Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్..
చిన్నప్పటి నుంచే పిల్లల్లో కాన్ఫిడెన్స్ మెరుగుపరచాలి. పిల్లలకైనా, పెద్దవాళ్లకైనా ఏ పని చేసేటప్పుడైనా కాన్ఫిడెన్స్ ఉంటేనే అందులో సక్సెస్ అవుతారు. కాబట్టి చదువులోనైనా, పనిలోనైనా, ఎందులో అయినా.. సక్సెస్ అవ్వాలంటే.. కాన్ఫిడెన్స్ చాలా అవసరం. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ల ఎబిలిటీ గురించి కాన్ఫిడెన్స్ పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
వాళ్లలో ఉన్న టాలెంట్, వాళ్ల ఆసక్తికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. అందులో సక్సెస్ అవడానికి సరైన ప్రోత్సాహం చాలా అవసరం. దాంతో పాటు వాళ్లు ఆ పని చేయగలరు, అందులో అనుకున్నది సాధించగలరు అన్న కాన్ఫిడెన్స్ రావాలి అంటే.. తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం. కాబట్టి పిల్లల్లో కాన్ఫిడెన్స్ మెరుగుపరిచే.. సింపుల్ టిప్స్ ఏంటో చూడండి..

ఆత్మగౌరవం
కొన్ని సందర్భాల్లో పిల్లలు ఆత్మ గౌరవం కోల్పోతారు. అలాంటప్పుడు వాళ్లలో ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందో గుర్తించాలి. అప్పుడే.. వాళ్ల సమస్య అర్థమవుతుంది. దానికి సరైన పరిష్కారం సూచిస్తారు. పిల్లలు ఎప్పుడైతే.. ఆత్మ గౌరవంపై అనుమానం చూపించారో.. అప్పుడు వాళ్లలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం చాలా అవసరం.

అపనమ్మకాలు గుర్తించడం
వాళ్ల గురించి వాళ్లకు ఉన్న అభిప్రాయాలను, భయాలను మార్చేలా చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు కొంతమంది పిల్లలు తమకు మ్యాథ్స్ అంటే భయం అని అంటుంటారు. అలా తరచుగా చెబుతూ ఉంటే.. తనను ప్రోత్సహించాలి. మంచి స్టూడెంట్ అని, ఇంకాస్త టైం ఆ సబ్జెక్ట్ కోసం కేటాయిస్తే.. ఈ సారి మంచి మార్కులు స్కోర్ చేస్తావని ఎంకరేజ్ చేయాలి.

పోల్చడం
ముఖ్యంగా తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు ఇతరులతో పోల్చడం, లేదా అన్నదమ్ములతో పోల్చడం. ఇలా చేయడం వల్ల వాళ్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతింటాయి. కాబట్టి.. ఇతరులతో పోల్చడం మానేయండి.

పొగడటం
మన పిల్లలను కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ముందు పొగడటం వల్ల వాళ్లలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ఏదైనా సాధించినప్పుడు కంపల్సరీ నలుగురిలో పొగడాలి. అప్పుడు దాన్ని వాళ్లు ప్రోత్సాహంగా తీసుకుని మరిన్ని విజయాలు కాన్ఫిడెన్స్ తో సాధిస్తారు.

ప్రేమించడం
వాళ్లు ఏదైనా తప్పు చేసినా.. ప్రేమగా మాట్లాడటం, నెమ్మదిగా మందలించడం, మరోసారి ఇలాంటి మిస్టేక్ చేయకూడదని చెప్పడం వల్ల వాళ్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

సక్సెస్
సైక్లింగ్ నేర్చుకోవడంలో సక్సెస్ అయినప్పుడు, ఎగ్జామ్ లో మంచి స్కోర్ సంపాదించినప్పుడు పిల్లలను అప్రిసియేట్ చేయాలి. దీనివల్ల వాళ్లలో ఉత్సాహం రెట్టించి.. మరింత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి.. ఈ సారి ఇంకా ఎక్కువ మార్కులు సంపాదిస్తారు.

రోల్ మోడల్
బిడియం ఫీలవడం, నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడటం, చాలెంజెస్ తీసుకోవడానికి భయపడటం వంటి లక్షణాలు మీరు కలిగి ఉంటే.. మీ పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు. మనం ఏది నేర్పితే.. అదే ఫలితం దక్కుతుంది అన్నట్టు. తల్లిదండ్రులు కాన్ఫిడెంట్ గా ఉంటేనే.. వాళ్లు మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకుంటారు. కాబట్టి మీ పిల్లల్లో కాన్ఫిడెన్స్ తీసుకురావాలంటే.. మీలో కూడా మార్పులు రావాలి.



Click it and Unblock the Notifications