For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు అబద్ధాలు ఎందుకు చెప్తారు..?

|

పిల్లలు చాలా సార్లు అబద్ధాలు చెప్తారు. తల్లిదండ్రుల చూపుల నుంచి, ధ్యాస నుంచి తప్పించుకోవడానికి వారు ఆ పని చేయడానికి చాలా ఇష్టపడతారు.

మీ పిల్లలు ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే, వాళ్ళు ఇలాగే అబద్ధాలు చెప్పడం కొనసాగిస్తే ఏర్పడే పరిణామాల గురించి వారిని కూర్చోబెట్టి చర్చించండి.

తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఒక్క నిమిషంలో అబద్ధాలు చెప్పడం మాన్పించలేరు, మీరు ఆ పని చక్కగా, నింపాదిగా పిల్ల వాడిని అర్ధం చేసుకుంటూ నిజాయితీగా ఉండేలా, నిజాన్ని ప్రేమించేలా శిక్షణ ఇవ్వాల్సి వుంటుంది.

అయినప్పటికీ, చుట్టు పక్కల వారి ప్రభావం వల్లా, ఇతర కారణాల వల్లా కూడా పిల్లలు అబద్ధాలు ఆడతారు.

Find Out The Reasons Why Children Lie!

ఈ రోజు పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్తారని నిపుణులు అనుకుంటారో అవి మీ ముందుకు తెస్తోంది బోల్డ్ స్కై. మీరు ఈ కారణాలను ఒకసారి పరిశీలిస్తే మీరు మీ పిల్లల్ని అర్ధం చేసుకోవడం మొదలు పెడతారు, మీ అనుబంధం మరింత మెరుగు పడి, మరింత లోతైన బంధం ఏర్పడేలా చేసుకోగలుగుతారు.

మరి మీరు ఎందుకు వేచి చూస్తున్నారు. మీ పిల్లలు ఎందుకు అబద్ధాలు ఆడతారో ఈ కారణాలు చూసి తెలుసుకోండి.

ఒక పరిస్థితి నుంచి బయట పడేందుకు : వారున్న ఒకానొక పరిస్థితి నుంచి బయట పడేందుకు పిల్లలు అబద్ధాలు ఆడతారు. ఇది పిల్లలకు ఒక రకమైన భద్రతా భావాన్ని కల్పిస్తుంది, అలా అబద్ధం ఆడితేనే వారు ఆ క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడతారని వారు భావిస్తారు.

చుట్టుపక్కల వారి వత్తిడి వల్ల : పెరిగే పిల్లలకు చుట్టుపక్కల వారి వత్తిడి తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. పిల్ల వాడు బాగా వత్తిడిలో వున్నప్పుడు, వారి కిష్టం లేని పనులు చేయడానికి వత్తిడికి గురౌతారు, అలా అయితేనే ఆ సమూహంలో వారు అంగీకరించబడతారని వారి భావన. అందువల్ల, తల్లిదండ్రులు చుట్టుపక్కల వారి వత్తిడి మీద ఒక కన్నేసి వుంచి, పిల్లలకు సహాయం చేసే ప్రయత్నం చేయాలి.

Find Out The Reasons Why Children Lie!

ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి : పిల్లలు తమ చుట్టూ వుండే వారి దృష్టిని ఆకర్షించడానికి ఏపనైనా చేస్తారు. మీ పిల్లవాడు ఇటీవల ఒకింత వింతగా ప్రవర్తిస్తూ మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటే అది మీరు కంగారు పడాల్సిన విషయమే.

ఎందుకంటే అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోతుంది కనుక : పిల్లలకు అబద్ధాలు ఆడడం అలవాటు అయిపోయి, దాని గురించి తల్లిదండ్రులు ఏమీ చేయకపోతే, అబద్ధాలు ఆడడం మామూలేనని, తప్పేమీ కాదని పిల్లవాడు అనుకోవడం మొదలు పెడతాడు. పిల్లలు అబద్ధాలు ఆడడానికి సాధారణమైన కారణాలలో ఇది ఒకటి. ఇది చాలా సరదాగా వుందని కూడా వారు భావిస్తుంటారు.

పిల్లవాడి ప్రవర్తన ఎప్పుడూ తనిఖీ చేయలేదు కనుక : పిల్లవాడు అబద్ధాలు ఆడుతున్నట్టు తల్లిదండ్రులు గమనిస్తే, పిల్లవాడిని తక్షణమే సంస్కరించాలి. ఒక తండ్రిగా మీరు మీ పిల్లవాడిని సంస్కరించడంలోను, తప్పేదో ఒప్పేదో వివరించి చెప్పడంలోను విఫలమైతే, పిల్లవాడు అలాగే చేయడం కొనసాగిస్తూ ఉంటాడు.

English summary

Find Out The Reasons Why Children Lie!

Children lie almost all the time. It is one of the many things they love to do, in order to escape from the eyes and attention of their parents.
Story first published: Friday, April 22, 2016, 18:58 [IST]
Desktop Bottom Promotion