For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వన్ ఇయర్ లోపు పిల్లలకు అందివ్వాల్సిన హెల్తీ ఫుడ్స్

By Super
|

మీ బిడ్డ రోజు రోజుకి కొద్దిగా కొద్దిగా పెరగటం గమనిస్తూ ఉంటారు. అందువలన మీ బిడ్డకు ఇచ్చే ఆహారం పట్ల శ్రద్ద వహించాలి. మీ బిడ్డ కోసం ఆరోగ్యకరమైన ఆహారం సంవత్సరం లోపు చాలా కీలకమైనది.

మీ పిల్లలు ఆహారం తినటం నేర్చుకుంటే, అతను/ఆమె మరింత చురుకుగా ఉంటారు. కాబట్టి మీ పిల్లల కోసం మీరు వివిధ రకాల ఆహారాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా అతడు/ఆమె మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు తెలుసుకోవాలి.

నిజానికి మంచి పోషణ కలిగిన ఆహారం అతడు/ఆమె శరీరం పెరుగుదలకు మరియు ఆరోగ్యానికి చాలా అవసరం. వారు ఆడుకోవటానికి,తిరగటానికి, విషయాలను సులభంగా తెలుసుకోవటానికి మరియు గ్రహించటానికి శక్తి అవసరం.

కాబట్టి, మీరు అతడు / ఆమె మొదటి సంవత్సరంలో మీ బిడ్డకు పెట్టవలసిన ఉత్తమ ఆహారాల జాబితాను తెలుసుకోవాలి. వారికీ వివిధ రకాల రుచులు మరియు పోషక ఆహారాన్ని అందించాలి.

బెర్రీలు

బెర్రీలు

మీరు మీ బిడ్డకు తినిపించవలసిన ఆహారాల్లో ఇది ఒకటి. ఇది రుచిలో కొంచెం ఉప్పగా ఉన్న కలర్ ఫుల్ గా ఉంటుంది. పిల్లలకు బెర్రీలను చిన్న చిన్న ముక్కలుగా కోసి తినిపించాలి. లేకపోతే జ్యూస్ చేసి త్రాగించాలి.

సాల్మన్

సాల్మన్

మీ బిడ్డ ప్రజ్ఞాన అభివృద్ధి కోసం అవసరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సాల్మన్ చేపలో సమృద్దిగా ఉంటాయి. వారంలో ఒకసారి ఉడికించిన చేప గుజ్జును పుష్టికరమైన ఆహారంతో కలిపి తినిపించాలి.

ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి

ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి

ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి మీ బిడ్డ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇది మీ శిశువుకు మంచి ఆహార ఎంపిక అవుతుంది.

ఆకుపచ్చని ఆకుకూరలు

ఆకుపచ్చని ఆకుకూరలు

మీ బిడ్డకు పాలకూర,కాలే వంటి ఆకుకూరలను పెట్టాలి. కేవలం ఘన ఆహారం తినటం ప్రారంభించిన పిల్లలకు ఇది ఉత్తమంగా ఉంటుంది.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

ఈ ఆహారంలో పైబర్ సమృద్దిగా ఉంటుంది. మీ పిల్లలకు బార్లీ,ఓట్స్,బ్రౌన్ రైస్ లేదా ఇతర తృణధాన్యాలను ఉపయోగించి తయారుచేసిన ఆహారాన్ని పెట్టాలి.

గుడ్లు

గుడ్లు

కొంచెం కూరగాయల రసం,గిలకొట్టిన గుడ్డు మిశ్రమం ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఈ పుష్టికరమైన ఆహారాన్ని కొంచెం పెట్టాలి.

వేరుశెనగ

వేరుశెనగ

కొంత మంది పిల్లలలో వేరుశెనగలు ఒక ప్రతిచర్యను కలిగి ఉండవచ్చు. కాబట్టి ఈ ఆహారాన్ని పిల్లలకు పెట్టె సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రారంభంలో కాల్చిన రొట్టెకు కొంచెం పీ నట్ బటర్ రాసి తిన్పించాలి.

Desktop Bottom Promotion