Just In
- 7 min ago
పిల్లలను మీజిల్స్, రుబెల్లా కాపాడుకోవడానికి ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోండి
- 1 hr ago
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- 1 hr ago
ఇంట్లో తులసి మొక్క ఎండిపోయిందా? జీవితంపై విపరీత ప్రభావం పడుతుంది
- 9 hrs ago
Today Rasi Palalu 06 February 2023: ఈరోజు మేషరాశికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి,తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసు
సృజనాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండేలా పిల్లలను ఇలా పెంచండి
ప్రకాశవంతమైన మనస్సుతో సృజనాత్మక పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులు ఓర్పు, అంకితభావంపై ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వారికి పరిస్థితులపై ఎలాంటి అవగాహన వస్తోందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. చాలా మంది పిల్లల్లో సహజమైన సృజనాత్మకత ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించగలిగితే వాళ్లు అద్భుతాలు చేస్తారు.
అందుకే పిల్లలను ఎలా పెంచాలనేది తల్లిదండ్రులకు తెలిసి ఉండాలని అంటారు నిపుణులు. సృజనాత్మక పిల్లలను ఎలా పెంచాలి, ఎలా పెంచితే వారు సృజనాత్మకంగా ఎదుగుతారులో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్వేషణ, ప్రయోగాలను ప్రోత్సహించాలి:
పిల్లలు ప్రయోగాత్మక కార్యకలాపాలు, అన్వేషణ ద్వారా చాలా నేర్చుకుంటారు. కొత్త విషయాలను ప్రయత్నించడానికి, ప్రయోగాలు చేయడానికి, ప్రశ్నలు అడగడానికి పిల్లలను ప్రోత్సహించాలి. ఇది వారి విమర్శనాత్మక ఆలోచన, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
అపార్ట్మెంట్
కొంటున్నారా?
అయితే
ఈ
వాస్తు
చిట్కాలు
మీకోసమే

అనుభవాలు అందించాలి:
పిల్లలు వారి సృజనాత్మక మేధస్సును అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి వివిధ అనుభవాలను అందించాలి. ఇది పఠనం, కళ, సంగీతం, క్రీడలు ఇలా ప్రతీది వారికి అనుభవపూర్వకంగా తెలియాలి. పిల్లలను మ్యూజియంలు, ప్రకృతి సంరక్షణ విహారయాత్రలకు తీసుకువెళ్లాలి. విభిన్న సంస్కృతులు, జీవిన విధానాలు వారికి తెలిసేలా చేయాలి.
Republic
Day
2023:
భారత
రాజ్యాంగం
గురించి
తప్పక
తెలుసుకోవాల్సిన
విషయాలు

సొంత ఆలోచనలను ప్రోత్సహించాలి:
సృజనాత్మక పిల్లలు తరచుగా ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా ఆలోచిస్తారు. మీ పిల్లల గురించి ఆలోచించమని, సొంత ఆలోచనలతో రావాలని వారిని ప్రోత్సహించాలి. వారికి ఎప్పుడూ సమాధానాలు ఇవ్వొద్దు. దానికి బదులుగా వారినే సమాధానాలు కనుక్కోమని చెప్పాలి. అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో వారికి సహాయం చేయాలి.
Natioanl
Girl
Child
Day
2023:
భారత్‌లో
బాలికల
కోసం
ఉన్న
ప్రభుత్వ
పథకాలు
ఎన్నంటే..

వారికి ఇష్టమైన వాటికి మద్దతు ఇవ్వాలి:
పిల్లలకు తరచుగా సహజమైన ఉత్సుకత మరియు ఆసక్తులు ఉంటాయి. మీ పిల్లల అభిరుచులకు మద్దతు ఇవ్వాలి. వాటిని కొనసాగించడానికి అవసరమైన వనరులు కల్పించాలి. ఇది వారి నైపుణ్యాలు, ప్రతిభను అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడుతుంది.
మీ
భర్త
మీతో
కంటే
ఫ్రెండ్స్‌తోనే
ఎక్కువ
టైం
గడుపుతున్నారా?

పిల్లలను అర్థం చేసుకోవాలి:
పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు, వారి అవసరాలు ఏంటి ఇలా వారి గురించి ప్రతి రోజు తెలుసుకుంటూ ఉండాలి. అలాగే వారికి పుస్తక పఠనం అలవాటు చేయాలి. వారిని చదవమని ప్రోత్సహించాలి. చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, గ్రహణశక్తి మెరుగుపడుతుందని అర్థమయ్యేలా చెప్పాలి.
ఈ
పూల
మొక్కలు
ఇంట్లో
పెంచుకుంటే
వాస్తు
దోషం
తొలగిపోయి
మంచి
జరుగుతుంది

పిల్లలతో మాట్లాడాలి:
పిల్లల సృజనాత్మకత మరియు తెలివితేటలను అభివృద్ధి చేయడంలో కమ్యూనికేషన్ చాలా కీలకం. మీ పిల్లలతో క్రమం తప్పకుండా మాట్లాడాలి. వారు చెప్పేది వినాలి. వారిని ప్రశ్నలు అడగాలి. వారి ఆలోచనలు, భావాలను వ్యక్తీకరించడానికి వారిని ప్రోత్సహించాలి.
'కోరిక'
ఉంటేనే
సంబంధం
సజావుగా
సాగుతుంది,
దానిని
సజీవంగా
ఉంచడం
ఎలాగంటే..

నియమాల కంటే విలువలపై దృష్టి పెట్టాలి:
సృజనాత్మక పిల్లలు పెద్దలను మెప్పించడానికి అన్ని నియమాలను విధేయతతో పాటించరు. పిల్లలకు ఆరోగ్యకరమైన విలువలను నేర్పడం ద్వారా పాజిటివ్ క్యారెక్టర్‌తో పెంచాలనే ఆలోచనతో ఉండాలి. నియమాలు ఉన్నప్పటికీ, వాటి గురించి పారదర్శకంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి. తద్వారా అవి ఎందుకు ఉన్నాయో పిల్లలు అర్థం చేసుకుంటారు.
సృజనాత్మకత అనేది జీవన విధానం. ఆడటానికో, పెయింటింగ్ వేయడానికో దానిని పరిమితం చేయకూడదు. పిల్లలు వారి సొంత ప్రత్యేక మాగంలో సృజనాత్మకంగా ఉండేలా చూసుకోవాలి. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదని, కష్టాలు వస్తాయని కానీ వాటిని ఎదురించి నిలబడటానికి అవకాశాలు ఉంటాయని అర్థమయ్యేలా చెప్పాలి.
ప్రకాశవంతమైన మనస్సుతో సృజనాత్మక పిల్లలను పెంచడానికి ప్రోత్సాహం, ఎక్స్‌పోజర్, మద్దతు, కమ్యూనికేషన్ వంటివి చాలా అవసరం. పిల్లలకు సరైన వనరులు, అవకాశాలను అందించడం ద్వారా వారి సహజమైన ఉత్సుకతను, ప్రతిభను పెంపొందించడం ద్వారా మీరు వారిని ఉత్తమంగా తీర్చిదిద్దగలరు.
పురుషుల్లో
వంధ్యత్వానికి
మద్యమే
కారణం!
తాగితే
ఏం
జరుగుతుందంటే..