For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిళ్లు పిల్లలను నిద్రపుచ్చేందుకు సరైన మార్గాలు

మీ పిల్లలు నిద్రపుచ్చేందుకు సంబంధించిన సమస్యల నుండి మీరు బాధపడుతున్నట్లయితే, రాత్రి వేళ్లలో మీ పిల్లలను నిద్రపోయేలా చేయడానికి ఇక్కడ సూచించిన సులభమైన చిట్కాలను అనుసరించండి. ఇది నిజంగా మీకు చాలా సహాయకార

|

రాత్రిళ్లు మీ పిల్లలను నిద్రింప చేయడానికి ఉన్న మార్గాలు,

పేరెంటింగ్ అనేది ఒక కళ, పేరెంటింగ్ గురించి ప్రతిదీ తెలుసుకోవడానికి చాలామంది తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి, వారి పిల్లలను వృద్ధిలోనికి తీసుకురావడానికి - తల్లిదండ్రులకు ఉన్న జ్ఞానం సరిపోదు. పిల్లలపట్ల వ్యవహరించే తీరు మొదటిసారి గాని అయితే, ఆ తల్లిదండ్రులకు మరింత కష్టంగా వుంటుంది. ఈ వ్యాసంలో, రాత్రిళ్లు మీ పిల్లలు బాగా నిద్రపోయేలా చేయటానికి అనుసరించవలసిన కొన్ని చిట్కాలను గూర్చి నేర్చుకుందాము.

రాత్రి వేళ్లలో మీ పిల్లలను నిద్రపోయేలా చెయ్యడం చాలా కష్టమైన పని అని చాలామంది తల్లిదండ్రులు తెలియదు. వారు తెలుసుకోవలసిన చాలా కష్టమైన విషయాల్లో ఇది ఒకటి. పిల్లలు వారి తల్లిదండ్రుల మాటలను వింటూ (లేదా) వివిధ పత్రికలు మరియు పుస్తకాలను చదవడం వల్ల గానీ మరియు అనుసరించడం ద్వారా కొన్ని విషయాలను నేర్చుకున్నప్పటికీ, వారి వ్యక్తిగత అనుభవం వల్ల వచ్చిన చాలా పెద్ద తేడాను కలిగి ఉందని చివరిలో తెలుసుకుంటారు.

మీ పిల్లలు నిద్రపుచ్చేందుకు సంబంధించిన సమస్యల నుండి మీరు బాధపడుతున్నట్లయితే, రాత్రి వేళ్లలో మీ పిల్లలను నిద్రపోయేలా చేయడానికి ఇక్కడ సూచించిన సులభమైన చిట్కాలను అనుసరించండి. ఇది నిజంగా మీకు చాలా సహాయకారిగా ఉంటుంది!

ఆహారం మీద శ్రద్ధ వహించండి :

ఆహారం మీద శ్రద్ధ వహించండి :

మీ పిల్లల నిద్ర విషయంలో - ఆహారం (డైట్) అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నిద్ర సమస్యలను కలిగి ఉన్న పిల్లలకు రాత్రివేళల్లో ఎక్కువ ఆహారాన్ని పెట్టకూడదు. పిల్లలు రాత్రి సమయంలో బాగా నిద్రపోవాలి అనుకుంటే, మీ పిల్లలు నిద్రపోయే ముందు "కెఫిన్" ను కలిగివున్న ఆహార పదార్థాలను తినకుండా నిరోధించడం అనేది ఉత్తమమైన చిట్కాలలో ఒకటి.

ఒకే సమయంలో నిద్రపోవడాన్ని అలవాటుగా చేయండి :

ఒకే సమయంలో నిద్రపోవడాన్ని అలవాటుగా చేయండి :

రాత్రివేళల్లో మీ పిల్లలను నిద్రావస్థ చేయడానికి ఉన్న ముఖ్యమైన మార్గాల్లో ఇది ఒకటి. ఎప్పుడూ ఒకే సమయంలో నిద్రించడం వల్ల, పిల్లల్లో ఒక స్థిరమైన సమయానికి నిద్రపోయే అలవాటును అభివృద్ధి చెందేందుకు సహాయపడుతుంది. ఈ అలవాటు మీ పిల్లలు ఎదుగుదలలో ఉన్నప్పటికీ కూడా గొప్పగా నిద్రించడానికి సహాయపడుతుంది.

బాగా నిద్రించేందుకు, ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించండి :

బాగా నిద్రించేందుకు, ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించండి :

మంచం ఎక్కే ముందు - అసాధారణమైన పనులను చేసే అలవాటును మీ పిల్లల్లో పెంపొందించవద్దు. దానికి బదులుగా, పిల్లల మనసుకు శాంతిని చేకూర్చేలా ఉండే, శాంతియుతమైన వాతావరణంలో నిద్రపోయేలా వారికి సహాయపడండి. ప్రారంభ దశల్లో, మీ పిల్లలకు నిద్రపట్టడానికి మీరు లాలిపాటలను పాడే ఉంటారు.

సౌకర్యవంతమైన నిద్రను నిర్ధారించుకోండి :

సౌకర్యవంతమైన నిద్రను నిర్ధారించుకోండి :

బహుశా ఇది, రాత్రిపూట మీ పిల్లలు బాగా నిద్రపోయేలా చేయడానికి ఉన్న అన్ని చిట్కాలలో ఇది చాలా ముఖ్యమైనది. మీ పిల్లలు శారీరకంగా మరియు మానసికంగానూ చాలా సున్నితమైన వారిగా ఉంటారు. కాబట్టి, మీరు పిల్లల శరీరానికి సౌకర్యవంతమైన ఒక మంచమును ఏర్పాటు చెయ్యవలసిన అవసరం ఎంతైనా వుంది. సంప్రదాయబద్ధంగా మీ పిల్లలు నిద్రించేందుకు అవసరమయ్యే "టెడ్డిబేర్" వంటి బొమ్మలను అనుమతించాలి. ఇది మంచి నిద్రావస్థను పొందటానికి మరియు మీ తోడు లేకపోయినా ఒంటరిగా పడుకోవడానికి సహాయపడుతుంది.

పిల్లలు పడుకున్నప్పుడు కూడా మీరు వారి చుట్టూనే వుండండి :

పిల్లలు పడుకున్నప్పుడు కూడా మీరు వారి చుట్టూనే వుండండి :

దాదాపు పిల్లలందరూ నిద్రలో తమ తల్లిదండ్రులని కూడా చూసే అలవాటును కలిగివుంటారు. మీ పిల్లల దగ్గర నుండి అసాధారణమైన విషయాలను దేనినీ ఆశించవద్దు. పిల్లలు నిద్రిస్తున్నప్పుడు వారికి మీరు చాలా దగ్గరగా ఉండాలి దేనికోసమంటే, రాత్రి సమయంలో వారికి ఎదురయ్యే అవసరాలను తీర్చడం కోసం మీరు హాజరుకావలసి ఉండవచ్చు.

గది యొక్క ఉష్ణోగ్రతను పరిశీలించండి :

గది యొక్క ఉష్ణోగ్రతను పరిశీలించండి :

మీ పిల్లలు రాత్రిపూట సౌకర్యవంతంగా గదిలో నిద్రపోయేటప్పుడు, ఆ గది యొక్క ఉష్ణోగ్రతను చల్లగా (లేదా) వెచ్చగా మార్చడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే అది మీ పిల్లల నిద్రకు భంగం కలిగించవచ్చు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద మీ పిల్లలను నిద్రపోయేటట్లుగా చేసే ఉత్తమ మార్గాలలో ఒకటని భావించండి.

బహుమతులు ఇవ్వండి :

బహుమతులు ఇవ్వండి :

రాత్రిపూట పిల్లల చక్కగా నిద్రపోవటానికి సహకరించే వాటిలో, ఇది అత్యంత ప్రభావవంతమైన చిట్కాలలో ఒకటి. మీ పిల్లలు ప్రతిరోజూ నిర్ధేశించిన సమయానికి నిద్ర చేయగలిగితే బహుమతులను ఇవ్వండి.

తిట్టకూడదు (లేదా) కొట్టకూడదు :

తిట్టకూడదు (లేదా) కొట్టకూడదు :

తిట్టడం మరియు కొట్టడం వంటివి, మీ పిల్లలను దెబ్బతీసే హానికరమైన చర్య కావచ్చు. అలాంటి ఆందోళనలు మీ పిల్లలను శాంతియుతంగా నిద్రపో నియ్యకుండా ఆపగలవు.

పైన వివరించిన చిట్కాలను తల్లిదండ్రులు ప్రయోగాత్మకంగా వారి పిల్లల మీద అప్లై చేసి వచ్చిన ఫలితాలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మీ వంతు సమయం వచ్చింది, ఇక ఆలస్యమెందుకు మీ పిల్లల పైన ఈ చిట్కాలను ప్రయోగించి మంచి ఫలితాలను పొందండి. గుర్తుంచుకోండి, మీ పిల్లలకు రోజువారీగా మంచి నిద్ర అనేది చాలా అవసరం, లేకపోతే పెరుగుదలలో చాలా రకాల సమస్యలకు కారణం కావచ్చు.

English summary

Tips To Make Child Sleep In Night | Ways To Make Your Child Sleep In The Night | How To Make Child Sleep In Night | Making Youe Child Sleep In Night

For a working mom, of all the difficult tasks that she faces through the day, the toughest one is putting her child to sleep. But we have a solution for that. Start following these simple ways and trust us, your child will surely sleep in the night.
Story first published:Saturday, December 16, 2017, 15:48 [IST]
Desktop Bottom Promotion