For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో పక్క తడిపే అలవాటును మాన్పించడానికి హోం రెమెడీస్

|

సాధారణంగా పసిపిల్లలు తరచుగా పక్కతడుపుతుంటారు, దీనిని నాక్టర్నల్ ఎన్యురెసిస్ అని వ్యవహరిస్తుంటారు. ఈ సమస్య పిల్లలు ఒక నిర్ధిష్టమైన వయస్సుకు వచ్చేవరకు కొనసాగుతుంది. అయితే, కొందరు పిల్లలు 6 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా, ఈ అలవాటును కొనసాగిస్తూ ఉంటే అది ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశంగానే ఉంటుంది.

సాధారణంగా ఒక పిల్లవాడు ఏడు సంవత్సరాల వయస్సు వరకు అధికంగా పక్కతడిపే అలవాటును కలిగి ఉంటాడు. ఒకవేళ మీ బిడ్డ ఇంకా ఈ అలవాటును కలిగి ఉంటే, దానికి అనేక కారకాలు కారణాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తక్కువ గది ఉష్ణోగ్రతలు, ప్రామాణికం కన్నా అదనపు ద్రవాలను తీసుకోవడం, నిద్రకు ఉపక్రమించే ముందు అధికంగా ద్రవాలను తీసుకోవడం., వంటి అనేక కారకాల వలన ఈ సమస్య తలెత్తవచ్చు. అయితే, మీ పిల్లవాడు ఆ అలవాటును తిరిగి మరలా కలిగి ఉన్నట్లుగా అనిపిస్తే, ఖచ్చితంగా సమస్యను తగ్గించే దిశగా అడుగులు వేయవలసి ఉంటుంది.

పక్కతడిపే అలవాటుకు గల కారణాలు :

Bedwetting in Children

1. ప్రాధమిక దశ :

మీ బిడ్డ 6, 7 సంవత్సరాల వయసు దాటుతున్నా కూడా, పక్కతడిపే అలవాటును కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంటే, ఇది నిజంగా ఆలోచించవలసిన విషయమే అవుతుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు.

• బిడ్డ యొక్క మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం., లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం కూడా ఒక కారణంగా ఉంటుంది. ఈ సమస్యతో ఉన్న పిల్లలు, ఎక్కువ కాలం మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది.

• మూత్రాశయం నిండినప్పుడు బాత్రూమ్ వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించడంలో బిడ్డ ఇబ్బందులను ఎదుర్కోవడం.

• బాత్రూమ్ వినియోగించడం గురించిన అవగాహన సరిగ్గా లేకపోవడం, సోమరితనం, లేదా మొండి ప్రవర్తన చూపడం.

• బిడ్డ ఆహారంలో అధికంగా కెఫిన్ లేదా డైయూరిటిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా కూడా, మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది.

2. తదుపరి దశ :

ఒకవేళ పిల్లవాడు ఇప్పటికే పక్కతడపడం ఆపివేసి, పన్నెండు నెలల వ్యవధి దాటిన తర్వాత, మరలా ప్రారంభించిన ఎడల., ఈ దిగువ కారకాలు కారణాలుగా ఉండవచ్చు.

• మధుమేహం

• అతిమూత్ర విసర్జన సమస్య

• యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

• ఒత్తిడి లేదా మానసిక సమస్య

• జన్యుపరమైన సమస్యలు

సమస్య నిర్ధారణ :

సాధారణంగా, పిల్లలు ఏడు సంవత్సరాల వయస్సుకు చేరుకున్న తరువాత, పక్క తడపడం అనేది క్రమంగా తగ్గుతుంది. కావున ఏడు సంవత్సరాలలోపు పిల్లలలో ఈ సమస్య ఉన్న ఎడల, దీనికి ప్రత్యేకించి ఎటువంటి చికిత్సనూ వైద్యులు సూచింపజాలరు. ఇది కేవలం ఈ సమస్యకు చివరి దశగా ఉండవచ్చు. అయితే, మీ బిడ్డ కనీసం 12 నెలలపాటు పక్క తడపడం ఆపివేసి, మరలా ప్రారంభించి, వారానికి కనీసం 3 నుండి 4 మార్లు పక్కతడుపుతూ, మరియు కనీసం రెండు నెలలపాటు కొనసాగిస్తూ కనిపించిన ఎడల, మీరు ఖచ్చితంగా వైద్య సహాయాన్ని తీసుకోవలసి ఉంటుంది.

మీ వైద్యునికి, ఆ పాప/బాబు యొక్క పూర్తి వైద్య చరిత్ర అవసరం కావొచ్చు. మరియు మీ బిడ్డ పక్క తడపడానికిగల ఖచ్చితమైన కారణం కొరకు, కొన్ని పరీక్షలు చేయించవలసి ఉంటుంది కూడా.

పిల్లల్లో పక్కతడిపే సమస్య ఎక్కువ అవుతున్నట్లుగా భావించిన ఎడల, సమస్య తగ్గుదలకు సూచించదగిన గృహ చిట్కాలు :

పై సమస్యకు జీవనశైలి మార్పులే కాకుండా, ఆహార ప్రణాళికలో కొన్ని మార్పులను జోడించడం ద్వారా కూడా, ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించవచ్చునని చెప్పబడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, పిల్లల్లో పక్క తడపడం తగ్గించేందుకు కొన్ని ఆహారాలు సానుకూల ప్రభావాన్ని కలిగి ఉన్నట్లుగా ధ్రువీకరించారు.

1. క్రాన్బెర్రీ జ్యూస్ :

1. క్రాన్బెర్రీ జ్యూస్ :

పక్కతడపడం తగ్గించడంలో క్రాన్బెర్రీ జ్యూస్ ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పబడింది. క్రాన్బెర్రీ జ్యూస్ ను రాత్రి పడకకు ఉపక్రమించే ముందుగా తీసుకోవడం ద్వారా, సమస్యను తగ్గించవచ్చునని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అత్యంత ప్రభావవంతమైన నివారణలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది కూడా. ఇది ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యను తగ్గించడంలో ఎంతో కీలకంగా సహాయపడుతుంది.

2. వాల్ నట్స్ మరియు కిస్ మిస్ :

2. వాల్ నట్స్ మరియు కిస్ మిస్ :

సహజ సిద్దమైన ఫైబర్ సమృద్ధిగా ఉండే వాల్ నట్స్ మరియు కిస్ మిస్ లు మీ బిడ్డ పక్కతడిపే సమస్యను నిరోధించడానికి సూచించదగిన మరో సమర్థవంతమైన గృహ చిట్కాగా ఉంటాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది పిల్లల పెరుగుదలకు సహాయపడే ముఖ్య ఖనిజంగా చెప్పబడుతుంది.

3. తృణధాన్యాలు :

3. తృణధాన్యాలు :

తృణధాన్యాలు పిల్లల్లో నీటి నిలుపుదల సామర్ధ్యాన్ని పెంచడానికి దోహదపడగలవు. ఓట్స్, పుడ్ రైస్, కార్న్ ఫ్లేక్స్ లేదా గోధుమ పొట్టు వంటి ధాన్యాలు మీ బిడ్డ పక్కతడిపే సమస్యను సమర్ధవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి.

4. అరటిపండ్లు :

4. అరటిపండ్లు :

అరటిపండ్లు మరో ప్రసిద్ది చెందిన అద్భుతమైన గృహ చిట్కాగా చెప్పబడుతుంది. ఇవి జీర్ణ వ్యవస్థకు సహకారాన్ని అందివ్వడమే కాకుండా, మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడంలో ఉత్తమంగా సహాయపడగలదని చెప్పబడింది. అయితే, రాత్రిపూట అరటిపండ్లను తీసుకోవడం మూలంగా కఫం చేరే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, సాయంత్రం వేళల్లోనే అరటిపండును ఇవ్వడం మంచిదిగా సూచింపబడుతుంది.

5. దాల్చిన చెక్క మరియు తేనె :

5. దాల్చిన చెక్క మరియు తేనె :

దాల్చిన చెక్క మరియు తేనెలో ఉండే గుణాలు పిల్లల్లో పక్క తడిపే అలవాటును నివారించడంలో ఎంతగానో సహాయపడగలవని చెప్పబడుతుంది. అంతేకాకుండా, పీడియాట్రిక్ డయాబెటిస్ (పిల్లల్లో మధుమేహం) సమస్య చికిత్సలో కూడా సహకారాన్ని అందివ్వగలవని చెప్పబడింది.

6. తులసి :

6. తులసి :

పిల్లల్లో పక్క తడిపే అలవాటును తగ్గించడంలో, తులసిని పూర్వీకుల వైద్యంగా చెప్పబడుతుంది. కొన్ని తులసి ఆకులను వేయించి, తేనెతో కలిపి, ఇవ్వడం మూలంగా, సమస్య పరిష్కారానికి సహాయపడగలదని చెప్పబడుతుంది. తులసిలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు, మూత్రాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది.

7. హెర్బల్ టీ :

7. హెర్బల్ టీ :

సువో క్వాన్ వాన్ పొడితో తయారుచేసిన హెర్బల్ టీ నిద్రకు ముందు ఒక కప్పును ఇవ్వడం ద్వారా, అతి మూత్ర విసర్జనను నిరోధించగలదని చెప్పబడుతుంది. పిల్లలకు హెర్బల్ టీ అలవాటు చేయడం కొంత కష్టంగా ఉండవచ్చు. అయితే దానిని స్థిరంగా వినియోగించడం మూలంగా, మీ బిడ్డ పక్కతడిపే అలవాటు నుండి బయటపడవచ్చు.

8. స్వీట్స్ నివారించడం :

8. స్వీట్స్ నివారించడం :

స్వీట్లు మరియు చాక్లెట్ల తయారీలో ఉపయోగించే కృత్రిమ రాసాయలనాలు, చక్కెరలు పిల్లలలో రాత్రి సమయంలో కొన్ని జీవక్రియలకు దారితీయవచ్చు. క్రమంగా మీ బిడ్డ పక్కతడిపే అలవాటును కలిగి ఉండవచ్చు కూడా. కావున మీ బిడ్డ పడకకు ఉపక్రమించే ముందు, స్వీట్లు లేదా చాక్లెట్ల జోలికి వెళ్ళడంలేదని నిర్ధారించుకోవడం మంచిదిగా సూచించబడుతుంది.

English summary

Home Remedies For Bedwetting in Children

Typically, children stop bed-wetting by the age of seven. Doctors do not advice any kind of assistance for bed-wetting in children below seven years. However, if your child has stopped bed-wetting for at least 12 months and started again, wetting the bed as often as 3-4 times a week and has been through this for at least a couple of months,
Story first published:Saturday, May 11, 2019, 13:01 [IST]
Desktop Bottom Promotion