For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మార్ట్ ఫోన్ పిచ్చితో పిల్లలను నిర్లక్ష్యం!

By Mallikarjuna
|

ఈ మద్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఎంతగా అంటే భోజనం చేసే సయంలో, ఆటలాడే సమయంలో, సాధారణ కార్యకలాపాలు లేదా సంభాషణల సమయంలో స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతుంటారు? ఇందులో మీరు కూడా ఒకరైతే ఖచ్చితంగా ఇది మీ పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఈ మద్యనే జరిపిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం టెక్నాలజీ నార్మల్ లేదా తక్కువగా ఉన్నా అది పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు తీసుకొస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ ను పిల్లలు ఎక్కువగా ఉపయోగించడంలో పిల్లల్లో సున్నితత్వం, హాట్ టెంపర్, హైపర్ యాక్టివ్, వైనింగ్ లక్షణాలు కనబడుతాయి.

స్మార్ట్ ఫోన్ పిచ్చితో పిల్లలను నిర్లక్ష్యం!

డేంజర్ : స్మార్ట్ ఫోన్ లైట్ బ్రెయిన్ & బాడీ మీద ఎలాంటి దుష్ప్రభావం చూపుతుంది!డేంజర్ : స్మార్ట్ ఫోన్ లైట్ బ్రెయిన్ & బాడీ మీద ఎలాంటి దుష్ప్రభావం చూపుతుంది!

రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో డిజిటల్ టెక్నాలజీ వల్ల తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్స్ కు బాగా అలవాటు పడటం వల్ల తల్లిదండ్రులకు, పిల్లలకు మద్య సంబంధ బాంధవ్యాలు దూరం అవుతున్నాయని పరిశోధనల్లో సాక్ష్యాలతో నిరూపించబడ్డాయని ఇలియస్లోని ఇల్లినాయిస్ స్టేట్ యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాండన్ టి.ఎంసి మక్ డానియల్ చెప్పారు.

ఎప్పుడైతే తల్లిదండ్రులు మొబైల్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తారో, అప్పుడు వారు పిల్లల మీద చూపించే ప్రేమ, వారిచ్చే సమాధానాల వల్ల, వారు చూసుకునే విధానం, ప్రవర్తన వల్ల పిల్లల్లో మార్పులు వస్తాయి.

<br>మీ స్మార్ట్ ఫోన్స్ 10 విధాలుగా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది
మీ స్మార్ట్ ఫోన్స్ 10 విధాలుగా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది

తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే సమయంలో పిల్లలను దగ్గర ఉంచుకోవడం వల్ల స్మార్ట్ ఫోన్స్ ఆపరేట్ చేసే విధానం, ఫోన్ లోని విషయాలను, సమాచారాన్ని ఏకాగ్రతతో చూడటం, సమాచారంను గుర్తుపెట్టుకోవడం, వాటి మీద ఎక్కువగా ఆకర్షితులవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో పిల్లల దృష్టిని మరలించడం చాలా కష్టం అవుతుంది. పిల్లల సామాజిక, భావోద్వేగ సమాచారంతో అన్ని విషయాల పట్ల ఆకర్షితులవుతారు. కాబట్టి, ఈ విషయంలో సమర్థవంతంగా నిర్వహించాలని, సి.యస్. మోట్ చిల్డ్రన్స్ హాస్పిటల్లోని చైల్డ్ బిహేవియర్ ఎక్స్ పర్ట్ జెన్నీ రాడేస్కీ సూచిస్తున్నారు.

ఇంకా పరిశోధనల ప్రకారం జర్నల్ చైల్డ్ డెవెలప్మెంట్లో ప్రచురించిన అధ్యయంలో దాదాపు 170 ఫామిలిలోని తల్లి, దండ్రులను విడివిడిగా కూర్చోబెట్టి పరిశోధనలు జరిపారు.

ఇందులో దాదాపు 48 శాతం మంది తల్లిదండ్రులు మూడు లేదా అంతకంటే ఎక్కు సార్లు స్మార్ట్ ఫోన్స్ వల్ల అంతరాయం కలుగుతుందంటే, 17 శాతం మంది ఒక్కసారి అని మరియు 24శాతం మంది రోజుకు ఒక్క సారి అంతరాయం కలుగుతుందని, 11 శాతం మాత్రం స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని సర్వేలో వెల్లడి చేశారు.


రోజులో కొన్ని సార్లు, ప్రదేశాలను బట్టి, ఫ్రీగా ఉన్న సమయంలో ఉదా:భోజన సమయంలో, ఆటలాడే సమయం, వర్క్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల ఫ్యామిలీ టెన్షన్స్ మర్చిపోవడానికి ఈ మోడ్రన్ టెక్నాలజీతో బయట ప్రపంచం చూడటానికి తల్లిదండ్రులకు సహాయపడుతోందని అన్నట్లు పరిశోధకులు చెప్పారు.


ప్రస్తుతం వస్తున్న వివిధ రకాల స్మార్ట్ ఫోన్స్ లో కొత్తగా వస్తున్న వివిధ రకాల సెట్టింగ్స్ మరియు మొబైల్లోని ఇతర టక్నాలజీ వల్ల తల్లిదండ్రులు వారి పిల్లలతో గడపే సమయాన్ని తక్కువ చేస్తోందని, నిపుణులు, పరిశోధకులు మెక్డనీయల్ పేర్కొన్నారు.

With Inputs From IANS

English summary

Smartphone Obsession And Kids

Do you spend too much time on your smartphone during mealtime, playtime and routine activities or conversations with your kids? If so, it may lead to behavioural issues in your children, warned researchers.
Story first published:Thursday, July 6, 2017, 17:31 [IST]
Desktop Bottom Promotion