For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆహారంపై అలర్జీ ఉంటే పిల్లల్ని మానసిక ఆందోళనకి గురిచేస్తుందా?

By Lekhaka
|

మీ బిడ్డ ఆందోళన రుగ్మతతో బాధపడుతున్నాడా? జాగ్రత్తగా ఉండండి, ఒక పరిశోధన ప్రకారం అది ఆహారం పట్ల అలర్జీ వల్ల రావచ్చు.

ఈ పరిశోధన ఫలితాలను బట్టి ఆహారం అలర్జీ వున్న పిల్లల్లో చిన్నపిల్లల ఆందోళన రుగ్మత ఎక్కువ ఉన్నట్లు తేలింది.

పరిశోధకులు ఆహారపు అలర్జీలు ముఖ్యంగా సామాజిక యాంగ్జయిటీ, సమాజంలో తిరస్కరణ,అవమానపు భయాలకు కారణమవుతాయని చెప్పారు.

Child's Anxiety May Be Linked To Food Allergy,

కొలంబియా యూనివర్సిటీ రచయిత రీనీ గుడ్ విన్ మాట్లాడుతూ, “ ప్రాణాంతకమైన వాటితో ఎలా జీవించాలా అన్న ఆలోచన ఆందోళనకి కారణం కావచ్చు, మరియు కొందరు పిల్లలు మిగతావారి కంటే తాము వేరు అన్న భావనతో సోషల్ యాంగ్జయిటీకి గురికావచ్చు. ఇది వారి వయస్సు, ఆహారపు అలర్జీలను పెద్దవారు ఎలా పరిష్కరిస్తున్నారన్నదానిపై ఆధారపడుతుంది.” అని చెప్పారు.
Child's Anxiety May Be Linked To Food Allergy,

జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ లో ప్రచురితమైన అధ్యయనంలో, వారి బృందం 4-12 ఏళ్ళ మధ్య రోగులైన చిన్నపిల్లలను, ఆహారం అలర్జీ ఉన్నవారు, లేనివారుగా మరియు వారిని సంరక్షించే వారి స్థితిని బట్టి విశ్లేషించారు.

Child's Anxiety May Be Linked To Food Allergy,

ఆహారం అలర్జీ ఉన్న పిల్లల్లో, 57 శాతం మంది 48శాతం అలర్జీ లేని పిల్లల కన్నా ఆందోళన ఉన్నట్లు తెలిపారు.

ఆహారపు అలర్జీల లక్షణాలు, చిన్నప్పటి డిప్రెషన్ లక్షణాలతో కానీ, ఆందోళన మరియు సంరక్షకుల డిప్రెషన్ తో కానీ సంబంధం ఉన్నట్టు తెలియలేదు.

ఈ పరిశోధకుడు తర్వాత ఇవే ఫలితాలను కొంచెం పెద్దపిల్లల్లో, యువతలో , డిప్రెషన్ చాలా ఉన్నవారిలో, ఈ ఆహారపు అలర్జీల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో పరీక్షించాలని భావిస్తున్నారు. ఎందుకంటే మొదట్లో ఉండే ఆందోళనే తర్వాత డిప్రెషన్ గా మారవచ్చు.

English summary

Child's Anxiety May Be Linked To Food Allergy

Is your kid suffering from an anxiety disorder? Beware, a food allergy might be the reason, a research has claimed. Here are some facts.
Desktop Bottom Promotion