Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తల్లితండ్రులు పిల్లల ముందు ఎప్పటికి చేయకూడని కొన్ని పనులు
తల్లితండ్రులు పిల్లల ముందు కొన్ని పనులను ఎప్పటికి చేయకూడదు. అవి ఏమిటి?మరియు తల్లిదండ్రులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? వంటి వాటిని ఈ పోస్ట్ లో చర్చిద్దాం.
పిల్లలను పెంచటం అనేది అంత సులభం కాదు. తల్లితండ్రుల యొక్క ప్రతి చర్య మరియు ప్రభావాలు పిల్లవాడిని మనస్తత్వాన్ని మలుస్తుంది. పిల్లలు తల్లితండ్రులను అనుసరిస్తూ అనుకరిస్తారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి.
మీరు పిల్లల ప్రవర్తనను సరిచేయటానికి ప్రయత్నించడానికి ముందు, పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలాగా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. ఇది పేరెంటింగ్ చిట్కాలలో ఒకటి.
ఇప్పుడు, ఇక్కడ తల్లిదండ్రులు ఎప్పుడూ చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి.

పిల్లల ముందు ఎవరిని కొట్టకూడదు
ఇది ఒక చెడు ఉదాహరణను కలిగిస్తుంది. అంతేకాక ఈ పరిణామం పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తిని కలిగిస్తుంది.

పిల్లల ముందు అరవకూడదు
మీ పిల్లలు మీ ప్రవర్తనను అనుకరించటానికి ప్రయత్నం చేస్తారు. చిన్న వయస్సులోనే దూకుడు వంటి స్వభావం అలవడుతుంది.

చిన్న పిల్లల ఫీలింగ్స్ విస్మరించడం
తల్లిదండ్రులు వినటం అలవాటు చేసుకోవాలి. పిల్లలు చెప్పింది ఓపికగా వినాలి. లేకపోతే, మీ పిల్లలు నిర్లక్ష్యం అనుభూతికి గురి అవుతారు.

పిల్లల అభిప్రాయాలను విస్మరించడం
మీ పిల్లలు ఒక అభిప్రాయంను వ్యక్తం చేస్తే, అభిప్రాయం సిల్లీగా ఉన్న సరే ఆతురుత లేకుండా వినండి. ఆ అభిప్రాయం సిల్లీగా ఉన్నప్పుడు కూర్చొని దాని గురించి వివరించండి. ఈ విధంగా చెప్పటం వలన పిల్లలకు హేతుబద్ధంగా ఆలోచించడం అలవాటు అవుతుంది.

తప్పుడు భాష ఉపయోగించడం
అతను లేదా ఆమె ప్రతి చోటా తప్పు భాషను ఉపయోగించటం ప్రారంభిస్తే అది వారిని పాడు చేయవచ్చు.

పబ్లిక్ లో మీ పిల్లలను విమర్శించటం
మీ పిల్లలను అవమానించడం చేయకూడదు. అతను లేదా ఆమెకు మీ మీద వ్యతిరేకంగా ప్రతికూల భావాలు కలగవచ్చు. తల్లిదండ్రులు పిల్లలు ముందు చేయకూడని కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. మీకు ఇటువంటి మరిన్ని ఆలోచనలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications