Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పిల్లల్లో ఫ్లూ నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
పిల్లలు అనారోగ్యానికి గురైతే.. వాళ్లతోపాటు, తల్లిదండ్రులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా భయంకరమైన లక్షణాలతో పిల్లలు అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాంటప్పుడు వాళ్లను ట్రీట్ చేయడం కష్టంగానే ఉంటుంది. ఏమీ తినరు, తాగలేరు. దీంతో మరింత బలహీనంగా మారతారు.
పిల్లలు అనారోగ్యానికి గురయినప్పుడు వాళ్ల దగ్గర తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. అలాగే.. వాళ్లు రెగ్యులర్ యాక్టివిటీస్ పెండింగ్ పడిపోతాయి. కాబట్టి పిల్లలు సిక్ అయినట్టు గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ చేయడం చాలా అసవరం. అందుకు న్యాచురల్ టిప్స్ ఫాలో అవడం మరింత అవసరం.

పెద్దల కంటే.. ఎక్కువగా పిల్లలు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే.. వాళ్లు ఇమ్యున్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ కాకపోవడం వల్ల.. వ్యాధులతో పోరాడలేకపోతుంది. అలాగే బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ కి ఎక్కువ అవకాశాలుంటాయి. సాధారణంగా 3 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఎక్కువగా ఫ్లూ వస్తూ ఉంటుంది.
ఫ్లూ అనేది కొత్తగా ఏమీ కాదు.. వైరల్ ఇన్ఫెక్షన్. లంగ్స్, ముక్కు, గొంతుకు సంబంధించిన రకరకాల లక్షణాలతో ఫ్లూ బయటపడుతుంది. ఫ్లూ ఎటాక్ అయినప్పుడు పిల్లల్లో చాలా సాధారణ లక్షణం.. జ్వరం, దగ్గు, జలుబు, ముక్కులో నీళ్లు కారడం, ఆకలి మందగించడం, గొంతు ఆరిపోవడం, కండరాల నొప్పి.
ఇలాంటప్పుడు డాక్టర్లు పిల్లలకు చాలా యాంటీ బయోటిక్స్ సూచిస్తారు. అయితే.. ఇవి పిల్లల శరీరానికి కాస్త హానికరంగా మారతాయి. కాబట్టి ఫ్లూ లక్షణాలను న్యాచురల్ గా తగ్గించడానికి 3 ఎఫెక్టివ్ అండ్ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు..

హాట్ సూప్
మీ పిల్లలకు ఫ్లూ ఉన్నప్పుడు ముక్కులో అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు హెల్తీ హాట్ చికెన్ సూప్ లేదా వెజిటబుల్ బ్రోత్ ఇవ్వడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా మిరియాలు కలిపి ఇస్తే.. జలుబుతో పాటు, ఫ్లూ లక్షణాలు తగ్గుతాయి. రోజుకి రెండుసార్లు ఈ సూప్ తాగడం చాలా అవసరం. అలాగే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. క్రమక్రమంగా ఫ్లూ లక్షణాలన్నీ తగ్గిపోతాయి.

తేనె
పొడి దగ్గు చాలా సాధారణ లక్షణం. రోజంతా మీ పిల్లలు దగ్గుతూ ఇబ్బంది పడుతున్నారంటే.. వాళ్లు అలసిపోవడానికి, చెస్ట్ పెయిన్ రావడానికి కారణమవుతుంది. కాబట్టి.. వెల్లుల్లి, తేనెతో పాటు, వేడినీళ్లు కలిపి.. ఉదయాన్నే తీసుకోవడం వల్ల త్వరిత ఉపశమనం పొందవచ్చు. ఈ రెండింటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. పొడి దగ్గు నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చు.

విశ్రాంతి
అనారోగ్యంగా ఉన్నప్పటికీ చాలా సందర్బాల్లో పిల్లలు చాలా యాక్టివ్ గా ఉండటమే కాకుండా, అల్లరి చేయడం, ఎక్కువ సమయం బయట తిరగడం, పరుగెత్తడం చేస్తూ ఉంటారు. ఈ లక్షణాలు.. పిల్లల్లో ఫ్లూ మరింత పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి ఫ్లూ ఉన్నప్పుడు ఖచ్చితంగా శరీరానికి విశ్రాంతి అవసరం అవుతుంది. కాబట్టి తగ్గిదండ్రులు వాళ్లు రెస్ట్ తీసుకునేలా జాగ్రత్త పడాలి.



Click it and Unblock the Notifications