Just In
- 41 min ago శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- 1 hr ago శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- 3 hrs ago Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- 5 hrs ago సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
రోజుకో గుడ్డు పిల్లల్లో ఎదుగుదలను వేగంగా పెంచుతుంది
రోజుకో గుడ్డు పిల్లల్లో ఎదుగుదలను వేగంగా పెంచుతుంది
రోజుకో గుడ్డు తినటం వలన ఎదుగుదలలో స్పష్టమైన మార్పు కన్పించి చిన్నపిల్లల్లో 47 శాతం ఎత్తు పెరిగే వేగం తగ్గకుండా ఉంటుందని ఒక అధ్యయనంలో కనుగొన్నారు.
సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ముఖ్య పరిశోధకుడు లోరా లన్నోటి మాట్లాడుతూ “గుడ్లు చవకైనవి, సులభంగా అందరికీ దొరుకుతాయి. ఇది ఎదగటానికి కావాల్సిన పోషకాలు అందించే మంచి వనరు అలాగే పిల్లల్లో అభివృద్ధి కన్పడేలా చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల వేగం తగ్గిపోయే సమస్యను నివారించటంలో సాయపడుతుంది.” అని అన్నారు.
రోజుకో
గుడ్డు
పిల్లల్లో
ఎదుగుదలను
వేగంగా
పెంచుతుంది.
జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం, ఎవరైతే రోజుకో గుడ్డు తిన్నారో వారిలో ఎదిగే వేగం మందగించటం 47 శాతం, బరువు తక్కువగా ఉండే సమస్య 74 శాతం తగ్గిందని తెలిపింది.
లన్నోటి మాట్లాడుతూ, “ఈ ఒక్క విషయం ఎంత మార్పును తెస్తుందోనన్నది చూసి మేము ఆశ్చర్యపోయాం. ఈ ప్రభావం ఎంత పెద్దదంటే ప్రపంచవ్యాప్త సగటు 0.39 తో పోలిస్తే ఇది 0.63గా ఉంది.” అని తెలిపారు.
ఈ అధ్యయనం కోసం, టీం ఆరు నుంచి తొమ్మిది నెలల వయసున్న పిల్లలకి ఆరునెలల సమయంపాటు రోజుకో గుడ్డు ఇవ్వాలని నిర్ణయిస్తే, పోల్చడానికి నియంత్రణ గ్రూప్ కి ఏ గుడ్లు ఇవ్వలేదు.
గుడ్లు
ఒక
సంపూర్ణ
ఆహారం,
ఇతర
పదార్థాలతో
పోలిస్తే,
ప్రత్యేకంగా
ఫార్టిఫైడ్
ఫుడ్స్
తో
పోలిస్తే
పేదవారికి
చాలా
సులభంగా
దొరికే,సురక్షితంగా
ప్యాక్
అయ్యే
పదార్థం.”
అని
లన్నోటి
తెలిపారు.
లన్నోటి ఇంకా మాట్లాడుతూ, “ అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలకి గుడ్లను సులభంగా దొరికే, పోషణ దొరికే పదార్థంగా సూచించబడుతోంది.” అని అన్నారు.
ఐఎ ఎన్ ఎస్ కథనాల నుంచి సమకూర్చినది.