Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీ పిల్ల/పిల్లవాడు కోపం గా ఉంటే ఏమి చెయ్యాలి??
మీ భాగస్వామి కోపాన్ని మీరు సంభాళించినట్లుగా మీ పిల్లల కోపాన్ని సంభాళించాలంటే కుదరదు.పిల్లల విషయం లో పెద్ద వారి కంటే చాలా ఓర్పు అవసరం.మీ పిల్లలు కోపాన్ని వ్రెళ్ళగక్కేటప్పుడు కనుక ఆ ప్రవాహానికి అడ్డుపడితే పరిస్థితి ఎంత అసహ్యం గా తయారవుతుందో మీకు తెలీదు.
వారి మాటలకి అడ్డు తగిలేకంటే మీరు సహనం తో ఉండటం మంచిది.సహనం తో ఉండి మీరు పరిస్థితి మరింత దిగజారకుండా అడ్డుకోవచ్చు.
మీ పిల్ల/పిల్లవాడు కోపం గా ఉన్నప్పుడు మీకు కోపం రాకుండా అదుపు చేసుకోవడం చాలా ముఖ్యం.పిల్ల/పిల్లవాడు కోపం గా ఉన్నాడంటే పరోక్షం గా మీ దృష్టిని ఆకర్షించాలని చేసే యత్నమే.ఎక్కడో ఏదో తేడా ఉందని పిల్ల/పిల్లవాడు మనకి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట.వారు అలా చెప్పేటప్పుడు వారికి కూడా ఒక అవకాశం ఇచ్చి వారి భావాలని చెప్పనిస్తే కనుక నిరాశకి లోనవ్వడం లేదా ఆగ్రహం చెందాల్సిన అవసరం ఉండదు.
మీ పిల్ల/పిల్లవాడు కోపం గా ఉంటే ఏమి చెయ్యాలి??

1.వారిని చెప్పనీయండి
మీ పిల్ల/పిల్లవాడు కోపం గా ఉంటే మిమ్మల్ని మీరు సంభాళించుకోండి.మీకు నిజం గా చాలా కోపం వచ్చినప్పుడు మీ భావాలని బయటకి వ్రెళ్లగక్కనీయకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.బాగా నిరాశ కి గురి అవుతారు కదా, మీ పిల్ల/ పిల్లవాడికి కూడా అలాగే ఉంటుందని గుర్తుపెట్టుకోండి.అందువల్ల ఒక పేరెంట్ గా మీరు చెయ్యాల్సిందేమిటంటే వారి భావాలని స్వేచ్చ గా వ్యక్తీకరించనీయడం.

2.వారు చెప్పేది చక్కగా వినండి
మీ పిల్ల/పిల్లవాడు మాట్లాడేటప్పుడు నిశ్శబ్దం గా వినండి. అంతే కానీ మధ్యలోనే నువ్విలా, అలా అని వారిని వారించొద్దు.దానికి చాలా సహనం కావాలి. పేరెంటింగ్ అంటేనే సహనం కదా..
3.సానుభూతి చూపండి
సానుభూతి చూపడం దయా గుణానికి మొదటి మెట్టు.ఆ చిన్ని హృదయం పడే క్షోభ నీ, వేదననీ పంచుకోకపోతే మీరు మీ పిల్ల/పిల్లవాడికి సహాయపడలేరు.అందుకే వారి మీద సానుభూతి చూపండి.

4.వివరించండి
వారు చెప్పిందంతా విన్న తరువాతే ఎక్కడ తప్పు జరిగిందో వారికి వివరించండి.రెండో సారి అవకాశం వస్తే ఎలా సరిచేసుకోవాలో కూడా విడమరిచి చెప్పండి.కానీ ఇలా చెప్పే ముందు మీ పిల్ల/పిల్లవాడు సహనం తో మీరు చెప్పేది వినడానికి తయారయ్యారు అనుకున్నప్పుడే చెప్పండి.



Click it and Unblock the Notifications