For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేటెస్ట్ స్టడీ: తల్లి రెగ్యులర్ గా పాలు తాగితే.. బిడ్డ ఎత్తు పెరగడం ఖాయం..!

By Swathi
|

కన్వీవ్ అయిన తర్వాత ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని ఇంట్లో పెద్దవాళ్లు, డాక్టర్లు సూచిస్తారు. ఆకుకూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతుంటారు. అలాగే ఆహారం విషయంలో కేర్ తీసుకుంటే.. పుట్టబోయే బిడ్డ హెల్తీగా, ఎనర్జిటిక్ గా ఉంటారని, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెబుతుంటారు.

అయితే కేవలం ఆహారం వల్ల ఆరోగ్యమే కాదు.. రూపురేఖలపై కూడా ప్రభావం ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అవును.. గర్భిణీ స్త్రీలు ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల.. పుట్టబోయే బిడ్డ ఎత్తుపై ప్రభావం ఉంటుందని ఈ స్టడీస్ చెబుతున్నాయి. గర్భధారణ సమయంలో రెగ్యులర్ గా ఒక గ్లాసు పాలు తీసుకుంటే.. పుట్టిన బిడ్డ హైట్ ఎక్కువ పెరుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. మరి అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

స్టడీ

స్టడీ

80లలో పుట్టిన పిల్లలపై అధ్యయనాలు నిర్వహించిన సైంటిస్ట్ లు.. వాళ్ల హైట్ గురించి స్టడీ చేశారు.

పాల మోతాదు

పాల మోతాదు

పిల్లల హైట్ తల్లులు గర్భధారణ సమయంలో తీసుకున్న పాల మోతాదుపై ఆధారపడి ఉందని ఈ స్టడీస్ తేల్చాయి.

ప్రసవం తర్వాత

ప్రసవం తర్వాత

అంతేకాదు.. ప్రసవం తర్వాత కూడా తల్లి పాలు తాగడం వల్ల అప్పుడే పుట్టిన పిల్లలకు ఎక్కువ ప్రయోజనాలుంటాయట. బిడ్డ ఎదుగుదలకు పాలు చాలా ఉపయోగపడతాయని ఈ స్టడీస్ తేల్చాయి.

పాలు తీసుకుంటే

పాలు తీసుకుంటే

809 మంది మహిళలపై స్టడీ చేశారు. వాళ్లు ప్రెగ్నెన్సీ టైంలో ఎంత మోతాదులో పాలు తీసుకున్నారు అనేది ప్రధానంగా చర్చించారు. అలాగే పుట్టిన బేబీ వెయిట్, హైట్ ని 20 ఏళ్ల తర్వాత ఎలా ఉందని గుర్తించారు.

150మిల్లీ లీటర్ల పాలు

150మిల్లీ లీటర్ల పాలు

ఈ అధ్యయనాల్లో గర్భధారణ సమయంలో ఏ తల్లులైతే.. 150 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువ పాలు తాగిన మహిళలకు పుట్టిన పిల్లలు ఎక్కువ హైట్ పెరుగుతారట. అంటే రోజుకి ఖచ్చితంగా ఒక గ్లాసు పాలు తాగారనమాట. అంతకంటే తక్కువ పాలు తాగిన వాళ్లకు పుట్టిన వాళ్లు వీళ్లతో పోల్చితే పొడవు తక్కువగా ఉన్నారని ఈ స్టడీస్ తేల్చాయి.

డయాబెటిక్ రిస్క్ తక్కువ

డయాబెటిక్ రిస్క్ తక్కువ

అంతేకాదు.. టీనేజ్ వచ్చాక వాళ్లలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వాళ్లలో టైప్ టు డయాబెటిస్ రిస్క్ తక్కువగా ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి.

హైట్, వెయిట్

హైట్, వెయిట్

ప్రసవం తర్వాత పాలు తాగడం వల్ల బేబీ వెయిట్, హైట్ గ్రోత్ బావుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఐక్యూ లెవెల్స్

ఐక్యూ లెవెల్స్

గతంలో బ్రిటీష్ సైంటిస్ట్ లు జరిపిన అధ్యయనాల్లో ఎక్కువగా పాలు తాగే మహిళలకు పుట్టే పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని తేల్చాయి.

ఒక గ్లాసు

ఒక గ్లాసు

కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా రోజుకి ఒక గ్లాసు పాలు అంటే.. 150 మిల్లీలీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కా ఫాలో అయిపోండి.

English summary

A daily glass of milk during pregnancy makes your children taller

A daily glass of milk during pregnancy makes your children taller. Children born to women who drink milk during pregnancy are more likely to be tall when they are teenagers, new research shows.
Desktop Bottom Promotion