Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Confidence In Kids: తల్లిదండ్రులు చేసే ఈ తప్పుల వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోతారు
పిల్లలకు పనులు చెప్పడానికి చాలా మంది తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపించరు. చిన్న చిన్న పనులు అప్పగించడానికి కూడా వెనకాడతారు. వారు చేయగలిగే పనులే అయినప్పటికీ వారితో చేయించరు.
పిల్లలు ఎలా ఉండాలన్నది, ఎలా ఉంటారన్నది పూర్తిగా తల్లిదండ్రులు, పెరిగిన వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది. వారిని ఎలా పెంచితే అలాగే పెరుగుతారు. పిల్లలు పూర్తి ఆత్మవిశ్వాసంతో, అన్నింటిలో ముందు ఉండాలని, చురుకుగా ఉండాలని కోరుకుంటే చిన్నప్పటి నుండి అలాగే పెంచాల్సి ఉంటుంది. చిన్నప్పటి నుండే వారిలో ఆత్మవిశ్వాసాన్ని, సృజనను, చురుకుదనాన్ని ప్రోత్సహించాలి. పిల్లలు భయంభయంగా ఉన్నా, చేసే పనిలో ఆత్మవిశ్వాసం కనబరచపోయినా, చురుకుగా లేకపోయినా దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు వారి పెంపకమే.

పిల్లల్లో ఆత్మవిశ్వాసం లేకపోవడానికి చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు అవలంభిస్తున్న పద్ధతులు ప్రధాన కారణం. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా తల్లిదండ్రులు చేసే ఏడు తప్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. బాధ్యతల నుండి తప్పించుకునే వీలు కల్పించడం
పిల్లలకు పనులు చెప్పడానికి చాలా మంది తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపించరు. చిన్న చిన్న పనులు అప్పగించడానికి కూడా వెనకాడతారు. వారు చేయగలిగే పనులే అయినప్పటికీ వారితో చేయించరు.
పిల్లలకు వారి వయస్సుకు తగ్గ పనులు చేయడం నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ అలా చేయకపోవడం వల్ల పిల్లల్లో పనులు చేయాలన్న ఆసక్తి, చేసే నేర్పు, నైపుణ్యం అలవడవని నిపుణులు చెబుతున్నారు. పనులు చేయడం తెలిసినప్పుడే పిల్లలు ఆత్మవిశ్వాసం చూపిస్తారు.

2. తప్పులు చేయకుండా నిరోధించడం
తప్పులు చేయడం నేర్చుకోవడంలో ఒక భాగం. తప్పులు చేస్తున్నారంటే వాళ్లు పని చేస్తున్నారని అర్థం. తప్పులు చేసినా వాటిని మరోసారి పునరావృతం కాకుండా చూడటం ఎలా అనేది వారి నేర్పాలి. అంతేకానీ తప్పులు అస్సలే చేయవద్దని వారిని కట్టడి చేయకూడదు.
తప్పులు జీవితానికి గొప్ప గురువులు. తమకు తాము నేర్చుకునే వీలు కల్పిస్తాయి. కొత్తగా ఆలోచించడానికి ప్రోత్సహిస్తాయి. తిరిగి మళ్లీ ప్రయత్నించినప్పుడు మెరుగ్గా మారడానికి సహాయపడతాయి. కాబట్టి తప్పులు చేయకుండా నిరోధించడం కన్నా.. అవి పునరావృతం కాకుండా వారికై నైపుణ్యాలు నేర్పడం ముఖ్యం.

3. భావోద్వేగాల నుండి రక్షించడం
భావోద్వేగాలు మనిషి యొక్క సహజ లక్షణం. ఒక విషయాన్ని లేదా అంశాన్ని, సంఘటనను అనుభూతి చెందినప్పుడే భావోద్వేగం వస్తుంది.
పిల్లలు వారి భావోద్వేగాలను ప్రేరేపించే వాటిని గుర్తించడంలో తల్లిదండ్రులు సహాయపడాలి. స్వీయ-నియంత్రణ ఎలా చేయాలి వారికి నేర్పించాలి. ఒక సంఘటన పట్ల ఎలా భావిస్తున్నారో వివరించేందుకు సహాయపడాలి. తద్వారా భవిష్యత్తులో సామాజికంగా తగిన విధంగా భావోద్వేగాలను నియంత్రించుకోగలరు.

4. మన్నించగలగాలి
పిల్లలు వారి తోటి వారితో తమను పోల్చుకుంటారు. వారికి ఉన్న కొత్త బట్టలు, బూట్లు, ఇతర ఆటవస్తువులు తమకు లేవని మదనపడతారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులుగా వారికి అండగా నిలవాలి కానీ తిట్టడమో, కొట్టడమో చేయకూడదు.
ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకునే స్థాయి వారికి ఉండదు కాబట్టి డబ్బు సంపాదన, ఖర్చు గురించి వారికి తెలియజెప్పాలి. అలాంటి విషయాలను వారితో పంచుకోవడం వల్ల చిన్నప్పటి నుండే విషయాలు అవగతం అవుతాయి. అది వారిలో ప్రేరణను పెంపొందిస్తుంది.

5. ఓవర్ ప్రొటెక్షన్
పిల్లలకు రక్షణ కల్పించడం తల్లిదండ్రులగా వారి బాధ్యత. అయితే ఈ రక్షణ అనేది వారికి అసౌకర్యంగా ఉండకూడదు. వారికి కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డుపడకూడదు.
కొంత వయస్సు వచ్చాక వారికి గైడ్‌గా వ్యవహరించడం తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ప్రతి పనిలో వారికి మీ గైడెన్స్ ఇవ్వాలి. అంతే కానీ వారిని బలవంత పెట్టొద్దు. అదే పని చెప్పినట్లుగా మాత్రమే చేయాలని ఆదేశించొద్దు.

6. పర్‌ఫెక్షన్‌ను ఆశించడం
పిల్లలపై ఎప్పుడూ అధికంగా అంచనాలు పెట్టుకోకూడదు. మీ అంచనాలు వారిపై ఒత్తిడి కలిగిస్తాయి. ఈ ఒత్తిడి వల్ల వారి పనితీరు తగ్గుతుంది.
దానికి బదులు వారికి లాంగ్‌టర్మ్ గోల్ ఇవ్వాలి. ఆ గోల్ అందుకునే మార్గంలో చిన్న చిన్న మైలు రాళ్లను సెట్ చేయాలి. ఒక్కో మైలు రాయిని అందుకున్నప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది.



Click it and Unblock the Notifications