For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

|

వేసవి వచ్చిందంటే ఇక పిల్లలకు ఆటలే ఆటలు. తోటి పిల్లలతో ఆటలలో పడి ఆకలి, దాహం అన్నీ మర్చిపోతారు. ఎండ వేడిమిని పెద్దగా పట్టించుకోరు. ఇటువంటప్పుడే వారు డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది.పిల్లలు వేసవిలో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తరచూ అనారోగ్యం పాలవుతారు.

బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం, తద్వారా పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఎక్కువ చెమటతో వంట్లో నీరు వేగంగా ఆవిరైపోవడం.. ఇవి వడదెబ్బకు దారితీస్తాయి. ఇంట్లో ఉండే చిన్నపిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

 పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

పెద్దవాళ్లు పిల్లలకు ఎండేముంటుందిలే అని నిర్లక్ష్యం చేయడం అనర్ధానికి దారి తీస్తుంది. ఎండ తీవ్రత పెరిగే సమయానికి పిల్లలు ఇంటి వద్దే ఉండేలా చూడాలి.

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

రెండు పూటలా స్నానం చేయించి చెమటను పీల్చే తెల్లని లేదా లేత రంగు నూలు దుస్తులు వేయాలి.

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

ఇంటి వద్ద ఎండ, వేడి గాలి తగలని చల్లని ప్రదేశంలో నిద్రపోవడం లేదా ఆడుకునేలా చూడాలి.

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

ఈ కాలంలో పిల్లలు తినడానికి ఇష్టపడరు. చల్లని పానీయాలు తాగేందుకే మొగ్గు చూపుతారు. ఉదయం ఎండ తీవ్రం కాక ముందే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తిచేసేలా చూడాలి. బేకరీ పదార్థాలు కాకుండా ఇంటి వద్ద తయారుచేసిన ఆహారాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలి. దీనిలో నూనెలు లేకుండా ఉంటే మంచిది. దీనితోపాటు రాగి, సజ్జలు, తదితర తృణధాన్యాల జావను మజ్జిగలో లేదంటే పాలలో కలిపి ఇస్తే పిల్లలు డీ హైడ్రేషన్‌కు గురికారు.

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

ఈ కాలంలో పిల్లలు ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల ఏర్పడే పోషకాల లోటును ఇవి భర్తీ చేస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత కొద్ది సమయానికి నిమ్మకాయ రసం, లేదా ఖర్జూర కాయలు పిల్లలకు ఇస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతో మధ్యాహ్న భోజనం చేయడానికి పిల్లలు అయిష్టత చూపరు.

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

మధ్యాహ్న భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని పిల్లలకు అందించాలి. ఈ కాలంలో పిల్లలు అన్నం తక్కువ తిని చిరుతిళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. శీతల పానీయాలు తాగాలని అల్లరి చేస్తారు. పంచదార కలిపిన జ్యూస్‌లు, కంపెనీ కూల్‌ డ్రింక్‌లు, ఐస్‌క్రీంలు పిల్లలకు ఇవ్వడం వల్ల డీ హైడ్రేషన్‌ ప్రభావం పెరుగుతుంది.

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

ఆహారంలోనూ, చిరుతిళ్లలోనూ పాలకూర, ఉల్లి, ముల్లంగి, బీట్‌ రూట్‌, అనాస, మామిడి, కర్బూజా, పుచ్చకాయ, కీర దోసకాయ, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం ఉండేలా చూడాలి. ఉప్పు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను పిల్లలకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

పిల్లల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు...

చెమట రూపంలో శరీరం కోల్పోయిన లవణాల్ని అందించడానికి మాత్రం మజ్జిగ, నిమ్మ రసం ద్వారా పిల్లల శరీరానికి ఉప్పు అందేలా చూడాలి.

English summary

Tips for keeping your kids safe this summer

It’s summertime, which means it’s time for parents to think about safety — only safety. It's summer time! For children, it is just the start of an exciting summer vacation. They tend to spend more time and energy outdoors, ignoring their health and safety. Though parents want their kids to make the most of their holidays, they are always concerned about their child's safety and health.
Story first published: Friday, April 15, 2016, 18:43 [IST]
Desktop Bottom Promotion