For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజ్ పిల్లలు తప్పటడుగులు వేయకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

By Swathi
|

ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే.. వాళ్ల ఆటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్ కి దగ్గరకు మీరు ఉండాలి. ఒకరకంగా చెప్పాలంటే.. టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ల శారీరక, మానసిక మార్పులు.. తల్లిదండ్రులకు చాలా చాలెంజ్ గా మారతాయి.

టీనేజర్ పెంపకం కంటే.. అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ల మూడ్ స్వింగ్స్, ఆటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ.. హార్మోన్ లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుంచి 18 ఏళ్లలోపు ఉంటాయి. ఆ సమయంలో వాళ్ల పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది.

ఇలాంటి సమయంలో.. వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా.. జీవితంపై ఫోకస్ పెడతారో ఇప్పుడు చూద్దాం. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం..

ఎక్కువగా కంట్రోల్ చేయడం

ఎక్కువగా కంట్రోల్ చేయడం

మరీ ఎక్కువగా మీ టినేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడం ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకుంటారు.

ఓపెన్ గా ఉండటం

ఓపెన్ గా ఉండటం

కొన్ని విషయాల్లో వాళ్లతో ఓపెన్ గా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఉదాహరణకు స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటివల్ల కలిగే హాని గురించి వివరించాలి.

కొత్త స్నేహాలు

కొత్త స్నేహాలు

కొత్త స్నేహాలు మంచిది కాదని భావించకండి. కొత్తవాళ్లతో పరిచయం అలవాటు అవ్వాలి. అలా కాకుండా.. తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్లు ఎలాంటి వాళ్లో మీకే తెలుస్తుంది.

పరిశీలించడం

పరిశీలించడం

ప్రతీ చిన్న విషయాన్నీ మానిటర్ చేయకండి. మీకు తెలుసుకోవాలి అని ఉంటే.. డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి.

అందం విషయంలో

అందం విషయంలో

టీనేజర్స్ లో వాళ్ల అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లైతే.. వాళ్లకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వండి. సమాజం గురించి వివరించండి.

ఒత్తిడి

ఒత్తిడి

చదువు విషయంలో, ఎక్స్ ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు. పదేపదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే.. వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది.

ఫ్యామిలీ ట్రిప్స్

ఫ్యామిలీ ట్రిప్స్

ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు కలిసి చూడటం, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో.. వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి.

English summary

7 Best Parenting Tips To Deal With A Teenage Kid

7 Best Parenting Tips To Deal With A Teenage Kid. As parents of a teenage kid, you must follow certain tips and give them more attention than usual. Have a look at the 7 tips, here.
Story first published:Wednesday, June 8, 2016, 15:02 [IST]
Desktop Bottom Promotion