Latest Updates
-
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి
వయసు పెరుగుతున్నా.. హైట్ పెరగని పిల్లలకు ఇవ్వాల్సిన డైట్..!
కొంతమంది పిల్లలు పొట్టిగా ఉంటారు. తల్లిదండ్రులు పొట్టిగా ఉండటం వల్లనో, పోషకాహారం లోపం వల్లనో హైట్ పెరగలేకపోతారు. అయితే పిల్లలు సంవత్సరానికి కనీసం రెండున్నర ఇంచులు పెరగడం చాలా అవసరం. కానీ కొంతమంది ఈ లెక్క ప్రకారం పెరగకపోవడం వల్ల వయసు పెరుగుతున్నా.. హైట్ మాత్రం పెరగలేకపోతారు. అలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి ?
లేటెస్ట్ స్టడీ: తల్లి రెగ్యులర్ గా పాలు తాగితే.. బిడ్డ ఎత్తు పెరగడం ఖాయం..!
చిన్నవయసులో పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉండవు. చాలా హ్యాపీగా, జాలీగా గడిపేస్తూ ఉంటారు. ఆడుకోవడం, తిరగడం, గంతులేయడం వంటి సరదాలతో ఎంజాయ్ చేస్తారు. కానీ పేరెంట్స్ వాళ్ల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. వాళ్ల హెల్త్ పై శ్రద్ద పెట్టాలి. ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి పోషకాలు అవసరం, పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలేంటి అనే విషయంపై జాగ్రత్త వహించాలి.
సాధారణంగా పిల్లలకు రెండేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి.. వాళ్ల శారీరక ఎదుగుదల మొదలవుతుంది. పిల్లల ఎముకలు, కండరాలు అప్పుడే డెవలప్ అవడం, స్ట్రాంగ్ గా మారడం, ఎత్తు పెరగడం మొదలవుతుంది. పిల్లల ఏడాదికి రెండున్నర ఇంచులు పెరుగుతారు. మగపిల్లలు 20 ఏళ్ల వరకు, ఆడపిల్లలు 14 ఏళ్ల వయసు వచ్చే వరకు పెరుగుతారు.
అలర్ట్: వన్ ఇయర్ లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదు ? ఎందుకు ?
ఒక వ్యక్తి హైట్ కి చాలా కారణాలుంటాయి. వారసత్వం, హార్మోన్స్, న్యూట్రీషన్, వ్యాయామం, ఓవరాల్ హెల్త్ ఇవన్నీ ప్రభావం చూపుతాయి. ఒకవేళ మీరు మీ పిల్లలు హైట్ పెరగాలని భావిస్తే.. కొన్ని టిప్స్ మీకు సహాయపడతాయి. మీ పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వడం వల్ల వాళ్లు సరైన ఎత్తు పెరుగుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డైరీ ప్రొడక్ట్స్
పాలు, వెన్న, మీగడ, పెరుగు ఇలాంటి డైరీ ప్రొడక్ట్స్ మీ పిల్లలు ఇష్టపడేలా, తినేలా జాగ్రత్త పడండి. రెగ్యులర్ గా వీటిని తినడం వల్ల ప్రొటీన్స్, క్యాల్షియం అందుతాయి. ఈ రెండు ఎముకలు, కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. దీంతో మీ పిల్లలు వేగంగా ఎత్తు పెరుగుతారు.

ఎగ్స్
కోడిగుడ్లలో కూడా ప్రొటీన్స్, విటమిన్ డి, విటమిన్ బి, రైబో ఫ్లోవిన్ ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల పెరుగుదల, గ్రోత్ కి సహాయపడతాయి.

చికెన్
కండరాలు, ఎముకల డెవలప్ మెంట్ కి ప్రొటీన్స్ చాలా అవసం. రెగ్యులర్ గా చికెన్ తినడం వల్ల పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది.

అరటిపండ్లు
ఎదిగే పిల్లలకు అరటిపండ్లు ఇవ్వడం వల్ల వాళ్లు న్యాచురల్ గా హైట్ పెరుగుతారు. అరటిపండ్లలో మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం ఉండటం వల్ల.. ఇది పిల్లలు వేగంగా హైట్ పెరగడానికి సహకరిస్తుంది.

ఓట్ మీల్
హైట్ పెరగడానికి ఓట్ మీల్ న్యాచురల్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్స్ టిష్యూస్ వేగంగా పెరగడానికి సహాయపడుతాయి.

సోయాబీన్
సోయా బీన్ లో పిల్లల ఎదుగుదలకు సహాయపడే పోషకాలు ఉంటాయి. ఫోలేట్, విటమిన్స్, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎముకలు, కండరాల ఎదుగుదలకు సహాయపడతాయి. పిల్లలు వాళ్లు పెరగాల్సిన ఎత్తు పెరగడానికి సహకరిస్తాయి.

చేపలు
సాల్మన్, సార్డిన్, ట్యూనా వంటి చేపల్లో విటమిన్ డి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల పెరుగుదలకు చాలా అవసరం.

స్విమ్మింగ్
పిల్లలకు 5 నుంచి 6 ఏళ్ల వయసు రాగానే స్విమ్మింగ్ క్లాసెస్ లో జాయిన్ చేయించండి. పిల్లలు న్యాచురల్ గా హైట్ పెరగడానికి స్విమ్మింగ్ ఎక్సర్ సైజ్ సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











