చెయ్యచ్చు చెయ్యకూడదు అని కానీ నియమాలు ఏమీ లేవు. ఇది రిటైర్మెంట్ లేని ఒక ఫుల్ టైం ఉద్యోగం.పేరెంటింగ్ లో ప్రారంభ సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి, కీలకమైనవి కూడా. సాధారణం గా మగవారు ఒక అలవాటు ప్రకారం పనులు చేస్తారు. వారిని అలా కాకుండా వేరేగా చెయ్యమంటే చాలా అసౌకర్యానికి గురి అవుతారు.కానీ మీరు తండ్రి అయ్యాకా ఇలా అంటే కుదరదు.
తండ్రి స్థానం తనతోపాటు ఒక పెద్ద బాధ్యతని మోసుకొస్తుంది.మీ పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని చెప్పడం మీ మీదే ఆధారపడి ఉంటుంది.ఎవ్వరూ లోపాలు లేకుండా ఉండరు అనేది మాత్రం నిజం.అయినా కూడా పిల్లలు అన్ని విషయాలూ తెలుసుకోవాలనీ మనలో మనకి నచ్చని అలవాట్లు వారు నేర్చుకోకూడదనీ అనుకుంటాము మనకి తెలీకుండానే.మొదట్లో మీకు తండ్రిగా బాధ్యత నిర్వర్తించడం కష్టమనిపించినా పిల్లలు మంచి అలవాట్లతో ఎదిగేకొద్దీ మీరు పడ్డ కష్టానికి ఫలితాలు అనుభవిస్తారు.
మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు తరచి చూసుకుంటూ చెడు అలవాట్లు విసర్జించి వాటి స్థానం లో మంచి అలవాట్లు నేర్చుకోవాలి.క్రింద ఇచ్చిన 10 చెడు అలవాట్లని తండ్రి స్థానం లో ఉన్న మీరు తక్షణం మానెయ్యాలి.

1.అస్థిరత
మీరు కనుక ఒక నియామాన్ని విధిస్తే దానికి కట్టుబడి ఉండండి.మీరు అప్పుడప్పుడు మాత్రమే కఠినం గా ఉంతూ కొన్ని సార్లు నియమాలు సడలించడాన్ని మీ పిల్లలు గమనిస్తే వారు క్రమశిక్షణ ని తేలికగా తీసుకుని మీరు పెట్టిన పరిమితుల ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోరు.

2.మద్దత్తు
మీ పిల్లల వెనుక మీరు కొండ లా నిలబడి అవసరమైనప్పుడు మీరున్నారనీ, మీ మీద ఆధారపడచ్చన్న నమ్మకాన్ని కలిగించాలి.

3.స్మార్టు ఫోనులని పక్కన పెట్టండి
మీ పిల్లలతో మీకు అనుబంధం బలపడాలంటే మొదట మీకున్న స్మార్ట్ ఫోను కి అతుక్కోవడమనే దురలవాటుని మానాలి.ఎప్పుడూ వాటికి అతుక్కుని కూర్చోవడం కాదు మీ పిల్లలతో కూడా నాణ్యమైన సమయం గడపాలని మర్చిపోవద్దు.

4.కొన్ని విషయాల్లో హద్దులు విధించండి
మీ పిల్లలతో స్నేహితుల్లా ఉందామనుకున్నా సరే మీరు మొదట ఒక పేరెంట్ అని మర్చిపోవద్దు.వారు సమయం, డబ్బు, నీతీ నిజాయితీల ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే వారికి కొన్ని విషయాలలో హద్దులు విధించాలి.

5.”కాదు” అని చెప్పకపోవడం
వారు అడిగినవన్నీ కాదనకుండా కొన్నివ్వడం లేదా చెప్పిన వాటికల్లా తలాడిస్తుంటేనే మీరు వారిని ఎక్కువ ప్రేమిస్తున్నారని కాదు. తిరస్కారాన్ని కూడా శిరసావహించడం నేర్పించాలి.అవసరమైనప్పుడు వారికి "నో" చెప్పడం లో తప్పు లేదు.

6.ఎప్పుడూ బిజీ బిజీ గా ఉండటం
మీ ఆఫీసు ని ఇంటిదాకా తీసుకురావద్దు.ఆఫీసే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా మీ సమయాన్ని కోరుకుంటారు.మీ పిల్లలు అనుబంధాల ప్రాముఖ్యత తెలుసుకుని బంధాలని కాపాడుకోవడమెలాగో గుర్తెరగాలంటే వారితో మీరు నాణ్యమైన సమయం గడపడం ముఖ్యం.

7.భయపెట్టడం
ఎప్పుడూ మీకు నచ్చినట్లే మీ పిల్లలు ఉండాలనుకుంటే వారు తిరగబడే ఆస్కారం ఉంది.వారి స్వతంత్ర్య వ్యక్తిత్వాన్ని కూడా గుర్తించి కితాబులివ్వండి.

8.ఎప్పుడూ ఇతరులతో పోల్చడం
పిల్లని ఎప్పుడూ ఇతరులతో పోలుస్తోంటే వారి మీద వారికి గౌరవం పోవడమే కాదు తమ మీద తమకి ఉన్న నమ్మకాన్ని, ఆత్మ విశ్వాసాన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది.వారు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయేటట్లు ప్రవర్తించకండి.

9.వారు చెప్పేది వినకపోవడం
ఎప్పుడూ మీ సూక్తులని వల్లించడమే కాదు వారి చిన్ని బుర్ర లో ఏముందో కూడా వింటూ ఉండండి.

10. దురలవాట్లు మానుకోకపోవడం
మీకు త్రాగుడు, సిగరెట్ కాల్చడం లాంటి దురలవాట్లుంటే కనీసం మీ పిల్లల ముందైనా వాటిని ప్రదర్శించకండి.



Click it and Unblock the Notifications