Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Mothers Day 2023: బాలింతలకు చిట్కాలు.. వీటితో ఎండాకాలంలోనూ ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు
ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారం రోజు మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతి ఏటా మదర్స్ డే జరుపుకునే తేదీలు మారుతూ ఉంటాయి. 2023 సంవత్సరంలో మే 14వ తేదీన మదర్స్ డే జరుపుకోనున్నాం. ప్రతి ఏటా జరుపుకునే వివిధ రోజులకు ఒక్కో థీమ్ ఉంటుంది. కానీ మదర్స్ డేకు నిర్దిష్ట థీమ్ అంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే మదర్స్ డే ముఖ్య ఉద్దేశమే తల్లులను గౌరవించడం. మాతృత్వం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవడం.

వేసవిలో బాలింతలు ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండొచ్చు
వేసవికాలంలో కొత్తగా డెలివరీ అయిన తల్లులు చాలా అసౌకర్యంగా ఉంటారు. మండిపోయే ఎండలతో ఇంట్లో ఉన్నా ఆ వేడిని భరించలేకపోతుంటారు. బాలింతలు సాధారణంగానే త్వరగా అలసిపోతారు. ఎండాకాలంలో మరింత ఎక్కువగా నీరసించిపోతారు. అయితే వేసవికాలంలో బాలింతలు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి:
న్యూ మామ్స్‌కు ఇది అత్యంత విలువైన చిట్కా. బాలింతలు ఎప్పుడూ శిశువు కోసమే కాకుండా తమకోసం కూడా కొంత సమయాన్ని వెచ్చించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా చాలా అవసరం. అలాగే వాకింగ్ చేయడం, తేలికపాటి వార్మప్స్ వల్ల శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకోవచ్చు.
2. బయటకు వెళ్లాలి:
మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి. ఎప్పుడూ ఇంటిపట్టునే ఉండకుండా సమయం దొరికనప్పుడు అలా బయటకు వెళ్లి ప్రకృతిలో కాసేపు గడపడానికి ప్రయత్నించాలి. బాల్కనీలో, పెరట్లో, దగ్గరే ఉన్న గార్డెన్ లో నడవాలి. తెల్లవారుజామున లేదంటే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత బయటకు వెళ్లాలి.
3. హైడ్రేటెడ్ గా ఉండాలి:
కాలంతో సంబంధం లేకుండా హైడ్రేటెడ్ గా ఉండటానికి ప్రయత్నించాలి. మరీ ముఖ్యంగా వేసవికాలంలో పుష్కలంగా నీరు తాగాలి. దాహం వేయకపోయినా కొద్ది కొద్దిగా నీరు తాగుతుండాలి. కెఫిన్, కూల్స్ డ్రింక్స్ అస్సలే తాగొద్దు. వీటి వల్ల మరింత వేగంగా డీహైడ్రేషన్ కు గురవుతారు. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినడం మానేయాలి.
4. సమతుల్య ఆహారం తీసుకోవాలి:
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం చాలా కీలకం. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా ఉండేలా డైట్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ ఫుడ్స్, కార్బొనేటెడ్ వాటర్ లాంటివి తీసుకోవద్దు. తగినన్ని నీరు తాగడంతో పాటు తాజాగా పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.
5. ఇతర తల్లులతో మాట్లాడాలి:
ఇతర తల్లులతో మాట్లాడటం వల్ల వారి నుండి చాలా టిప్స్ తెలుసుకోవచ్చు. ఒకరి అనుభవాలను ఒకరితో పంచుకోవచ్చు. శిశువు ఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యంపై ఉండే అనుమానాలు చాలా వరకు నివృత్తి అవుతాయి. దాని వల్ల లేనిపోని విషయాలపై ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications