Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
అలర్ట్: అప్పుడే పుట్టిన పిల్లల్లో బ్రీతింగ్ సమస్యకు కారణాలివే..!
ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లలు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లల్లో కనిపిస్తోంది. పుట్టుకతోనే శ్వాస సంబంధ సమస్యలు రావడం వల్ల.. తల్లిదండ్రులకు చాలా ఆందోళనగా ఉంటుంది. అలాగే ఇది చాలా రిస్క్ తో కూడిన సమస్య.
బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్న పిల్లల్లో ముక్కు, నోటి చుట్టూ బ్లూ కలర్ కనిపిస్తూ ఉంటుంది. నాసికా రంధ్రంలో మంటగా ఉంటుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉందని.. ఇలాంటి లక్షణాలన్నీ తెలుపుతాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కి చాలా కారణాలుంటాయి. వెంటిలేషన్, ఆక్సీజన్, మెడికేషన్స్ ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఉపశమనానికి కాస్త సమయం పడుతుంది. అయితే.. అప్పుడే పుట్టిన పిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కి కారణాలేంటి..

ప్రీమెచ్యురిటీ
సాధారణంగా 31 వారాలకు శిశువులో లంగ్స్ ఉపరితలం ఏర్పడుతుంది. ఈ ఉపరితలం ఆక్సీజన్ పీల్చుకోవడానికి.. శిశువు సొంతంగా శ్వాస పీల్చినప్పుడు ఊపిరితిత్తులు కొంచెం ఎక్సాపాండ్ అవుతాయి. అదే నెలలు నిండక ముందే శిశువు పుడితే.. ఈ ఉపరితలం సరిగా ఏర్పడక శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి.

ఇన్ఫెక్షన్
జ్వరం అనేది ఇన్ఫెక్షన్ కి సంకేతం. దీనివల్ల అప్పుడే పుట్టిన పిల్లల్లో బ్రీతింగ్, హార్ట్ రేట్ లో సమస్యలు తీసుకొస్తాయి. బ్యాక్టీరియా వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా బ్రీతింగ్ సమస్యలు ఎదురవుతాయి.

సిడేషన్
ప్రసవం సమయంలో ఇచ్చే సెడేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవ్వడంలో కాస్త అజాగ్రత్త వహించినా.. అది ప్లేసాంటా ద్వారా ప్రవహించి.. పొట్టలో శిశువుకి చేరే అవకాశం ఉంది. డెలివరీకి ముందు ఇచ్చే మందులు.. బేబీకి అందడం వల్ల.. అప్పుడే పుట్టిన పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలకు కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

లో బ్లడ్ షుగర్
డయాబెటిక్ మదర్ కి బేబీ పుడితే.. వాళ్లలో లో బ్లడ్ షుగర్ రిస్క్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ బ్రీతింగ్ లో బ్లడ్ షుగర్ కి లక్షణమని.. అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లి బ్లడ్ లో ఎక్కువ షుగర్ ఉండటం వల్ల బేబీ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది, అలాగే ఫ్యాట్ పేరుకుంటుంది.

లంగ్స్ పూర్తీగా ఏర్పడకపోవడం
అప్పుడే పుట్టిన పిల్లల్లో లంగ్స్ పూర్తీగా డెవలప్ కాకపోతే.. గాలి పీల్చుకోవడానికి తగిన స్టామినా ఉండదు. అలాగే బిడ్డకు సరిపోయేంత గాలి అందకపోవడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది.

తోబుట్టువులకు
తనతో పాటు పుట్టిన పిల్లలకు లేదా, తనకంటే ముందు పుట్టిన పిల్లలకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటే.. ఈ బిడ్డకు కూడా ఆ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆక్సిజన్
కడుపులో ఉన్నప్పుడు, పుట్టేటప్పుడు, పుట్టిన తర్వాత సరైన ఆక్సిజన్ అందక పోవడం వల్ల ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి.



Click it and Unblock the Notifications