For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ పిల్లలను హగ్ చేసుకోవడం వల్ల వారు పొందే అమేజింగ్ బెనిఫిట్స్

పిల్లలకు తల్లిదండ్రులు ఆప్యాయంగా ఇచ్చే ఒక కౌగలింత చిన్నారుల్లో ఒక చక్కటి ద్రుడమైన అనుబంధం ఏర్పడటంతో పాటు, వారిని నిత్యం సంతోషంగా ఉండేలా చూసుకోవచ్చు.

|

సహజంగా ఇంట్లో చిన్న పిల్లలుంటే ..వారు ఎప్పుడూ ఆరోగ్యంగా..ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా తిరగానలే తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తుంటారు. అనునిత్యం వారిని ప్రమేగా చూసుకోవడం, వారి ఎదుగుదల బాంగుడాలని క్రమం తప్పకుండా పోషకాహారం అందివ్వడం వంటివి సహజం. అయితే వీటితో పాటు చిన్నారులను మానసికంగా..శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేలా చేసేదేంటో తెలుసా..? తల్లిదండ్రుల నుండి ఒక చిన్న హగ్ (కౌగిలింత).

పిల్లలకు తల్లిదండ్రులు ఆప్యాయంగా ఇచ్చే ఒక కౌగలింత చిన్నారుల్లో ఒక చక్కటి ద్రుడమైన అనుబంధం ఏర్పడటంతో పాటు, వారిని నిత్యం సంతోషంగా ఉండేలా చూసుకోవచ్చు. ఫలితంగా వారు అన్ని రకాలుగా ఆరోగ్యంగా తయారవుతారు. ఈ విషయాన్ని కొన్ని పరిశోధనలు సైతం స్పష్టం చేస్తున్నాయి. మరి, చిన్నారులను కౌగిలించుకోవడం ద్వార వారిలో కలిగే మార్పుల గురించి తెలుసుకుందాం..

ఎన్ని సార్లు హగ్ చేసుకోవాలి:

ఎన్ని సార్లు హగ్ చేసుకోవాలి:

రక్తం పంచుకుని పట్టిన బిడ్డల కోసం ఏమైనా చేసే తల్లిదండ్రులున్నప్పుడు, రోజులో వారిని కొన్ని సార్లు కౌగిలించుకోలేరా? అది కూడా వారి ఎదుగుదల సక్రమంగా ఉంటుందంటే ఖచ్ఛితంగా చేస్తాం. కానీ రోజుకి ఎన్నిసార్లు చిన్నారులను హాగ్ చేసుకోవాలి?

ఒక రోజులో ఎన్నిసార్లైనా చిన్నపిల్లలను హగ్ చేసుకోవచ్చు

ఒక రోజులో ఎన్నిసార్లైనా చిన్నపిల్లలను హగ్ చేసుకోవచ్చు

ఒక రోజులో ఎన్నిసార్లైనా చిన్నపిల్లలను హగ్ చేసుకోవచ్చు, అయితే మానసిక నిపుణుల అధ్యయనం ప్రకారం రోజుకి పన్నెండు సార్లైనా చిన్నారులను హగ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల వారిలో

ఇలా చేయడం వల్ల వారిలో

ఇలా చేయడం వల్ల వారిలో మానసిక, శారీరరకంగా వారి ఎదుగుదల బాగండటంతో పాటు ఆరోగ్యంగానూ ఉంటారట.

మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వారిని హత్తుకుంటుండాలి

మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వారిని హత్తుకుంటుండాలి

ఉదయం స్నానం చేయించిన తర్వాత, పడుకునే ముందు ఆకలి తీర్చిన తర్వాత ...ఇలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వారిని హత్తుకుంటుండాలి. ఇలా చేయటం వల్ల వారిలో పెరుగుదలకు సహాయపడే హార్మోన్ సక్రమంగా విడుదలైన ..ఎదుగుదల బాగుండేందుకు తోడ్పడుతుంది.

సంతోషం నింపేస్తుంది:

సంతోషం నింపేస్తుంది:

తల్లి ప్రేమగా దగ్గరకు తీసుకుంటే చాలు ఆ సంతోషం మాటల్లో వర్ణించలేనిది. ఇక చిన్న పిల్లల విషయంలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ వారిని గుండెలకు హత్తుకుంటే చాలు...వారి కళ్లు సంతోషంతో నిండిపోతాయి.

దీనికి కారణమేంటో తెలుసా?

దీనికి కారణమేంటో తెలుసా?

తల్లి కౌగలింతలో ప్రేమ. ఎక్కువ సమయం వారిని గుండెలకు హత్తుకొన్నప్పుడు వారి శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. దీన్ని ‘హ్యాపీ హార్మోన్ ’ అని కూడా పిలుస్తారు. ఎంత బిజీగా ఉన్నా చిన్నారులను కాసేపు హత్తుకోవడం ద్వారా వారిని సంతోషంగా ఉంచేలా చేయవచ్చు. దీనికోసం చిన్నారులను కనీసం 20 సెకన్ల పాటు హాగ్ చేసుకోవాల్సి ఉంటుందని నిపుణుల సూచిస్తున్నారు.

మంచి నిద్ర:

మంచి నిద్ర:

చిన్నారులను నిద్రపోయే సమయం వచ్చేసరికి వారిని గుండెలపై పడుకోబెట్టడం ద్వారా వారికి చక్కగా మంచి నిద్రపడుతుంది. ఇది కూడా వారికి ఒక రకమైన కౌగిలింతే. అప్పటి వరకూ ఆటలతో అలసిపోయిన చిన్నారుల శరీరానికి ఇది రిలాక్సేషన్ థెరఫీలాగా పనిచేస్తుంది. ఫలితంగా వారు వెంటనే నిద్రపోతారు. ఇక ఎప్పుడైనా మీ చిన్నారులు నిద్రపోకుండా మారం చేస్తుంటే ఈ చిట్కాలని పాటించి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది.

అభద్రతా భావం దూరమవుతుంది:

అభద్రతా భావం దూరమవుతుంది:

ప్రస్తుత రోజుల్లో నెలల వయస్సున్న పిల్లల్ని సైతం ఇంట్లో పెద్దల వద్ద లేదా నర్సరీలు, క్రష్ లలో వదిలి కార్యాలయాలకు వెళుతున్నారు. ఇలారోజంతా అమ్మానాన్నలకు దూరంగా సమయం గడపాల్సి రావడం వారిలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. స్కూల్ పిల్లల్లో కూడా చదువులతో బారం పడుతుంది, ఇటువంటి సమయంలో వారికి ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి తగ్గించి, పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఒక చిన్న హగ్ ఇస్తే చాలు వారిలో సంతోషానికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ వారిలో ఒత్తిడిని దూరం చేస్తుంది,

వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది:

వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది:

వివిద కారణాల వల్ల చిన్నారులు కొన్ని సార్లు అనారోగ్యం పాలవుతుంటారు. అలాంటి సందర్భంలో తల్లి కౌగిలే వారికి ధైర్యాన్నిచ్ఛి త్వరగా కోలుకొనేలా చేస్తుంది. దీనికి కారణం ఆక్సిటోసిన్ విడుదల కావడమే. అందుకే ఇటీవలి కాలంలో నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలను తల్లి ఎక్కువ సమయం హత్తుకుని ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

English summary

Reasons Why You Should Hug Your Child Everyday

As a species, we require human touch to survive and thrive. Our skin is the largest organ and physical contact distinguishes us from other animals. For young babies, the role of affectionate touch is even more important as it has a direct impact on their physical and psychological development.
Desktop Bottom Promotion