Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Winter pregnancy: చలికాలంలో గర్భిణీలు ఇవి కచ్చితంగా తినాలి.. లేకపోతే బిడ్డకే ప్రమాదం!
చలికాలంలో సాధారణంగా ప్రతి ఒక్కరికీ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. గర్భిణీ స్త్రీలకు మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే గర్భిణీలు ఎక్కువగా జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతుంటారు. ఇవి వారి శరీరంతో పాటు గర్భంలోని చిన్నారి ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అందుకే గర్భిణీలు ఈ శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ఆహరం
చలికాలంలో గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో పాటు తమ ఆహారంలో బాదం, వాల్‌నట్లను జత చేసుకోవాలి. ఇందులో విటమిన్-ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే గర్భంలోని చిన్నారి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

చలికాలంలో గర్భిణీల ఆరోగ్యం మెరుగ్గా ఉండడంతో పాటు వారి రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్-సీ ఉన్న పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఈ కాలంలో ఎక్కువగా లభించే పాలకూరను కొంచెం ఎక్కువగా తినాలి. అలాగే ఇతర ఆకు కూరలను కూడా తీసుకోవడం మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు.
పాలకూర తింటే
పాలకూర తింటే గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. ఇందులో ఐరన్‌తో పాటు ఫోలేట్, యాంటీ యాక్సిడెంట్ కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి రక్త కణాల తయారీలో ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే చలికాలంలో గర్భిణీ స్త్రీలు చేపలను ఎక్కువగా తినాలి. చేపలను తినడం వల్ల కడుపులోని పిల్లల మెదడు బాగా వృద్ధి చెందుతుంది.
దుంపలు
గర్భిణీ స్తీలు శీతాకాలంలో దుంపలు తినడం వల్ల కూడా అనేక మంచి ప్రయోజనాలను పొందొచ్చు. డంపులు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల పిల్లల మెదడు చురుగ్గా ఉండడంతో పాటు పిల్లలు కూడా చురుగ్గా పెరుగుతారు. అందుకే శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు కచ్చితంగా ఈ ఆహారపు అలవాట్లను తమ డైట్‌లో జత చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలను అయితే పొందొచ్చు.
వ్యాయాయం కూడా
గర్భిణీలు ఎంత ఆరోగ్యకరమైన ఆహరం తిన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డకు తగినంత శక్తి లభిస్తుంది. అలాగే వారి అవయవాలు కూడా మెరుగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. ఇవి తినడంతో పాటు, వ్యాయామం చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడంతో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడొచ్చు.
గమనిక: ఈ స్టోరీలో మేము అందించిన అంశాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని మేము ధ్రువీకరించడం లేదు. పాటించాలని అనుకునే వారు తప్పకుండా ఓసారి వైద్యులను సంప్రదించాలి.



Click it and Unblock the Notifications