Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్
సింగిల్ చైల్డ్ పెంపకంపై అపోహలా.. అవన్నీ ఉత్తవే, చేయాల్సిందిదే!
ఈ మధ్య కాలంలో చాలా మంది సింగిల్ చైల్డ్ తోనే సంతృప్తి పడుతున్నారు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యల కారణంగా ఒక్కరినే కంటున్నారు. కానీ పెంచేటప్పుడు మాత్రం తమ పిల్లలు ఒంటరిగా ఉంటారని చాలా ఫీలైపోతుంటారు తల్లిదండ్రులు. వారితో పాటు వారి బంధువులు, స్నేహితులు కూడా ఇలాగే అనుకుంటారు. అయితే చాలా మందికి సింగిల్ చైల్డ్ పెంపకంపై అనేక అపోహలు ఉంటాయి. అయితే ఈ అపోహలన్నీ వదిలి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
1. ఒంటరితనం
సింగిల్ చైల్డ్ అనగానే.. చాలా మందికి ఒంటిరిగా ఉంటారనే భావన ఉంటుంది. అయితే ప్రతీ ఒక్కరూ ఒకానొక సమయంలో ఒంటరిగా ఫీలవుతారు. కరోనా సమయంలో చాలా మంది ఇలాంటి భావనకు గురయ్యారు. సింగిల్ చైల్డ్ తన వద్ద ఉన్న సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, తనతో తాను ఎలా ఎంజాయ్ చేయాలో నేర్చుకుంటారు. వీరికి తోబుట్టువులు లేకపోయినా గొప్ప స్నేహితులు ఉంటారు.

2. దూకుడుగా ఉండడం
సింగిల్ చైల్డ్ దూకుడుగా ప్రవర్తిస్తాడని అంతా అనుకుంటారు. కానీ అలా ఏం ఉండదు. కొందలు అలా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. మరికొందరు అలా ఉండరు. సింగిల్ చైల్డ్ పాఠశాలలో అన్ని కార్యక్రమాల్లో భాగమయ్యేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. తోబుట్టువులు ఉన్న పిల్లలైన, ఒంటరిగా ఉన్న పిల్లలైనా ఎక్కువ మందితో ఉన్నప్పుడు ఎలా మెలగాలో తల్లిదండ్రులే నేర్పించాలి.
3. ఎక్కువగా ఆధారపడడం
పిల్లలు మానసికంగా శారీరకంగా ఒకరిపై ఆధారపడడం చాలా కామన్. తోబుట్టువులు, తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఈ పిల్లలు వారి సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవడం నేర్చుకుంటారు. తోబుట్టువులతో ఉన్న పిల్లలకంటే సింగిల్ చైల్డ్ స్వతంత్రాన్ని కల్గి ఉంటారు. అర్థం చేసుకునే సామర్థ్యం, ఒకరి విషయాన్ని మరొకరితో పంచుకోకుండా ఉండడం వంటివి చేస్తుంటారు.
4. పరిపక్వత చెందేందుకు ఎక్కువ సమయం
తోబుట్టువులతో ఉన్న పిల్లలు తోబుట్టువులను చూసి నేర్చుకుంటారు. కానీ సింగిల్ చైల్డ్ వారి తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతుంటారు. వారినే అనుకరిస్తారు. వారి ప్రవర్తన, ఆలోచనా విధానం తల్లిదండ్రులను పోలి ఉంటుంది. వీళ్లు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు అవసరమైన వారు సర్వైకల్ కిట్ కి ఇది అవసరం. పిల్లలందరిలో గ్రోత్ గ్రాఫ్ భిన్నంగా ఉంటుంది.
5. అవి చాలా సున్నితంగా ఉంటారు
సింగిల్ చైల్డ్ చాలా సార్లు అతిగా స్పందించే అవకాశం ఉంటుంది. తేలికగా వారు గాయపడతారు. తోబుట్టువులతో పోలిస్తే.. వీళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలనే భావాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా వీళ్ల తల్లిదండ్రులు వీరికి చాలా సన్నిహితంగా ఉంటారు. సింగిల్ చైల్డ్ తోబుట్టువులు కావాలని చాలా సార్లు భావించినప్పటికీ.. తల్లిదండ్రుల ప్రేమతో దాన్ని మర్చిపోయి వారి బంధాన్ని బలపరుచుకుంటూ ఉంటారు.



Click it and Unblock the Notifications
