For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విడాకుల సమయంలో పిల్లల ముందు చేయకూడని తప్పులు..

By Swathi
|

ప్రస్తుత జనరేషన్ లో కపుల్స్ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న సమస్య విడాకులు. ఏ చిన్న సమస్య వచ్చినా.. విడాకులే పరిష్కారం అని భావిస్తారు. కానీ.. విడాకుల వల్ల పిల్లలు, పెద్దలు అందరూ బాధపడాల్సి వస్తుందని ఎవరూ ఊహించడం లేదు. విడాకులతో విడిపోయిన జంటలు చేసే అతిపెద్ద పొరపాట్ల గురించి చర్చిద్దాం ఇవాళ.

లీగల్ గా భార్యాభర్తలు విడిపోవడం, తమ వైవాహక జీవితానికి శుభం కార్డ్ పలడానికి డైవర్స్ ని ఎంచుకుంటారు. విడాకులనేది.. భార్యాభర్తల మధ్య చాలా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. అది మానసికంగా, ఆర్థికపరమైన ఇబ్బందులు తీసుకొస్తుంది. డైవర్స్ తీసుకోవడానికి చాలా కారణాలుంటాయి. చాలా బాధ, సమస్యల కారణంగా విడాకులతో కపుల్స్ విడిపోతున్నారు. అయితే పిల్లలు ఉన్నప్పుడు అది అత్యంత దారుణంగా ఉంటుంది. తమ పేరెంట్స్ విడాకులు తీసుకునే ప్రాసెస్, సెపరేట్ అయ్యే విధానం మొత్తం వాళ్లు చూడాల్సి వస్తుంది.

ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ.. పదే పదే గొడవ పడే తల్లిదండ్రులను చూడటం వాళ్లలో సైకలాజికల్ గా సమస్య తీసుకొస్తుంది. అలాగే వాళ్లలో నెగటివ్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి విడాకులు తీసుకునేటప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా చాలా జాగ్రత్తగా జరిగేలా తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి. కొన్ని రకాల పొరపాట్ల వల్ల పిల్లల్లో నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఎవరితో ఉంటావని అడగడం

ఎవరితో ఉంటావని అడగడం

పిల్లలను తల్లి దగ్గర లేదా తండ్రి దగ్గర ఎవరితో ఉంటావని అడగటం. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది. చాలా గిల్టీగా, బాధగా ఫీలవుతారు.

మధ్యవర్తిగా మార్చడం

మధ్యవర్తిగా మార్చడం

మీ పార్ట్ నర్ తో మాట్లాడటం ఇష్టం ఉండదు. అప్పుడు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే.. పిల్లలను మధ్యవర్తిగా మార్చడం అనేది.. అతిపెద్ద మిస్టేక్. ఇలాంటి పనుల వల్ల వాళ్లలో.. తల్లిదండ్రుల సపరేషన్ గురించి చాలా ఎక్కువగా ఫీలవుతారు.

పిల్లలపై ప్రేమ

పిల్లలపై ప్రేమ

విడాకుల కారణంగా.. మీరు పిల్లలను ప్రేమించే విధానంలో మార్పులు రాకూడదు. కొన్ని సందర్భాల్లో విడాకుల కారణంగా.. తమను నిర్లక్ష్యం చేస్తారనే భయం పిల్లల్లో ఉంటుంది. అలాగే.. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే.. వాళ్లను విడదీస్తారనే ఆందోళన కూడా కలుగుతుంది.

ఎమోషన్ వీక్ నెస్

ఎమోషన్ వీక్ నెస్

మీరిద్దరూ విడిపోవడం వల్ల ఇప్పటికే పిల్లలు చాలా బాధపడి ఉంటారు. మళ్లీ వాళ్లముందు మీ బాధను బయటపెట్టడం, జాలి చూపడం వల్ల వాళ్లు మరింత ఫీలవుతారు. పిల్లల ముందు ఎమోషనల్ వీక్ నెస్ చూపించడం వల్ల వాళ్ల మానసిక స్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది.

వ్యతిరేకత పెంచడం

వ్యతిరేకత పెంచడం

మీ పిల్లలను మీ భాగస్వామికి వ్యతిరేకంగా మార్చాలని ప్రయత్నించడం అత్యంత పెద్ద తప్పు. మీ భాగస్వామిపై ఉన్న కోపం, ఆవేశం ఉపయోగించే.. పిల్లల్లో వాళ్లపై నెగటివ్ ఫీలింగ్స్ కలిగించడం మంచిది కాదు.

దాచిపెట్టడం

దాచిపెట్టడం

విడాకులకు సంబంధించిన విషయాలను వాళ్లకు చెప్పకుండా దాచిపెట్టడం మంచిది కాదు. మీ భాగస్వామి ఇక మీ ఫ్యామిలీలో ఎప్పటికీ భాగం కాలేరన్న విషయాన్ని వివరించాలి.

పదే పదే గొడవపడటం

పదే పదే గొడవపడటం

మీ పిల్లల ముందు పదే పదే గొడవ పడటం సరైన అలవాటు కాదు. ఒకవేళ వాళ్ల యంగర్ అయితే.. తీవ్రమైన మానసిక సమస్యకు, డిప్రెషన్ కి కారణమవుతుంది. కాబట్టి.. పిల్లల ముందు పదేపదే గొడవపడకండి.

English summary

7 Worst Mistakes Divorced Parents Make

7 Worst Mistakes Divorced Parents Make. Sometimes, divorced parents tend to make a few mistakes that can have negative consequences on their children, here is a list of such mistakes, have a look.
Story first published:Tuesday, June 28, 2016, 10:05 [IST]
Desktop Bottom Promotion