For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపే పేరెంట్స్ హ్యాబిట్స్..!

By Swathi
|

తల్లిదండ్రులకు పిల్లలకు ఏది మంచిది అనేది తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తనను కూడా వాళ్లు గమనిస్తారని, కొన్ని అలవాట్లు వాళ్లపై దుష్ర్పభావం చూపిస్తాయని గ్రహించాలి. ఎందుకంటే.. పిల్లలకు ఫస్ట్ రోల్ మోడల్స్ తల్లిదండ్రులే. కాబట్టి.. పిల్లలు చాలా వరకు తల్లిదండ్రుల అలవాట్లను చూసి.. నేర్చుకుంటారు.

ముఖ్యంగా తండ్రి దగ్గర సైకలాజికల్ థియరీస్ నేర్చుకుంటారు. దీన్నే ఇమిటేషన్ థియరీ అనిపిలుస్తారు. పిల్లలు సోషల్ స్కిల్స్ ని ఎక్కువగా తమ తల్లిదండ్రుల ద్వారానే నేర్చుకుంటారు. కాబట్టి మంచి రోల్ మోడల్స్ గా తమ పిల్లలకు ఉండటం తల్లిదండ్రులకు చాలా ముఖ్యం. వాళ్లు చక్కగా పెరిగి పెద్దవాళ్లు అయ్యి, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే..తల్లిదండ్రులు మంచి ప్రవర్తన కలిగి ఉండటం చాలా అవసరం.

తమ పిల్లలకు బెస్ట్ రోల్ మోడల్స్ గా ఉండాల్సిన తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మరిచిపోతుంటారు. పిల్లలపై దుష్ర్పభావంచూపే తల్లిదండ్రుల అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటికి దూరంగా ఉండటం ఎలాగో తెలుసుకుందాం.

స్వీయ విమర్శలు

స్వీయ విమర్శలు

చాలా సందర్భాల్లో మన అందం గురించి, కెరీర్ గురించి ఎక్కువ విమర్శించుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాటు వల్ల అందం, సక్సెస్ విషయంలో సరైన లక్ష్యాలు రూపొందించుకోవడంలో మీ పిల్లలు ఫెయిల్ అవుతారు. అలాగే ఇది పిల్లలకు ఒత్తిడి, ఈటింగ్ డిజార్డర్స్ కి కారణమవుతాయి.

గ్యాడ్జెట్స్

గ్యాడ్జెట్స్

చాలామంది మోడ్రన్ తల్లిదండ్రులు పిల్లల ముందు మెసేజింగ్, ఈ మెయిల్, ఎక్కువ సమయం ఫోన్లలో మాట్లాడటం వంటి అలవాట్లకు బానిసలవుతున్నారు. ఇలాంటి అలవాట్లను గమనించిన పిల్లలు.. తమకు సెల్ ఫోన్లు కావాలని చిన్నవయసులోనే మారాం చేస్తారు. దీనివల్ల స్టడీస్ పై దుష్ర్పభావం ఉంటుంది.

జెండర్ రోల్స్

జెండర్ రోల్స్

కొంతమంది తల్లిదండ్రులు పిల్లల జెండర్ ని బట్టి కొన్ని ఆంక్షలు విధిస్తుంటారు. ఉదాహరణకు ఆడపిల్లలు స్పోర్ట్స్ లో ఆసక్తి చూపకూడదని, అబ్బాయిలు ఎమోషన్స్ చూపించకూడని చెబుతుంటారు. ఇలాంటి అలవాట్లు వాళ్లపై తీవ్ర దుష్ర్పభావం పడి.. నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడతారు. సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొనలేరు.

డ్రింకింగ్, స్మోకింగ్

డ్రింకింగ్, స్మోకింగ్

పిల్లల ముందు ఎక్కువగా మధ్యపానం తాగడం, స్మోకింగ్ చేయడం వల్ల అలాంటి అలవాట్లు నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోని స్మోకింగ్, డ్రింకింగ్ కి అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలుపుతడతాయి.

కాంపిటీటెవ్ గా

కాంపిటీటెవ్ గా

చదువు విషయంలో పక్కింటి పిల్లలు లేదా బంధువుల పిల్లలతో వాళ్ల స్నేహితుల ముందు మీ పిల్లలను ఎక్కువగా పోల్చడం, అవమానపరచడం చేయడం వల్ల వాళ్లు చాలా నిరుత్సాహానికి గురవుతాయి. ఇలా చేయడం ఎంకరేజ్ చేయడమని మీరు భావిస్తారు. కానీ ఇది పిల్లలపై సైకాలజికల్ గా దుష్ర్పభావం చూపుతుంది.

ఎక్కువగా వాదించుకోవడం

ఎక్కువగా వాదించుకోవడం

మీ పక్కనే పిల్లలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, మీరిద్దరు ఎక్కువగా, తరచుగా వాదించుకోవడం వల్ల ఆ ప్రవర్తన నేర్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ల ఫ్రెండ్స్ తో గొడవలకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శారీరక హింస

శారీరక హింస

చిన్న చిన్న తప్పులు, పొరపాట్లకు కూడా మీ పిల్లలను మందలించడం, కొట్టడం వంటి అలవాట్లు.. వాళ్లు మానసికంగా ఇబ్బందికి గురవుతారు. చాలా ఎమోషనల్ కి గురవుతారు.

English summary

7 Bad Habits Of Parents That Affect Their Children

7 Bad Habits Of Parents That Affect Their Children. Many a times, as parents, we tend to get caught up with life and forget to take all the necessary steps to be better role models to our children.
Desktop Bottom Promotion