Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
Mothers Day 2023: ఈమధ్యే డెలివరీ అయిందా? ఈ డ్రింక్స్ తాగితే త్వరగా కోలుకుంటారు
డెలివరీ తర్వాత తల్లుల ఆరోగ్యపరంగా చాలా సున్నితంగా మారతారు. వారి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. దేనికీ తట్టుకోలేరు. శరీరం కూడా సున్నితంగా మారుతుంది. అందుకే బాలింతలను కూడా చిన్న పిల్లల మాదిరే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ సమయంలో వారి రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. త్వరగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
బాలింతలకు తగినంత నిద్ర, విశ్రాంతి, పోషకారం, ఇతరుల సహాయం చాలా అవసరం. వీటి వల్ల వారు త్వరగా కోలుకోవడానికి వీలవుతుంది. డెలివరీ అయిన తర్వాత కొన్ని రకాల పానీయాలు తీసుకుంటే త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. మదర్స్ డే 2023 సందర్భంగా కొత్తగా డెలివరీ అయిన వారికి ఎలాంటి డ్రింక్స్ ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీరు తాగితే తక్షణ శక్తి వస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. కొబ్బరి నీటిలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది.
2. గ్రీన్ స్మూతీస్:
శరీరానికి వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు అందించడానికి గ్రీన్ స్మూతీస్ మంచి మార్గం. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ స్మూతీస్ వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. బచ్చలికూర, అరటి పండ్లు, బ్లూబెర్రీలతో తయారు చేసిన గ్రీన్ స్మూతీలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
3. బోన్ బ్రాత్:
బాలింతల ఆరోగ్యానికి బోన్ బ్రాత్ అంటే ఎముకలతో చేసే రసం చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బోన్ బ్రాత్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కొల్లాజెన్ సమృద్ధిగా లభిస్తుంది. చర్మాన్ని, కీళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
4. కొంబుచా:
బాలింతలకు కొంబుచా వల్ల సమృద్ధిగా ప్రోబయోటిక్స్ లభిస్తాయి. ఇది ప్రేగులను ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహాయం చేస్తాయి. కొంబుచాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
5. హెర్బల్ టీ:
హెర్బల్ టీలు శరీరంలోకి వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలను పొందడానికి గొప్ప మార్గం. హెర్బల్ టీలు తాగడం వల్ల శక్తిని పుంచుకోవచ్చు. చమోమిలే, పిప్పరమెంట్, అల్లం టీలు మంచి ఎంపిక.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications