For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలలో ఇబ్బందిపెట్టే కాన్ట్సిపేషన్ నివారించే ఎఫెక్టివ్ రెమెడీస్..!

పిల్లల్లో కాన్ట్సిపేషన్ సమస్యకు ప్రధాన కారణం.. ఎక్కువగా పాలు తాగడం, డైట్ లో ఫైబర్ తక్కువగా ఉండటం, లిక్విడ్స్ తక్కువగా తీసుకోవడం. ఇలాంటి చిన్న చిన్న డైట్ మిస్టేక్స్ వల్ల పిల్లలో ఈ సమస్య కనిపిస్తుంది.

By Swathi
|

పిల్లల్లో కాన్ట్సిపేషన్ సమస్యకు ప్రధాన కారణం.. ఎక్కువగా పాలు తాగడం, డైట్ లో ఫైబర్ తక్కువగా ఉండటం, లిక్విడ్స్ తక్కువగా తీసుకోవడం. ఇలాంటి చిన్న చిన్న డైట్ మిస్టేక్స్ వల్ల పిల్లలో ఈ సమస్య కనిపిస్తుంది. కాన్ట్సిపేషన్ సమస్య వచ్చిందంటే.. పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

How To Cure Constipation In Babies

మలవిసర్జన సమయంలో మీ బేబీ చాలా ఇబ్బంది పడుతుండటం, ఒక రోజు దాటినా.. మలవిసర్జన చేయకపోవడం వంటి లక్షణాలు మీ బేబీలో మలబద్ధకానికి లేదా కాన్ట్సిపేషన్ కి కారణమవుతుంది. కాబట్టి పిల్లలకు సంబంధించి ప్రతి విషయంలోనూ చాలా అలర్ట్ గా ఉండాలి.

ఒకవేళ మీ బేబీ కాన్ట్సిపేషన్ సమస్యతో బాధపడుతున్నాడంటే.. ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి. మంచినీళ్ల నుంచి ఆహారం వరకు ప్రతి ఒక్కటి.. హెల్తీగా, తేలికగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. అలాగే మీ బేబీ కాన్ట్సిపేషన్ తో బాధపడుతూ ఉంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవండి.. మెరుగైన ఫలితాలు చూడండి..

ఎక్కువ ఫ్లూయిడ్స్

ఎక్కువ ఫ్లూయిడ్స్

తరచుగా మీ బేబీ నీళ్లు తాగేలా జాగ్రత్తపడండి. కొద్ది మోతాదులో నీళ్లు తాగినా.. హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. అలాగే యూరిన్ కలర్ చెక్ చేయండి. ఒకవేళ యూరిన్ డార్క్ కలర్ లో ఉండే.. మీ బేబీకి మరింత ఎక్కువ నీళ్లు కావాలని గుర్తించండి.

పండ్లు

పండ్లు

కాన్ట్సిపేషన్ తో బాధపడే పిల్లలకు ఎక్కువ ఫైబర్ అవసరం. ఫ్రూట్స్, వోల్ గ్రెయిన్ బ్రెడ్, ఉడికించిన వెజిటబుల్స్ ఎక్కువగా తినిపించాలి. ఫైబర్ ఎక్కువగా పిల్లలకు ఇవ్వడం వల్ల కాన్ట్సిపేషన్ నివారించవచ్చు.

కాన్ట్సిపేషన్ కి కారణమయ్యే ఆహారాలు

కాన్ట్సిపేషన్ కి కారణమయ్యే ఆహారాలు

పెరుగు, మీగడ, అరటిపండ్లు, క్యారట్స్, అన్నం వంటి ఆహారాలను కాన్ట్సిపేషన్ తో బాధపడే పిల్లలకు పెట్టకపోవడం మంచిది.

యాక్టివిటీ

యాక్టివిటీ

కాన్ట్సిపేషన్ తో బాధపడే పిల్లలు బాగా ఆడుకోవడానికి సహకరించాలి. వాళ్ల శరీరం కదలడం, ఎగరడం, పరుగెత్తడం వంటి యాక్టివిటీస్ చేస్తుండే కొద్దీ.. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై.. కాన్ట్సిపేషన్ ని నివారిస్తుంది.

పాలు

పాలు

మరీ ఎక్కువ మొత్తంలో పాలు అందించడం వల్ల పిల్లలలో కాన్ట్సిపేషన్ కి కారణమవుతుంది. కాబట్టి తక్కువ మోతాదులో పాలు అంటే.. రోజుకి 3 ఔన్సులకంటే ఎక్కువ ఇవ్వకూడదు.

రెగ్యులర్ టైం

రెగ్యులర్ టైం

మీ బేబీలో పాటీ టైమ్ ని రెగ్యులేట్ చేయాలి. ప్రతి రోజూ ఒకే సమయం పాటీ టైంని ఫిక్స్ చేయడం వల్ల కాన్ట్సిపేషన్ నివారించవచ్చు.

English summary

How To Cure Constipation In Babies

How To Cure Constipation In Babies. If your 3 year old baby shows any symptoms of constipation, you may need to take some quick measures like offering more fluids and fibre.
Story first published: Monday, December 12, 2016, 9:55 [IST]
Desktop Bottom Promotion