For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓబేసిటి లేదా ఊబకాయంతో ఉన్న పిల్లలను డీల్ చేయడం ఎలా

చిన్న పిల్లల్లో బరువును తెలుసుకోవడం కానీ, లేదా వారి బరువును అంచనావేయడం కానీ చేయలేము. ఎందుకంటే చిన్న పిల్లలు రోజురోజుకు బరువు, పొడవు పెరగడం వల్ల వారు అధిక బరువుకు గురౌతున్నారా లేదా అన్న విషయం కేవలం స్ప

By Lekhaka
|

జంక్ ఫుడ్ అంటే మనందరికీ ఇష్టమే. పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే పిల్లలకు కూడా పెద్దలు తినే జంక్ ఫుడ్స్ నే అంది్తుంటారు. అయితే ఇలా చిన్న పిల్లలు హైవాల్యూ జంక్ ఫుడ్ తినడం వల్ల 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 5ఏళ్ళ నుండి 17ఏళ్ళలోపు 268 మిలియన్ల పిల్లలు ఉంటారని, పరిశోధనల ద్వారా అంచనా వేస్తున్నారు. ఇది చాల పెద్ద సంఖ్య అనే చెప్పవచ్చు..?

ఇలా ఓవర్ వెయిట్ పెరగడాన్ని 'ఓబేసిటి' అని పిలుస్తారు. 2010లో 76మిలియన్లో ఉంటే 2025నాటికి 91 ఉంటారని, పీడియాట్రిక్ ఓబేసిటి జనరల్ వారి పరిశోధనల్లో వెల్లడి చేశారు . అలాగే 2025 నాటి 12 మిలియన్ల పిల్లల్లో గ్లూకోజ్ టాలరెన్స్ కూడా ఉంటుందని, 4 మిలియన్ల పిల్లలు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతారని, 27మిలియన్ల పిల్లల్లో హైపర్ టెన్షన్ , 38 మిలియన్ల పిల్లల్లో లివర్లో ఫ్యాట్ పెరుగుతుందని వారి పరిశోధనల్లో ఒక అంచనా ప్రకారం వివరించారు.

అంతే కాదు,వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చిన్న పిలల్లు, కౌమరదశలో, పెద్దవారిలో జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలను గుర్తించారు.ఇలా పిల్లల్లో అధికబరువు కారణాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తక్కువగా ఉండటం వల్ల చిన్న వయస్సులోనే ఊబకాయగ్రస్తులుగా మారుతున్నారు . కాబట్టి, చిన్న వయస్సులోనే పిల్లల జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి.

చిన్న పిల్లల్లో బరువును తెలుసుకోవడం కానీ, లేదా వారి బరువును అంచనావేయడం కానీ చేయలేము. ఎందుకంటే చిన్న పిల్లలు రోజురోజుకు బరువు, పొడవు పెరగడం వల్ల వారు అధిక బరువుకు గురౌతున్నారా లేదా అన్న విషయం కేవలం స్పెషలిస్ట్ లు మాత్రమే తెలుసుకోగలుగుతారు. పిల్లలు పొడవును బట్టి, బరువు అంచాన వేస్తారు, అలాగే చిన్న వయస్సు నుండి ఎత్తు పొడవులో మార్పులను తెలుసుకుంటారు.

ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా పెట్టాలి :

ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా పెట్టాలి :

పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడానికి అలవాటు చేయాలి. అత్యధిక న్యూట్రీషియన్స్ ను అందించే, నేచురల్ గా ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని ఉత్సాహపరచాలి.

ఆహారాల్లోని న్యూట్రీషియన్స్ మీద అవగాహన :

ఆహారాల్లోని న్యూట్రీషియన్స్ మీద అవగాహన :

పిల్లల్లో న్యూట్రీషియన్ మీద ఎక్కువ అవగాహన కల్పించడం వల్లో యంగ్ ఏజ్ లో ఆహారాల మీద అవగాహనతో ఆరోగ్యపరమైనవి ఎంపిక చేసుకోవడానికి , జీవనశైలి ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది

జంక్ ఫుడ్స్ కు దూరంగా పెట్టాలి :

జంక్ ఫుడ్స్ కు దూరంగా పెట్టాలి :

జంక్ ఫుడ్ తినేటప్పుడు డిస్కరేజ్ చేయాలి. వాటిగురించి కలిగే హాని వివరించి, హోం మేడ్ స్నాక్స్ , మీల్స్ ను అలవాటు చేయాలి. స్కూల్ కూడా అవే ఇచ్చి పంపాలి. ప్యాకేజ్ చేసి, ఇన్ స్టాంట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. సమయంతో పాటు పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. సందర్భాన్ని, లేదా సమయాన్ని బట్టి అందివ్వొచ్చు.

ఆహారపు అలవాట్లలో మార్పులు :

ఆహారపు అలవాట్లలో మార్పులు :

ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలకు బరువు తగ్గడానికి సహాయపడాలి. ఇంటిల్లి పాది ఎలాంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు, వారికి నేర్పించాలి, పెద్దలతో పాటు, పిల్లలకు ఒకే విధమైన ఆహారాలను అందివ్వడం వల్ల అందురూ ఒకే రకమైఆరోగ్యాన్ని కలిగి ఉంటారు.

ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్ తగ్గించాలి :

ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్ తగ్గించాలి :

పిల్లలకు నచ్చిన ఇంటి ఫుడ్డే వివిధ రకాలుగా వండి పెట్టాలి. అలాగే డిప్రెస్డ్ ఈటర్స్ లో ఆహారాలను ఎక్కువగా తీసుకోకుండా కట్టడి చేయాలి.

భోజనం చేసే సమయంలో టీవి ఆఫ్ చేయాలి :

భోజనం చేసే సమయంలో టీవి ఆఫ్ చేయాలి :

టీవీ చూస్తూ భోజనం చేయకుండా కంట్రోల్ చేయాలి. అందుకే పిల్లలు వారు ఎంత తింటున్నారో తెలియకుండా ఎక్కువ ఆహారాలను తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతున్నారు.

ఫిజికల్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించాలి :

ఫిజికల్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించాలి :

అలాగే పిల్లలు, చదవులు, ఇంట్లోనే లాంగ్ సిట్టింగ్ కు పరిమితం చేయకుండా ఫిజికల్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించాలి. ఇవి వారిలో క్యాలరీలను బర్న్ చేస్తాయి , ఆకలి పెంచి హెల్తీ ఫుడ్స్ ను తినడానికి ప్రోత్సహిస్తాయి.

కిచెన్ లో వారిని కూడా ఇన్ వాల్వ్ చేయాలి :

కిచెన్ లో వారిని కూడా ఇన్ వాల్వ్ చేయాలి :

ఇంట్లో ఆహారాలను వండే సమయంలో పిల్లలను కూడా ఇన్ వాల్వ్ చేయాలి. ఇలా పిల్లలతో కలిసి చేయడం వల్ల వారి ఆహారాల గురించి, వాటిలోని పోషక విలువల గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

షేరింగ్ :

షేరింగ్ :

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారితోటి ఫ్రెండ్స్ కు షేర్ చేయడం ఎక్కువగా గమనిస్తుంటారు. సాధ్యమైతే వారి ఆహారపు అలవాట్లు కూడా మార్చగలిగితే, న్యూట్రీసియన్ మీద ఎక్కువ అవగాహన కల్పిస్తే ఆహారాల పట్ల ఎక్కువ ఇష్టపడుతారు.

గెట్ టు గెదర్ తో అభిరుచులు, అలవాట్లు :

గెట్ టు గెదర్ తో అభిరుచులు, అలవాట్లు :

కుటుంబ సభ్యులు అందరూ అప్పుడప్పుడు కలవడం, హెల్తీగా వంటలు చేసుకోవడం, పిల్లలకు నేర్పడం, మంచి ఆహారాలను అందివ్వడం వల్ల పిల్లల్లో మంచి అభిప్రాయం, అభిరుచులు, అలవాట్లు ఏర్పడుతాయి.

English summary

How To Deal With Overweight / Obese Children

As we continue to love junk food and also encourage our children to eat them in the same volume, researchers have rung the warning bell saying some 268 million children aged between five and seventeen may turn overweight across the globe by 2025.
Desktop Bottom Promotion