Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పాలిచ్చే తల్లులు ఎలాంటి మందులూ వేసుకోవద్దు.. నిజమేనా? వైద్యులేం చెబుతున్నారంటే?
పాలిచ్చే తల్లులు అనగానే ఎక్కడలేని జాగ్రత్తలు చెబుతుంటారు ఇంట్లో ఉన్న పెద్దలు. అది తినొద్దు, ఇది తినొద్దు, చల్లని, వేడి ఆహారాలు తినొద్దు, తాగొద్దు అంటుంటారు. కొన్ని రకాల పనులు చేయడాన్ని కూడా వద్దని వారిస్తుంటారు. బిడ్డకు పాలిచ్చే తల్లులు ఎలాంటి మందులు వాడొద్దని, జలుబైనా, దగ్గైనా, జ్వరం వచ్చినా మందులు వేసుకోవద్దని చెబుతుంటారు.
పాలిచ్చే తల్లులు జ్వరం వచ్చినా మందులు తీసుకోవద్దా.. పెద్దలు చెప్పేదాంట్లో నిజం ఎంత, మందులు వేసుకుంటే ఏమవుతుందో.. అపోహలేంటో, నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలిచ్చే తల్లులు మందులు వేసుకోవద్దు!
పాలిచ్చే తల్లులు మందులు వేసుకోవద్దని చాలా మంది చెబుతుంటారు. ఇంట్లోని పెద్దలు ఎప్పుడూ చెప్పే మాట. చాలా మంది ఇది నిజమా కాదా అని కూడా ఆలోచించకుండా పెద్దల మటాలను పాటిస్తుంటారు. అయితే పాలిచ్చే తల్లులు మందులు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. అయితే మీకున్న ఆరోగ్య సమస్య గురించి వైద్యులను సంప్రదించే వారు సూచించే మందులను, వారు సూచించే మోతాదులోనే వాడటం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదు.
పాలిచ్చే తల్లులు వేసుకునే మందులు పాలలో కలుస్తాయి!
తీసుకునే మందులు శరీరంలో కరిగిపోతాయి. అందులోని యాంటీ బ్యాక్టీరియా, ఇతర సమ్మేళనాలు రక్తంలో కలిసి శరీరం అంతటికీ వెళ్తాయి. అయితే ఈ మందులు పాలలో కలవడం అనేది చాలా చాలా తక్కువ. దీని వల్ల ఎలాంటి సంభావ్య దుష్ప్రభావాలు కలగవు. అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే వైద్యులు సూచించిన మందులు వాడటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.
ప్రిస్క్రిప్షన్ మందులకంటే ఓవర్ ది కౌంటర్ మందులు సురిక్షితం!
ప్రిస్క్రిప్షన్ మందులైనా, ఓవర్-ది-కౌంటర్ మందులైనా రెండూ పాలిచ్చే తల్లులకు హానికరం కాదు. అయినప్పటికీ.. ఏవైనా మందులు తీసుకునే ముందు సంబంధిత వైద్యులను సంప్రదించం మంచిది.
నేచురల్ రెమెడీలతోనే మంచి ఫలితం!
పాలిచ్చే తల్లులకు ఏదైనా జబ్బు చేస్తే.. సహజ నివారణలు మంచి ఫలితాన్ని ఇవ్వగలవు. కానీ అన్నిసార్లు ఫలితం బాగుండకపోవచ్చు. కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు. అందుకే కొత్త మందులు, కషాయాలు, మూలికలు వాడే ముందు.. మొదట తక్కువ మొత్తంలో తీసుకుని పరీక్షించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించుకున్నాకే ఆయా చిట్కాలు పాటించడం మంచిది.
మందులు వేసుకోవాలనుకుంటే పాలివ్వడం మానేయాలి!
పాలిచ్చే తల్లులు ఔషధాలను తీసుకుంటూ కూడా పాలు ఇవ్వవచ్చ. దాని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. వైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులను వాడుతూ చక్కగా పాలు ఇవ్వవచ్చు.
పాలిచ్చే తల్లులైనా, మరెవరైనా.. ఏదైనా జబ్బు బారిన పడితే.. సహజ నివారణలు ప్రయత్నించవచ్చు. అయిప్పటికీ జబ్బు తగ్గకపోయినా, మరింత తీవ్రం అయినా.. సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం చాలా మంచిది. వారు అవసరమైన పరీక్షలు చేసి రోగాన్ని నిర్ధారించి, ఆ జబ్బును తగ్గించేందుకు అవసరమైన మందులు, మోతాదులు సూచిస్తారు. వారి సూచన మేరకు చికిత్స తీసుకుంటే జబ్బులు తగ్గే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications