Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచడానికి సింపుల్ టిప్స్
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. వాళ్ల బాధ్యత మొత్తం తల్లిమీదే ఎక్కువగా ఉంటుంది. వాళ్లు ఏడ్చినా, వస్తువుల పడేసినా, ఆడుకున్నా, అల్లరి చేసినా.. అన్నింటినీ గమనించాల్సిందే తల్లి. అయితే అందరు పిల్లలు ఒకేలా ఉండరు. కొంతమందిని డీల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ల ప్రవర్తనను భరించడం కాస్త కష్టంగా ఉంటుంది.
కొంతమంది చాలా రెబల్ గా ప్రవర్తిస్తే.. వాళ్లను కంట్రోల్ చేయడం తల్లిదండ్రులు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పిల్లలపై తల్లిదండ్రుల అటెన్షన్ కంపల్సరీ ఉండాలి. కొన్నిసార్లు అలాంటి ప్రవర్తనకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కారణమవుతాయి. చాలా కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలకు సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంది.
ఏదైతేనేం.. పిల్లలు క్రమశిక్షణతో లేకుండా ఉంటే.. తల్లిదండ్రులకు చాలా కష్టంగా ఉంటుంది. తినకుండా, స్కూల్ కి వెళ్లకుండా, బొమ్మలను పడేయడం, ఇంట్లో వస్తువులు విసిరేయడం వంటి విషయాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి.. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల క్రమశిక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను క్రమశిక్షణతో పెంచడానికి ఫాలో అవ్వాల్సిన చిట్కాలేంటో చూద్దాం..

టైమింగ్స్
ప్రతి రోజూ ఒకే సమయం ఫాలో అవ్వండి. అంటే.. భోజనం, నిద్ర, టీవీ చూడటం వంటివన్నింటికీ.. ఒక సమయాన్ని కేటాయించి.. ఆ సమయంలో అది చేయాలని చెప్పాలి. దీనివల్ల కొన్ని రూల్స్ ని ఎలాంటి వాదన లేకుండా ఫాలో అవ్వాలని పిల్లలకు తెలుస్తుంది.

తమ వస్తువులు
ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. ఫుడ్, వాటర్ బాటిల్ తీసుకెళ్లడాన్ని నేర్పించండి. దీనివల్ల సూపర్ మార్కెట్ లో లేదా బయట ఎక్కడైనా.. వాటర్, ఫుడ్ కోసం గొడవ చేయకుండా ఉంటారు.

ప్రతిసారీ నో చెప్పకుండా
పిల్లలు అడిగినప్పుడు ప్రతిసారీ నో చెప్పడం వల్ల వర్కవుట్ అవదు. కాబట్టి.. కారణం చెప్పడం, ఛాయిస్ లు ఇవ్వడం వంటివి పాటించండి. ఉదాహరణకు డిన్నర్ కి పిజ్జా కావాలని మారాం చేస్తే.. ఇంకొక రోజు తిందాం అని చెప్పాలి.

ఓకే చెప్పడం
వాళ్లకు కావాల్సినది ప్రతిదీ పొందలేరని వివరించాలి. ఏడుస్తున్నారని.. ఏది కావాలంటే అది ఇవ్వడం మంచిది కాదు. ఇదే తంత్రం ఫాలో అయిపోతారు. కాబట్టి.. చిన్నప్పటి నుంచే.. ఏది ముఖ్యం, ఏది అనవసరం అనేది తెలుసుకునేలా సర్ధిచెప్పాలి.

కొట్టడం
చాలా అల్లరి చేసే పిల్లలను పెంచడం కాస్త కష్టంగానే ఉంటుంది. అలాగనీ.. వాళ్లను కొట్టడం వల్ల.. పరిస్థితి మరింత చేయి దాటిపోతోంది. తరచుగా కొట్టడం వల్ల మీరంటే.. వాళ్లకు భయం ఏ్పడుతుంది. అప్పుడు ఏడ్వడం మరింత ఎక్కువ చేస్తారు.

అటెన్షన్
వాళ్లను చూసుకోవడానికి మీరు ఉన్నారని, వాళ్లకు సంబంధించిన ఏ విషయాన్నైనా పంచుకోవచ్చని, నిర్లక్ష్యం చేయడంలేదని వాళ్లో కలిగేలా చేయాలి.

సైలెంట్ గా ఉండటం
గట్టిగా అరవడం, తిట్టడం వల్ల వాళ్ల ప్రవర్తన మితిమీరిపోతుంది. కాబట్టి.. ఏదైనా మరీ ఎక్కువగా వాదిస్తున్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు సైలెంట్ గా ఉండటం మంచిది.



Click it and Unblock the Notifications