Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రతి తల్లీ కూతురికి ఖచ్చితంగా నేర్పించాల్సిన విషయాలు..!!
తల్లీ కూతుళ్ల మధ్య ప్రేమ చాలా నిజమైనది. నిర్మలమైనది. దీన్ని ఎవరూ కాదనలేరు. తల్లీ కూతుళ్లు.. చాలా క్లోజ్ గా, అన్ని విషయాలను షేర్ చేసుకునేలా ఉంటారు. ఎందుకంటే.. ఇద్దరూ ఆడవాళ్లే కావడం వల్ల వీళ్లు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు.
కూతుళ్లకు తల్లే ఫస్ట్ రోల్ మోడల్. చాలా విషయాలను అమ్మాయిలు తమ తల్లి నుంచే నేర్చుకుంటారు. అచ్చం తల్లిలాగే తమను ఊహించుకుంటూ.. తమ జీవితంలో ముందుకు వెళ్తారని.. చాలామంది సైకాలజీస్ట్ లు చెబుతున్నారు. డ్రెస్సింగ్ సెన్స్, స్టైల్ వంటి రకరకాల అభిరుచులను తమ తల్లినే ముందుగా అనుకరిస్తారు.
ప్రవర్తనలో మార్పులు, అభిరుచులను తమ తల్లి ద్వారానే నేర్చుకుంటారు. కూతుళ్ల ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అమ్మే. ప్రతి విషయంలోనూ సలహా కోసం కూతుళ్లు తల్లి దగ్గరికే వెళ్తారు. ఎంత పెద్దవాళ్లు అయినా.. తల్లి సలహా తీసుకోవడం, దాన్ని పాటించడం అమ్మాయిలకు అలవాటుగా మారింటుంది. అలాగే.. తల్లులు.. ఖచ్చితంగా తమ కూతుళ్లకు నేర్పించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆత్మ గౌరవం
ముందుకు మీ కూతురు.. తాను ఎంత అందంగా ఉంది అనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. అలాగే.. ఆమె న్యాచురల్ లుక్ ని ప్రేమించుకునేలా మార్చాలి. అలాగే.. ఆమెలో ఆత్మ గౌరవం పెరిగేలా.. ప్రొత్సహించాలి, నమ్మకం కలిగించాలి.

స్వతంత్రత
కూతుళ్లకు.. స్వతంత్ర నేర్పించడం చాలా అవసరం. యుక్తవయసులోనే.. ఎవరిపైనా ఆధారపడకుండా.. ఉండేలా తీర్చిదిద్దాలి.

కెరీర్ ప్రాధాన్యత
జీవితంలో కెరీర్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, అది ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా వివరించాలి. అప్పుడే.. ఆమె ఆర్థికంగా స్వతంత్రత పొందగలుగుతుంది. ప్రస్తుత ప్రపంచంలో ఇది చాలా ముఖ్యమైనదని చెప్పాలి.

అబ్బాయిలను ఎలా ఫేస్ చేయాలి
అబ్బాయిలతో ఎలా మాట్లాడుతుందనే విషయంపై కూతురికి సలహా ఇవ్వడం, మాట్లాడటం చాలా అవసరం. ముఖ్యంగా టీనేజర్ గా ఉన్నప్పుడు ఈ విషయాలు ఖచ్చితంగా మాట్లాడాలి. అలాగే ఎవరినైనా ఇష్టపడుతుంటే.. వాళ్లు ఆమె అందంపై ఆకర్షితులవుతున్నారా, లేక ఆమెను ఇష్టపడుతన్నారా అనే విషయాన్ని గ్రహించమని చెప్పాలి.

ఆత్మ రక్షణ
ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తెలియని వాళ్లను ఎలా ఫేస్ చేయాలి, తనను తాను రక్షణ ఎలా కల్పించుకోవాలి అనేదానిపై.. కొన్ని చిట్కాలు ఇవ్వాలి. తన పర్స్ లో స్ప్రే వంటి వాటిని పెట్టుకుని వెళ్లమని తల్లి సలహా ఇవ్వాలి.

స్వీయ వ్యక్తీకరణ ప్రాధాన్యత
ఎలాంటి పరిస్థితినైనా.. ఫేస్ చేయగలిగే.. సత్తా కలిగి ఉండాలని.. మీ కూతురి మీరు నేర్పించాలి. చాలా దృఢంగా ఉండాలని చెప్పాలి.

మేకప్ టిప్స్
మేకప్ ఎలా అప్లై చేయాలి, హీల్స్ వేసుకుని ఎలా నడవాలి, చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి అన్ని రకాల టిప్స్ ని తల్లే కూతుళ్లకు నేర్పించాలి. తల్లీ కూతుళ్ల మధ్య ప్రేమ పెరగడానికి ఇదో.. ఫన్నీ పద్ధతి.



Click it and Unblock the Notifications