For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకో గుడ్డు పిల్లల్లో ఎదుగుదలను వేగంగా పెంచుతుంది

రోజుకో గుడ్డు పిల్లల్లో ఎదుగుదలను వేగంగా పెంచుతుంది

|

రోజుకో గుడ్డు తినటం వలన ఎదుగుదలలో స్పష్టమైన మార్పు కన్పించి చిన్నపిల్లల్లో 47 శాతం ఎత్తు పెరిగే వేగం తగ్గకుండా ఉంటుందని ఒక అధ్యయనంలో కనుగొన్నారు.

సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ముఖ్య పరిశోధకుడు లోరా లన్నోటి మాట్లాడుతూ “గుడ్లు చవకైనవి, సులభంగా అందరికీ దొరుకుతాయి. ఇది ఎదగటానికి కావాల్సిన పోషకాలు అందించే మంచి వనరు అలాగే పిల్లల్లో అభివృద్ధి కన్పడేలా చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల వేగం తగ్గిపోయే సమస్యను నివారించటంలో సాయపడుతుంది.” అని అన్నారు.

రోజుకో గుడ్డు పిల్లల్లో ఎదుగుదలను వేగంగా పెంచుతుంది.

An egg a day may spurt growth in kids

జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం, ఎవరైతే రోజుకో గుడ్డు తిన్నారో వారిలో ఎదిగే వేగం మందగించటం 47 శాతం, బరువు తక్కువగా ఉండే సమస్య 74 శాతం తగ్గిందని తెలిపింది.

లన్నోటి మాట్లాడుతూ, “ఈ ఒక్క విషయం ఎంత మార్పును తెస్తుందోనన్నది చూసి మేము ఆశ్చర్యపోయాం. ఈ ప్రభావం ఎంత పెద్దదంటే ప్రపంచవ్యాప్త సగటు 0.39 తో పోలిస్తే ఇది 0.63గా ఉంది.” అని తెలిపారు.

An egg a day may spurt growth in kids

ఈ అధ్యయనం కోసం, టీం ఆరు నుంచి తొమ్మిది నెలల వయసున్న పిల్లలకి ఆరునెలల సమయంపాటు రోజుకో గుడ్డు ఇవ్వాలని నిర్ణయిస్తే, పోల్చడానికి నియంత్రణ గ్రూప్ కి ఏ గుడ్లు ఇవ్వలేదు.

గుడ్లు ఒక సంపూర్ణ ఆహారం, ఇతర పదార్థాలతో పోలిస్తే, ప్రత్యేకంగా ఫార్టిఫైడ్ ఫుడ్స్ తో పోలిస్తే పేదవారికి చాలా సులభంగా దొరికే,సురక్షితంగా ప్యాక్ అయ్యే పదార్థం.” అని లన్నోటి తెలిపారు.

An egg a day may spurt growth in kids

లన్నోటి ఇంకా మాట్లాడుతూ, “ అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలకి గుడ్లను సులభంగా దొరికే, పోషణ దొరికే పదార్థంగా సూచించబడుతోంది.” అని అన్నారు.

ఐఎ ఎన్ ఎస్ కథనాల నుంచి సమకూర్చినది.

English summary

An egg a day may spurt growth in kids

Eating an egg a day can significantly increase growth and reduce stunting by 47 per cent in young children, finds a study."Eggs can be affordable and easily accessible. It can be a good source of nutrients for growth and development in young children and have the potential to contribute to reduced growth stunting around the world," said lead author Lora Iannotti from the Washington University in St. Louis.
Story first published:Monday, May 28, 2018, 17:39 [IST]
Desktop Bottom Promotion